తెలంగాణలోనూ యూపీ ఫార్ములా
దూకుడు పెంచండి.. స్వంతంగా ఎదిగితే ఎవరైనా వస్తారు
బీజేపీ రాష్ట్రనేతలకు అమిత్ షా దిశానిర్దేశం
రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తదుపరి కార్యాచరణపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఇతర రాజకీయ పార్టీల నుంచి ఎవరో వస్తారని నాయకులకోసం ఎదురు చూడకుండా దూకుడు పెంచాలని బీజేపీ రాష్ట్ర నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో అనుసరించిన ఫార్ములానే అమలుచేసి తెలంగాణలోనూ అధికా రంలోకి రావాలని, అవసరమైన వ్యూహాలను, కార్యాచరణను ప్రారంభించాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలిచ్చారు. ‘ఇంటింటికీ బీజేపీ’ నినాదంతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం పూర్తి చేసిన నేపథ్యంలో దశలవారీగా వివిధ కార్యక్రమాలతో దూకుడు పెంచాలని సూచించారు.
ఈ నేపథ్యం లో ఈ నెల 22, 23 తేదీల్లో వరంగల్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ తదుపరి కార్యాచరణపై దృష్టిసారించనుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు 17 మంది, 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 119 మంది పూర్తికాలపు కార్యకర్తలను నియమించుకోవాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నిర్ణయిం చింది. దీనికి అనుగుణంగా 74 మంది పూర్తికాలపు కార్యకర్తలను పార్టీ నియ మించింది. వారికి నిర్దిష్టమైన కార్యాచరణ, పనిని అప్పగించనున్నది.
పోలింగ్ బూత్‌స్థాయి నుంచి సమస్యలను గుర్తించడం, వాటి పరి ష్కారం కోసం పోరాటాలకు సన్నద్దం కావడం, దీనికోసం కొత్తగా గ్రామస్థాయిలో పార్టీకి కార్యకర్తల బలం పెంచుకోవడం, నాయకుల మధ్య సమన్వయం వంటి పనులను పూర్తికాలపు కార్యకర్తలు చేస్తారు. దీనికి తోడు దళితులు, బీసీ వర్గాలకు పార్టీ దగ్గరయ్యే కార్యాచరణ, వ్యూహంపై దృష్టి సారించనున్నారు. ఉత్తరప్రదేశ్ లోనూ పార్టీ ఇలాంటి ఫార్ములానే అమలు చేసింది.
లోక్‌సభ నియోజకవర్గమే ప్రాతిపదిక
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో వేర్వేరు వ్యూహాలను అనుసరించాలని పార్టీ నిర్ణయించింది. ఏ రెండు నియోజకవర్గాల్లోనూ ఒకే రకమైన సమస్యలు లేవని, ఒకే పరిస్థితులు కూడా ఉండవనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను రచించుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా నియోజక వర్గాల వారీగా సమస్య లు, కుల సమీకరణలు, పార్టీల బలా బలాలను అధ్యయనం చేసి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణకు సిద్ధం అవుతోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలంగా, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కారణాలేమిటి అనే వాటిని పరిశీలించాలని, ఈ పార్టీలను ఎన్నికల్లో ఎదుర్కోవడానికి అనుసరిం చాల్సిన వ్యూహం, ఎత్తుగడల విషయంలో జాగురూకతతో వ్యవహరించాలని నిర్ణయిం చింది.
ముందుగా తెలంగాణ విమోచన దినోత్స వం విషయంలో టీఆర్‌ఎస్ వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవానికి సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వైఖరిని తెలంగాణవాదుల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోనుంది.