birthmarks
-
అవి నాకు సూపర్ స్పెషల్
‘‘నిన్ను నిన్నులా ఉంచే నీలోని ప్రతి విషయం ప్రత్యేకమైనదే’’ అని అంటున్నారు శ్రుతీహాసన్. సెల్ఫ్‌లవ్ (మనల్ని మనం ఇష్టపడటం) గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘మనం ఎలా ఉన్నామో అలా మనల్ని మనం స్వీకరించుకోవాలి. నా కళ్లను గమనిస్తే నల్లని మచ్చలు కనబడతాయి. అవును.. నా కళ్లలో పుట్టుమచ్చలు ఉన్నాయి. దానికి నేనేం బాధపడటంలేదు. ఇది జబ్బు కూడా కాదు. ఆ మచ్చలు నా కళ్లలో ఎప్పటినుంచో ఉన్నాయి. అవి నాకు సూపర్ స్పెషల్. మనల్ని మనలా గుర్తించే ప్రతి అంశం మనకు గొప్పదే’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. అలాగే తన కంటిలో ఉన్న పుట్టుమచ్చలు కనిపించేలా ఓ ఫొటోను షేర్ చేశారామె. ఇక సినిమాల విషయానికి వస్తే... తెలుగులో రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’, తమిళంలో విజయ్‌సేతుపతి నటిస్తున్న ‘లాభం’ చిత్రాల్లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
రజనీ అల్లుడు ధనుష్‌కు భారీ ఊరట!
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు ఊరట లభించింది. ధనుష్ తమ కొడుకేనంటూ మేలూరు వృద్ధ దంపతులు వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కొట్టిపారేసింది. నటుడు ధనుష్ తమ కుమారుడేనని, చిన్నప్పుడు స్కూలు చదువు మధ్యలోనే మానేసి.. ఇంటి నుంచి పారిపోయాడని మేలూరుకు చెందిన కదిరేశన్-మీనాక్షి దంపతులు మధురై కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి కొన్ని పత్రాలను సైతం కోర్టుకు ఆ దంపతులు సమర్పించారు. దీంతో పుట్టుమచ్చలు చూపించాలని హీరో ధనుష్‌కు కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో ఆ దంపతులు పేర్కొన్నవిధంగా ధనుష్‌కు పుట్టుమచ్చలు లేకపోవడంతో లేజర్ ట్రీట్మెంట్తో ఆయన తొలగించుకొని ఉంటాడని అనుమానాలు వచ్చాయి. ఈ క్రమంలో డీఎన్ఏ టెస్టుకు న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వగా.. అందుకు ధనుష్ నిరాకరించాడు. ఈ క్రమంలో వాదనలు విన్న మధురై బెంచ్ వృద్ధ దంపతుల పిటిషన్‌ను తోసిపుచ్చి.. ధనుష్‌కు ఊరటనిచ్చింది. -
ధనుష్ ఇంటి నుంచి పారిపోయాడు!
చెన్నై: నటుడు ధనుష్ తమ కుమారుడేనని, స్కూలు చదువు మధ్యలోనే ఇంటి నుంచి పారిపోయాడని హీరో తండ్రిగా చెప్పుకుంటున్న కదిరేశన్(65) అంటున్నారు. నేటి ఉదయం హీరో ధనుష్ పుట్టుమచ్చల వెరిఫికోషన్ కోసం మధురై కోర్టుకు హాజరయ్యాడు. రిజిస్ట్రార్ చాంబర్లో ధనుష్ నుంచి బర్త్ మార్క్స్ (పుట్టుమచ్చలు) సేకరించిన తర్వాత కేసును మార్చి 2వ తేదీకి వేశారని కదిరేశన్ చెప్పారు. విచారణ వాయిదా వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధనుష్ తమకు మూడో సంతానమని ఆయన తండ్రిగా పిటిషన్ వేసిన మదురై జిల్లా మేలూర్ గ్రామానికి చెందిన కదిరేశన్ చెప్పారు. ఎనిమిదో తరగతి వరకు ధనుష్ తమ వద్దే ఉన్నాడని, ఆ తర్వాత ధనుష్‌ను స్కూలు మార్పించడంతో పాటు హాస్టల్లో వేశామన్నారు. ఆ సమయంలోనే ధనుష్ చెన్నైకి పారిపోయాడని, సినిమాల్లో చూసి తమ కుమారుడని గుర్తించినట్లు పేర్కొన్నారు. ధనుష్‌ను కలిసేందుకు చాలాసార్లు ప్రయత్నించామని, అందుకు తమకు అవకాశం దక్కలేదని.. దీంతో తాము కోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. ఖర్చుల నిమిత్తం, తమ అవసరాలకు నెలకు రూ.65 వేలు చెల్లించాలని కదిరేశన్, మీనాక్షి దంపతులు పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ధనుష్ తరఫు లాయర్ మాత్రం కదిరేశన్ దంపతుల ఆరోపణల్లో వాస్తవం లేదని మొదటినుంచీ చెబుతూనే ఉన్నారు. ధనుష్ సమర్పించిన బర్త్‌డే సర్టిఫికెట్లో పుట్టిన తేదీ 1983, జూలై28 అని ఉందని జస్టిస్ జి.చోక్కాలింగం గుర్తించారు. ఈ సర్టిఫికెట్లో ధనుష్ పేరు తప్పుగా ఉందని, ఆ సర్టిఫికెట్ 1993 జూన్ 21న ఇష్యూ చేసినట్లుగా ఉందని కదిరేశన్ అంటున్నారు. తమ అబ్బాయి పేరు లేకుండా బర్త్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. గతవారం ధనుష్ టెన్త్ క్లాస్ టీసీని ఇరు వర్గీయులు కోర్టులో ప్రవేశపెట్టగా, ధనుష్ లాయర్ సమర్పించిన దాంట్లో బర్త్ మార్క్స్ లేవు. కదిరేశన్ దంపతులు కోర్టుకు ఇచ్చిన టీసీలో బర్త్ మార్క్స్ ఉన్నాయని, దీంతో ఫిబ్రవరి 28లోగా కోర్టుకు హాజరు కావాలని హీరోని మధురై కోర్టు ఆదేశించింది. నేడు జస్టిస్ చోక్కాలింగం, మద్రాస్ హైకోర్టుకు సంబంధించిన రిజిస్టార్ తన చాంబర్లో ధనుష్ బర్త్ మార్క్స్ వివరాలు సేకరించిన అనంతరం విచారణను మార్చి 2కు వాయిదా వేశారు. ధనుష్ ఈ కేసుకు సంబంధించిన కథనాలు ఆ హీరో పుట్టు మచ్చలు చూపాలి! కోర్టుకు హాజరైన హీరో ధనుష్ -
కోర్టుకు హాజరైన హీరో ధనుష్
చెన్నై: నటుడు ధనుష్ మంగళవారం ఉదయం మధురై కోర్టుకు హాజరయ్యారు. మదురై జిల్లా మేలూర్ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ కుమారుడని పేర్కొంటూ మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు బదులుగా నటుడు ధనుష్ సదరు దంపతులు పేర్కొన్న అంశాల్లో నిజాలు లేవనీ, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా మరో పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ప్రవేశ పెట్టాలని ఇరువురి పిటిషన్ దారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాళ్లు కోర్టుకు అందజేసిన పత్రాలను గతవారం జస్టిస్ జి.చోక్కాలింగం పరిశీలించారు. అయితే కధిరేశన్ దంపతులు కోర్టులో ప్రవేశపెట్టిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొన్నట్లు ఉండగా, ధనుష్ తరఫు లాయర్ సమర్పించిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొనలేక పోవడం గమనార్హం. దీంతో బర్త్ మార్క్స్ (పుట్టుమచ్చలు) వెరిఫికేషన్ కోరకు ఈ నెల 28 లోగా కోర్టుకు హాజరు కావాలని మదురై కోర్టు సూచించింది. ఈ నేపధ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ధనుష్ మంగళవారం ఉదయం మధురై కోర్టుకు హాజరయ్యారు. -
ఆ హీరో పుట్టు మచ్చలు చూపాలి!
చెన్నై: నటుడు ధనుష్‌కు సంబంధించిన ఆధారాలను ప్రవేశపెట్టాలని మద్రాస్ హైకోర్టు పరిధిలోని మదురై కోర్టు ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. మదురై జిల్లా మేలూర్ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ కుమారుడని పేర్కొంటూ మదురై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను, వాళ్లు కోర్టుకు అందజేసిన పత్రాలను జస్టిస్ జి.చోక్కాలింగం పరిశీలించారు. బర్త్ మార్క్స్ (పుట్టుమచ్చలు) వెరిఫికేషన్ కోరకు ఈ నెల 28 లోగా కోర్టుకు హాజరు కావాలని మదురై కోర్టు సూచించింది. హీరో ధనుష్ చెన్నైలోని పాఠశాలలో చదువుకున్న ఆధారాలను, ఆయన పదవ తరగతి పరీక్షలు రాసిన పత్రాలను.. 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో తన పేరును నమోదు చేసినట్లు ఆ దంపతులు కోర్టుకు సమర్పించారు. ధనుష్ తరపు న్యాయవాది సమర్పించిన ఆధారాలు పరిశీలించగా ధనుష్ నటించిన తొలి చిత్రం తుళ్లువదో ఇళమై 2002 మార్చి నెలలో సెన్సార్ పూర్తి చేసుకుని మే నెలలో విడుదలయ్యింది. అయితే అయితే ధనుష్ కోర్టుకు అందజేసిన టెన్త్ క్లాస్ టీసీ లో ఐడెంటిటీ మార్క్స్ పేర్కొనలేదు. మరోవైపు కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టుకు ఇచ్చిన టీసీలో పుట్టుమచ్చల వివరాలు ఉన్నాయి. దీంతో వెరిఫికేషన్ కోసం ధనుష్ ను నేరుగా కోర్టులో హాజరుకావాలని మధురై బెంచ్ ఆదేశించింది. ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. ధనుష్ తరపు న్యాయవాది కధిరేశన్ దంపతుల ఆరోపణల్లో నిజం లేదనీ, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా తన పిటిషన్లో పేర్కొన్నారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కదిరేశన్ దంపతులు కోర్టుకు విన్నవించుకున్న నేపథ్యంలో ధనుష్ తరపున కొన్ని ఆధారాలను ఇరు వర్గాలు కోర్టుకు సమర్పించారు. కధిరేశన్ దంపతులు కోర్టులో ప్రవేశపెట్టిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొన్నట్లు ఉండగా, ధనుష్ తరఫు లాయర్ సమర్పించిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొనలేక పోవడం గమనార్హం. దీంతో ధనుష్ కోర్టుకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు అందజేసింది.