crime capital
-
కరాచీలో పెరిగిన యాచకుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం!
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, సంస్థల నుండి తీసుకున్న రుణాలతో పాక్ రోజులు నెట్టుకొస్తోంది. రంజాన్ మాసంలో పాకిస్తాన్‌లోని కరాచీ నగరం బిచ్చగాళ్ల రాజధానిగా మారింది. దేశంలోని నలుమూలల నుంచి నాలుగు లక్షలకు పైగా యాచకులు కరాచీ చేరుకున్నారని, దీంతో నగరంలో నేరాలు పెరిగాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రంజాన్ మాసంలో కరాచీలోని ప్రతి కూడలిలో యాచకులు దర్శనమిస్తున్నారని, దీనికితోడు నగరంలో ఇటీవలి కాలంలో నేర సంఘటనలు మరింతగా పెరిగాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఉదంతంపై పాక్‌కు చెందిన జియో న్యూస్ ఛానల్ ఒక నివేదికను అందజేసింది. దానిలో కరాచీ పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) ఇమ్రాన్ యాకూబ్ మిన్హాస్ మాట్లాడుతూ, ఈద్, రంజాన్ సమయంలో పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి యాచకులు కరాచీకి వచ్చారని, వారి సంఖ్య సుమారు నాలుగు లక్షల వరకు ఉండవచ్చన్నారు. ప్రస్తుతం కరాచీలో యాచకుల సంఖ్య పెరిగిందని, అలాగే నేరాల సంఖ్య కూడా పెరిగిందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నగర అదనపు ఐజీ మాట్లాడుతూ పాత పద్ధతుల్లో నేరస్తులను పట్టుకోవడం కష్టసాధ్యమని, అందుకే ప్రతి కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఇటీవలి కాలంలో నగరంలో చోటుచేసుకున్న పలు నేరాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారని పలు మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి. -
Bangalore : అడిగినంత ఇస్తారా? లేదా? గృహ ప్రవేశంలో హిజ్రాల గొడవ
యశవంతపుర: ఇంటి గృహ ప్రవేశానికి అడగకుండానే వచ్చి అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కోపంతో హిజ్రాలు అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. వయాలికావల్ సమీపంలో ఒక కుటుంబ బుధవారం గృహ ప్రవేశం చేసుకున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ముగ్గురు హిజ్రాలు ఒక్కసారిగా ఇంటిలోకి చొరబడ్డారు. వారికి ఇంటి యజమానులు భోజనం తినాలని ఆహ్వానించారు. మాకు అన్నం వద్దు, డబ్బులు ఇవ్వాలని హిజ్రాలు కిరికిరి పెట్టారు. ఐదు వందల రూపాయలు ఇవ్వబోగా, ఒక్కొక్కరికి రూ. ఐదు వేలు ఇవ్వాలని గొడవకు దిగారు. అందరినీ నోటికొచ్చినట్లు తిట్టి అసభ్యంగా ప్రవరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. కాగా హిజ్రాలపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులు వీపరీతంగా పెరిగాయని బెంగళూరు వాసులు వాపోతున్నారు. డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే దాడికి దిగడం, డబ్బు/ వస్తువులు బలవంతంగా లాగేసుకోవడం జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరయితే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. -
యూపీలో నేరగాళ్ల ఇష్టారాజ్యం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయన్న పోలీసుల నివేదికను తప్పుపట్టిన ఆమె.. యూపీలో నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర గణాంకాలను తారుమారు చేసిన పోలీసులు నేరాల సంఖ్య తగ్గిందంటూ చెబుతున్నారని అఖిలేశ్ విమర్శించారు. శనివారం ప్రియాంక ట్విట్టర్లో..ఉత్తరప్రదేశ్‌లో నేరగాళ్లు స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. నేర ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. నేరగాళ్లకు సర్కారు లొంగిపోయిందా?’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతోపాటు రాష్ట్రంలో నేరాలపై పలు నివేదికలను జత చేశారు. దీనిపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్ స్పందించారు. ‘మా ప్రభుత్వం నేరగాళ్ల నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసింది. నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తోంది. నేరాలు తగ్గాయి’ అని పేర్కొన్నారు. -
దేశ నేర రాజధాని యూపీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపణ న్యూఢిల్లీ: దేశంలో నేర రాజధానిగా యూపీ అవతరించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. ట్వీటర్లో అఖిలేష్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ఇలాంటి హత్యలు యూపీలో సర్వ సాధారణమని, అక్కడ ఒక భయోత్పాదక వాతావరణాన్ని సృష్టించారని విమర్శిం చారు. తాము అధికారం లోకి రాగానే నేరస్తులందరినీ కటకటాల వెనక్కి పంపిస్తామని హెచ్చరించారు. రాష్ట్రం లో రోజుకీ 24 అత్యాచారాలు, 13 హత్యలు, 33 అపహరణలు, 19 అల్లర్లు, 136 దొంగతనాలు.. మొత్తంగా 7,650 ఘటనలు జరిగాయన్నారు. అంతకుముందు బీజేపీ ఎంపీలు కూడా యూపీలోని నేరాలపై లోక్‌సభలో లేవనె త్తారు. పార్లమెంట్ బయట ధర్నా కూడా నిర్వహించారు. వ్యాపారవేత్త కుమారుడి హత్య.. బ్రహ్మపురి ఏరియాలోని శ్రద్ధారోడ్లో గల ఒక గోడౌన్ లోకి ఐదుగురు దుండగులు చొరబడి లూటీ చేయడానికి ప్రయత్నిం చారు. ఈ సందర్భంలో సుశీల్ వర్మ అనే వ్యాపారవేత్త, అతని కుమారుడు అభిషేక్ (24)లు వారిని ప్రతిఘటించారు. ఈ సమయంలో వారు పారిపోకుండా నివారించే ప్రయత్నంలో దుండగులు అభిషేక్‌ను కాల్చి పరారయ్యారు.