AP Assembly: టీడీపీ సభ్యుల రచ్చ.. సభ నుంచి సస్పెండ్‌ | Speaker Tammineni Suspended TDP Members From AP Assembly | Sakshi
Sakshi News home page

AP Assembly: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల రచ్చ.. సభ నుంచి ఒక్కరోజు సస్పెండ్‌

Published Tue, Feb 6 2024 11:14 AM | Last Updated on Tue, Feb 6 2024 11:18 AM

Speaker Tammineni Suspended TDP Members From AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు మళ్లీ ఓవరాక్షన్‌ చేశారు. దీంతో, టీడీపీ సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్‌ చేశారు. 

కాగా, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు తమ తీరును మార్చుకోలేదు. ప్రతీసారి చేసిన విధంగానే ఈసారి కూడా అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారు. రెడ్‌లైన్‌ దాడి స్పీకర్‌ తమ్మినేని పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. సభా నిబంధనలకు విరుద్దంగా టీడీపీ సభ్యులు ప్రవర్తించారు. సభ జరుగుతుండా విజిల్స్‌ వేస్తూ అరాచకం సృష్టించారు. 

అంతటితో ఆగకుండా ప్రజాప్రతినిధులనే స్పృహ మరిచిపోయి టీడీపీ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్‌పై విసిరారు. స్పీకర్‌ తమ్మినేని పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. స్పీకర్‌ను అవమానపరిచేలా నినాదాలు చేశారు. దీంతో, టీడీపీ సభ్యుల తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement