రోడ్లు లేని ఊళ్లు, రోగమొస్తే దిగులు
మైసూరు: దేశం ఇప్పటికే అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధిస్తోంది. డిజిటల్ రంగంలో రాణిస్తోంది, కానీ మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలు ఇంకా ఎలాంటి సౌకర్యాలు లేకుండా బతుకీడుస్తున్నారు. దీనికి ఉదాహరణే చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలేమహదేశ్వర బెట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని తుళసికెరె గ్రామం. ఈ గ్రామానికి సరైన రోడ్డు నిర్మాణ వ్యవస్థ లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని కట్టెకు మూటలో కట్టుకుని సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం 4 కిలోమీటర్లు మోసుకెళ్లారు.
ఏమైందంటే...
గ్రామ నివాసి పుట్ట అనే వ్యక్తికి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఉన్నాడు. గ్రామానికి రోడ్డు లేనందున ఆటో, అంబులెన్సు రాలేవు. దీంతో బంధువుల సహాయంతో డోలిలో మలే మహదేశ్వర బెట్టకు తీసుకొచ్చి అక్కడి నుంచి దగ్గరలో ఉండే తమిళనాడు కొళత్తూరు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. బెట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని చాలా గ్రామాలకు సరైన రోడ్డు వ్యవస్థ, మౌలిక వసతులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా కూడా మలే మహదేశ్వరబెట్ట , తుళసికెరె గ్రామం మధ్యలో ధర్నా చేశారు.
డోలిలో 4 కిలోమీటర్లు మోసుకెళ్లారు
చామరాజనగర జిల్లాలో దైన్యం
రోడ్లు లేని ఊళ్లు, రోగమొస్తే దిగులు


