దేశ నేర రాజధాని యూపీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపణ
న్యూఢిల్లీ: దేశంలో నేర రాజధానిగా యూపీ అవతరించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. ట్వీటర్‌లో అఖిలేష్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ఇలాంటి హత్యలు యూపీలో సర్వ సాధారణమని, అక్కడ ఒక భయోత్పాదక వాతావరణాన్ని సృష్టించారని విమర్శిం చారు. తాము అధికారం లోకి రాగానే నేరస్తులందరినీ కటకటాల వెనక్కి పంపిస్తామని హెచ్చరించారు. రాష్ట్రం లో రోజుకీ 24 అత్యాచారాలు, 13 హత్యలు, 33 అపహరణలు, 19 అల్లర్లు, 136 దొంగతనాలు.. మొత్తంగా 7,650 ఘటనలు జరిగాయన్నారు. అంతకుముందు బీజేపీ ఎంపీలు కూడా యూపీలోని నేరాలపై లోక్‌సభలో లేవనె త్తారు. పార్లమెంట్ బయట ధర్నా కూడా నిర్వహించారు.
వ్యాపారవేత్త కుమారుడి హత్య..
బ్రహ్మపురి ఏరియాలోని శ్రద్ధారోడ్‌లో గల ఒక గోడౌన్ లోకి ఐదుగురు దుండగులు చొరబడి లూటీ చేయడానికి ప్రయత్నిం చారు. ఈ సందర్భంలో సుశీల్ వర్మ అనే వ్యాపారవేత్త, అతని కుమారుడు అభిషేక్ (24)లు వారిని ప్రతిఘటించారు. ఈ సమయంలో వారు పారిపోకుండా నివారించే ప్రయత్నంలో దుండగులు అభిషేక్‌ను కాల్చి పరారయ్యారు.