సాక్షి, న్యూఢిల్లీ: 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు నేరచరితులని, వీరిపై మహిళలపై నేరాలకు పాల్పడ్డ అభియోగాలు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. 17 మంది నేరచరితులతో టీడీపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని స్పష్టం చేశాయి. మనదేశంలో 755 మంది సిట్టింగ్ ఎంపీలు, 3,938 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని తెలిపాయి. ఈ మేరకు దేశంలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల 4,809 ఎన్నికల అఫిడవిట్‌ల్లో 4,693ను విశ్లేషించి రూపొందించిన నివేదికను బుధవారం విడుదల చేశాయి.
16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలపై కేసులు
2019 నుంచి 2024 మధ్య జరిగిన ఎన్నికల సమయంలో అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచిన అఫిడవిట్‌ల ఆధారంగా ఈ నివేదికను ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ సిద్ధం చేశాయి. 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు.
మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం
మహిళలపై నేరాలను రాష్ట్రాల వారీగా చూస్తే పశ్చిమ బెంగాల్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి. రెండో స్థానంలో 21 మందితో ఆంధ్రప్రదేశ్ ఉంది. 17 మందితో ఒడిశా మూడో స్థానంలో నిలిచింది. కాగా తెలంగాణ 11వ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఐదుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. కాగా దేశంలో మొత్తం 151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 16 మందిపై అత్యాచారానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. వీరిలో ఇద్దరు ఎంపీలు కాగా, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు..
1) చింతమనేని ప్రభాకర్, దెందులూరు
2) చదలవాడ అరవిందబాబు, నరసరావుపేట
3) చింతకాయల అయ్యన్నపాత్రుడు, నర్సీపట్నం
4) నంద్యాల వరదరాజులురెడ్డి, ప్రొద్దుటూరు
5) ఎస్.సవిత, పెనుకొండ
6) జి.భానుప్రకాశ్, నగరి
7) కందికుంట వెంకటప్రసాద్, కదిరి
8) బోనెల విజయచంద్ర, పార్వతీపురం
9) పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ
10) ప్రత్తిపాటి పుల్లారావు, చిలకలూరిపేట
11) కృష్ణచైతన్య రెడ్డి, కమలాపురం
12) తంగిరాల సౌమ్య, నందిగామ
13) సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సర్వేపల్లి
14) వంగలపూడి అనిత, పాయకరావుపేట
15) బండారు సత్యానందరావు, కొత్తపేట
16) ఎం.ఎస్.రాజు, మడకశిర
17) బండారు సత్యనారాయణమూర్తి, మాడుగుల
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు
1) పంతం నానాజీ, కాకినాడ రూరల్
2) కందుల దుర్గేశ్, నిడదవోలు
Comments
Please login to add a commentAdd a comment