హొసపేటె: 3ఏ కేటగిరి కులాల వారు 2ఏ సర్టిఫికెట్లు పొందకుండా నిరోధించాలని డిమాండ్ చేస్తూ వెనుకబడిన కులాల కూటమి ఆధ్వర్యంలో కూడ్లిగి తాలూకా కానాహొసహళ్లిలో నిరసన తెలిపారు. ఇప్పటికే వాటిని పొందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఒత్తిడి చేశారు. వెనుకబడిన కులాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బుడ్డి బసవరాజ్ మాట్లాడుతూ తప్పుడు పత్రాలు అందించి లింగాయత్, వీరశైవ వర్గాల కేటగిరి 2ఏ సర్టిఫికెట్లు పొందడం అన్యాయమని ఆయన అన్నారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ ఎం.చంద్రమోహన్‌కు అందజేశారు. సంఘం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.