యశవంతపుర: జేడీఎస్ నేత, హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు నిరాశే ఎదురైంది. మహిళపై అత్యాచారం, నగ్న వీడియోల కేసులో అతడు కొన్ని నెలలుగా పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఖైదులో ఉండడం తెలిసిందే. అత్యాచారం కేసును కొట్టివేయాలని ప్రజ్వల్ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. గురువారం పిటిషన్‌పై వాదనలు జరిగాయి. కేసు నుంచి విముక్తి కలిగించడం సాధ్యం కాదంటూ ఈ నెల 9కి వాయిదా వేశారు. ఈ కేసుల్లో గతేడాది మే నెలాఖరులో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి విచారణ సాగుతోంది.
అర్ధరాత్రి ఘోరం.. యువతిపై అత్యాచారం
కృష్ణరాజపురం: యువతిపై ఇద్దరు ఆటోడ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలు.. బెంగళూరులోని కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ సమీపంలో బిహార్‌కు చెందిన యువతి తన సోదరునితో కలిసి కేఆర్‌పురం రైల్వేస్టేషన్‌లో దిగి నడిచి వెళుతుండగా ఇద్దరు ఆటోడ్రైవర్లు నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతి సోదరునిపై దాడి చేశారు. బుధవారం అర్ధరాత్రి 1.13 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. యువతి కేకలను విని అక్కడికి చేరుకున్న జనం ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ జరిపి నిందితుడు ఆసిఫ్‌ను, మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
వ్యాన్ పల్టీ,13 మంది కూలీలకు గాయాలు
మైసూరు: వేగంగా వెళుతున్న గూడ్స్ వ్యాన్ పల్టీలు కొట్టిన ప్రమాదంలో 13 మంది కూలీలు గాయపడ్డారు. జిల్లాలోని హుణసూరు తాలూకాలోని సంజీవనగర వద్ద చోటుచేసుకుంది. హుణసూరుకు చెందిన కూలీలు పొలంలో పనిచేసుకుని గూడ్స్ వ్యాన్‌లో వస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో బోల్తా పడింది. దీంతో చిక్కన్న, పార్థ, కుముద, మంజుల, పార్వతి, చిన్న ముత్తమ్మ, తరికల్ వళ్ళియమ్మ, రాణి, మహదేవమ్మ, మంగళ తదితరు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఐదుమందిని హుణసూరు కావేరి ఆస్పత్రిలో ఐసీయూలో చేర్చారు. మిగతావారు మైసూరు కెఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇంట్లోకి దూరిన చిరుత
● గొళ్లెం వేసిన దంపతులు
● జిగణిలో కలకలం
దొడ్డబళ్లాపురం: ఓ చిరుతపులి ఏకంగా ఇంట్లోకి దూరి హల్‌చల్ చేసింది. ఈ సంఘట బెంగళూరు శివార్లలో ఆనేకల్ తాలూకా జిగణిలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం 8 గంటలప్పుడు వెంకటేశ్ దంపతులు వ్యక్తి ఇంట్లో ఉండగా ఓ చిరుత ప్రవేశించింది. అయితే ఏ మాత్రం బెదరని దంపతులు మెల్లగా లేచి బయటకు వచ్చి తలుపులు గడియ పెట్టేశారు. దీంతో చిరుత లోపల బందీ అయ్యింది. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకున్నారు. చిరుత ఇంట్లోకి దూరిందని తెలిసి వందలాది మంది జనం గుమిగూడి ఏం జరుగుతుందా? అని చూడసాగారు. అటవీ సిబ్బంది సుమారు 6గంటల పాటు శ్రమించి చిరుతకు మత్తుమందు ఇచ్చి బోనులో బంధించారు.
ప్రజ్వల్ కేసు కొట్టివేతకు నో


