యాంటీ రోమియో స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తాం
లక్నో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఈవ్ టీజర్లను రోమియోలతో పోల్చారు. ఈవ్ టీజర్ల నుంచి అమ్మాయిలను కాపాడేందుకు ప్రతి కాలేజీల్లో యాంటీ రోమియో స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అమ్మాయిలు క్షేమంగా, సురక్షితంగా ఉండాలని, కాలేజీ క్యాంపస్లో యాంటీ రోమియో స్క్వాడ్‌లు అమ్మాయిలకు అండగా ఉంటాయని, ఆకతాయిలకు భయపడాల్సిన పనిఉండదని చెప్పారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు.
యూపీలో బీజేపీ అధికారంలో వస్తే మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తామని అమిత్ షా చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మహిళల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోలో పలు వరాలు ప్రకటించారు. విద్యార్థులు, రైతులు, మహిళల ఓట్లను ఆకర్షించేందుకు పలు ప్రజాకర్షక పథకాలను మేనిఫెస్టోలో చేర్చారు.