kethireddy venktramireddy
-
ఇష్టానుసారం ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కేతిరెడ్డి
-
స్కూల్ పిల్లలకు లిఫ్ట్ ఇచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి
-
సమస్యల పరిష్కారం కోసం కాల్‌సెంటర్
సాక్షి, ధర్మవరం: అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేయడం, అవినీతి నిర్మూలన కోసం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాలకు అర్హులకు అందించేందుకు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గురువారం స్థానిక ఎస్బీఐ కాలనీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఏ సమస్య అయినా, ఏ సంక్షేమ పథకం అందకపోయినా 94931 56565 నంబర్‌ను ఫోన్ చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ, తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో పారదర్శక పాలన, సంక్షేమ పథకాలు 100 శాతం అందించాలన్న తలంపుతో ముందుకు పోతున్నామన్నారు. ఇందులో భాగంగా కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు అందించేందుకు ఎవరైనా లంచం అడిగినా, బెదిరించినా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
ఓటమి భయంతోనే దాడులు
అనంతపురం సెంట్రల్: ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి ఎన్నికలకు రెండు నెలలు ముందు ప్రకటించిన విధంగానే నియోజకవర్గంలో పోలింగ్ తర్వాత వైఎస్సార్సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా అరాచకం సృష్టిస్తున్నాడని వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వరదాపురం సూరి ఆగడాలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు వరదాపురం సూరి ‘ ఆరు నెలలు సమయం ఇస్తున్నాం. చంపుతారో చంపండి.. నరుకుతారో నరకండి.. మా పోలీసులు చూస్తూ ఉంటారు’ అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు. అనుకున్న విధంగానే పోలింగ్ తర్వాత ధర్మవరం నియోజకవర్గంలో మళ్ళీ ఫ్యాక్షన్‌కు తెరలేపుతున్నారని, ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతి పరులుగా వారిపై దాడులు, హత్యాయత్నాలు, ఆస్తులు తగలబెట్టడం లాంటి దుర్మార్గమైన రాజకీయాలకు తెరలేపాడని చెప్పారు. పోలింగ్ తర్వాత ఆరు ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఈదులపల్లికి చెందిన లక్ష్మిరెడ్డిపై హత్యయత్నంకు పాల్పడ్డారని , ముదిగుబ్బ మండలంలో కాంట్రాక్టర్ నాగశేషు అనే వ్యక్తి చెందిన రెండు వాహనాలకు నిప్పుపెట్టారన్నారు. దాదాపు 20 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. 65వ బూత్‌లో వైఎస్సార్సీపీ ఏజెంట్‌గా పనిచేసిన పరమేష్ అనే వ్యక్తికి సంబంధించి అరటితోటను కాల్చి వేశారన్నారు. దీంతో రూ.5 లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించిందన్నారు. ఎలక్షన్ తర్వాత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల హత్యకు సూరి ముందే కుట్రపన్ని పిలుపునివ్వడం జరిగిందన్నారు. సూరి కుమారుడు నితిన్‌సాయి ఎన్నికల సమయంలో ఈదులముష్టూరు తదితర గ్రామాల్లో చిచ్చుపెట్టి వెళ్ళాడని తెలిపారు. ఫలితంగా ధర్మవరం నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొందన్నారు. సూరి వ్యాఖ్యలపై అప్పట్లోనే ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి కేసులోనూ వరదాపురం సూరినే ఏ1 ముద్దాయని, వెంటనే ఆయనపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ అశోక్‌కుమార్ ధర్మవరం నియోజకవర్గానికి వచ్చి స్వయంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు వివరించారు. బాధిత కుటుంబాలకు కేతిరెడ్డి భరోసా ముదిగుబ్బ : సార్వత్రిక పోలింగ్ అనంతరం ఓటమి భయంతో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. వాహనాలను తగలబెడుతున్నారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం పరామర్శించారు. ఆస్తి నష్టపోయిన బాధితులు, రైతులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
పోలింగ్ తర్వాత వరదాపురం సూరి హింసను ప్రేరేపిస్తున్నారు
-
వరదాపురం సూరిపై కేతిరెడ్డి ఫైర్!
సాక్షి, అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరిపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల పోలింగ్ తర్వాత హింసను సూరి ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. సోమవారం అనంతపురం ఎస్పీని కలిసిన ఆయన సూరి ఆగడాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థులను చంపాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారన్నారు. ఆడియో టేపుల్లో కూడా సూరి వాయిస్ స్పష్టంగా ఉందన్నారు. ఎమ్మెల్యే సూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన ఆస్తుల విధ్వంసం, భౌతిక దాడుల కేసుల్లో సూరిని నిందితుడిగా చేర్చాలని కోరారు. వరదాపురం సూరి హింసా రాజకీయాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
ప్రజల గొంతు ఎండబెడతారా?
అనంతపురం, ధర్మవరంటౌన్: టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్రమార్జనకు అవకాశం దక్కదనే ఉద్దేశంతో పెద్దెత్తున తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. సీబీఆర్, వైవీఆర్, హెచ్ఎన్ఎస్ ఎత్తిపోతుల పనుల్లో రూ.410 కోట్లు ఎక్సెస్ వేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు అస్మదీయులకు ప్రజాధనం దోచిపెట్టడానికి సీబీఆర్ నుంచి కుప్పానికి నీళ్లు తరలించేందుకు కొత్త వ్యూహం రచించారన్నారు. జీవో 78 విడుదల చేసి సీబీఆర్ నుంచి చిత్తూరు జిల్లా కుప్పానికి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీటిని తరలించేందుకు రూ.1825 కోట్లతో పనులను చేపట్టినట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్)ను పెంచి రూ.410 కోట్లు దోచి పెట్టడానికి రంగం సిద్ధం చేశారన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల ఫలితంగా జిల్లాలో 8 మంచినీటి పథకాలు నిర్వీర్యం అవుతాయన్నారు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరి పట్టణాలకు నీటి పథకాలు ఇబ్బందులు తప్పవన్నారు. కుప్పానికి రోజుకు 2వేల క్యూసెక్కులా ?: చిత్రావతిలో నీటి లభ్యతను అంచనా వేయకుండా రోజుకు 2వేల క్యూసెక్కులు కుప్పానికి తరలిస్తే ఇక ధర్మవరంలో ఉన్న మంచినీటి పథకానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. చిత్రావతిలో నీటిని తరలించే ఆలోచన మానుకొని, ముందుగా నియోజకవర్గంలోని చెరువులు నింపి, ఆనీటిని తరలించాలన్నారు. ఈ విషయాలు పట్టించుకోకుండా చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే సూరి పాలాభిషేకం చేస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే జీవో 78లో ఉన్న లోపాలను సరిచేయాలన్నారు. మట్టి, కాంక్రీట్ పనుల్లోరూ.410 కోట్లకు పైగా దోపిడీ : సీబీఆర్, వైవీఆర్, హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతల పనుల్లో అంతులేని అవినీతి చోటు చేసుకుందని కేతిరెడ్డి అన్నారు. సాధారణంగా 5శాతం లోపు మాత్రమే పనుల్లో ఎక్సెస్ చేయడం చట్ట ప్రకారం జరుగుతుందన్నారు. ఈ పనుల్లో టీడీపీ ప్రభుత్వం 21 శాతం ఎక్సెస్ వేసి రూ.400 కోట్లకు పైగా కొల్లగొడుతున్నారన్నారు. బోర్డ్ఆఫ్ ఇంజినీర్స్ రూపొందించిన ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్) ప్రకారం మట్టి పనులు సాధారణంగా అయితే క్యూబిక్ మీటర్‌కు ప్రభుత్వం రూ.90 చెల్లించాలని, ఈ మట్టి పనులను మూడింతలు (రూ.270 ) పెంచారన్నారు.ఈ పనుల్లో 1,69,35,436 క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాల్సి ఉందన్నారు. ఈ పనుల్లో మూడింతలు పెంచడం వల్ల రూ.300 కోట్ల వరకు టీడీపీ నాయకులు దోచేసేందుకు సిద్ధమయ్యారన్నారు. కాంక్రీట్ పనుల్లో రూ.159 కోట్ల పనులకు గానూ ఎస్ఎస్ఆర్ వ్యాల్యూస్ కంటే ఎక్సెస్ వేయడం వల్ల టీడీపీ నాయకులు ఈ పనుల్లో రూ.110 కోట్లు దోచే స్తున్నారన్నారు. ఈ పనుల్లో రూ.410 కోట్ల దాకా ఎక్సెస్ పేరుతో టీడీపీ నాయకులు దోచుకుంటున్నారన్నారు. -
బలిజలను దగా చేస్తున్న బాబు
అనంతపురం, ధర్మవరం: గత ఎన్నికల్లో బలిజలను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంటరామిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని బలిజ కళ్యాణ మంటపంలో బలిజ కులస్థులతో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బలిజ కులస్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కేతిరెడ్డి నివాసం నుంచి సాగిన ఈ ర్యాలీ బలిజ కళ్యాణ మండటపం వరకు సాగింది. పెద్ద ఎత్తున బాణా సంచాలు పేల్చుతూ, పూలబాటలతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో కేతిరెడ్డి మాట్లాడుతూ నలభై సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు, అదే నలభై సంవత్సరాల వయస్సున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పథకాలను కాపీ కొడుతున్నాడన్నారు. ఈ కాపీరాయుడిని సమాజం నుంచి డిబార్ చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బాబును నమ్మితే నట్టేట మునగాల్సిందేనని, 600 హామీలతో గద్దెనెక్కిన ఆయన ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ఇప్పుడు తిరిగి ఎన్నికల వేళ కొత్త హామీలు ఇస్తున్నాడన్నారు. కాపులను మభ్యపెడుతూ సీఎం పబ్బం గడుపుకుంటున్నాడని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ సమయంలో ఎందుకు బీసీలుగా గుర్తించలేదని ప్రశ్నించారు. ఈబీసీ రిజర్వేషన్లో 5శాతం కాపులకంటూ కొత్త డ్రామా ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్రం ఈబీసీ రిజర్వేషన్ కల్పిస్తే.. అందులో కాపులకు 5శాతం కోటా ఇస్తామంటూ కొత్త డ్రామాకు చంద్రబాబు తెరలేపారని కేతిరెడ్డి విమర్శించారు. ఆర్థికంగా వెనుకబడిన వారు ఇందులోకి వస్తారని, కొత్తగా ఆయన చేసిందేమీ లేదన్నారు. కేవలం కల్లబొల్లి మాటలతో ప్రజలందరినీ మభ్యపెడుతున్నాడు తప్ప, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన బాబుకు ఏ కోశానా లేదన్నారు. కాపు కార్పొరేషన్ రుణాలు కూడా పక్కదారి పట్టిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తప్ప అర్హులకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. కాపు సంక్షేమానికి రూ.10వేల కోట్లు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కాపు సంక్షేమానికి ప్రతి ఏడాది రూ.2 వేల కోట్లు చొప్పున 5ఏళ్లలో రూ.10 కోట్లు కేటాయిస్తామన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన వారందరికీ రుణాలు విరివిగా ఇస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో బలిజలు వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలవాలని ఆయన అభ్యర్థించారు. కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు యంబా లింగన్న, శిరిపి పర్వతయ్య, తొండమల రవి, మాసపల్లి సాయి, గొట్లూరు మారుతి, సాగా శీనా, లాయర్ చంద్రమౌళి, గుద్డిటి మురళి, సాగా శీనా, పెద్డిరెడ్డిగారి శ్రీనివాసులు, సండ్ర రామక్రిష్ణ, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ తొండమల ఉమాదేవి, మాజీ కౌన్సిలర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
కుప్పానికి నీళ్లు.. మాకు కన్నీళ్లా?
అనంతపురం, ధర్మవరం: ‘ధర్మవరం నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఎండిపోయాయి? ఎంత భూమి బీళ్లుగా ఉన్నాయో తెలియడం లేదా? పంటలు పెట్టుకునే పరిస్థితి లేక రైతులు వలసలు పోతుంటే చిత్రావతి నుంచి నీళ్లను కుప్పాని తీసుకుపోతామని చంద్రబాబు జీఓ జారీ చేశారు. మీరేమో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తారా? ఇక్కడి ప్రజలకు తాగు, సాగు నీరు వద్దా? ఇలా అయితే మిమ్మల్ని భవిష్యత్తు తరాలు క్షమించవు’ అంటూ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ధర్మవరంలోని తన స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేతిరెడ్డి మాట్లాడారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కుప్పానికి నీళ్లు తీసుకుపోవడానికి జారీ చేసిన జీఓ ఆర్టీ నంబర్ 78ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. 2000 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కుప్పానికి తీసుకుపోవడం అంటే ప్రాజెక్ట్ మొత్తం ఖాళీ కావడమేనన్నారు. ధర్మవరం నియోజకవర్గం పరిధిలో తాగునీరు చేసేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని, అందుకు ఇక్కడి నాయకులు వత్తాసు పలుకుతూ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రావతి రిజర్వాయర్ నుంచి ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, పులివెందుల మున్సిపాలిటీలతోపాటు యురేనియం ప్రాజెక్ట్‌కు, పులివెందుల రూరల్ ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతున్నాయన్నారు. అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలోని తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాలకు రూరల్ తాగునీటి ప్రాజెక్ట్‌లకు తాగునీటిని అందించాల్సి ఉందన్నారు. వేసవి వచ్చిందంటే రిజర్వాయర్‌లో నీరు అడుగంటి, తాగేందుకు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉంటే మళ్లీ కుప్పానికి నీళ్లు తీసుకుపోతామంటే ఇక్కడి వాళ్ల పరిస్థితేంటని ప్రశ్నించారు. కమీషన్లు తప్ప నష్టంగురించి ఆలోచించవా? సూరీ తనకొచ్చే కమీషన్ల గురించి తప్ప, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కుప్పానికి నీళ్లు తీసుకుపోతే వచ్చే నష్టం గురించి ఆలోచించడం లేదని కేతిరెడ్డి ఆరోపించారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలో మొత్తం 76 చెరువులు ఉన్నాయని, వాటన్నింటి పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇప్పటికే సాగునీటికోసం పడరాని పాట్లు పడుతుంటే వారికి నీటి వాటా ఇస్తామని జీఓలు జారీ చేస్తే ఈయన మాత్రం పాలాభిషేకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జీఓ 78 వల్ల ధర్మవరం నియోజకవర్గం జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం కుప్పానికి చిత్రావతి రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుపోతే ఇక్కడి వాళ్లు తాగేందుకు నీళ్లులేక అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ధర్మవరం నియోజకవర్గానికి సాగు, తాగు నీటి అవసరాలు తీర్చిన తరువాత మిగులు జలాలను ఎక్కడికి తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదన్నారు. నియోజకవార్గంలోని అన్ని చెరువులూ నింపాలని డిమాండ్ చేశారు. ఈ రోజు వారికి హక్కు ఇస్తే జీవితాంతం అనుభవించాల్సి వస్తుందని, ఇందుకు తమ పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ విషయంపై రైతులందరినీ కలసి జీఓ 78 ద్వారా నియోజకవర్గానికి కలిగే నష్టాన్ని వివరించి, వారందరి మద్దతుతో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. -
జగన్ సీఎం కావడమే అందరి లక్ష్యం
ముదిగుబ్బ : ఎన్నికల సమయం దగ్గర పడుతోంది.. ప్రతి కార్యకర్తా సైనికుల్లా పనిచేసి, వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని వాసవీ కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అంతకు ముందు కదిరి వైపునున్న పెట్రోల్ బంకు సమీపం నుంచి వాసవీ కల్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. నవరత్నాలతో ప్రతి ఒక్కరికీ న్యాయం కేతిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, పథకం గురించి ప్రతి ఇంటా వివరించి, వైఎస్సార్సీపీకి ఓటు వేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ నెల 20 నుంచి టీఎన్ పాళ్యం నుంచి ప్రచారాన్ని ప్రారంభించి, ప్రతి గ్రామాన్నీ తిరిగి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తానన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే మండలం నుంచి 15 వేలకు పైగా మెజార్టీ తీసుకురావాలన్నారు. 20 ఏళ్ల పాటు టీడీపీ నామ రూపాలు లేకుండా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 25న ఎన్నికల నోటిపికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. అంతర్గత విభేదాలు వీడండి ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరుగుతాయని కేతిరెడ్డి అన్నారు. గ్రామాల్లో అంతర్గత విభేదాలు వీడి కలసి కట్టుగా పని చేయాలన్నారు. మన పార్టీలోకి ఎవరు చేరినా అభ్యంతరాలు చెప్పకూడదన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. నాతో ఎవరికి అవసరం ఉన్నా సిఫార్సు లేకుండా స్వయంగా వచ్చి సమస్య చెప్పుకోవచ్చన్నారు. టీడీపీ ప్రయోజనం కోసమే జనసేన చంద్రబాబు వ్యతిరేక ఓట్లను చీల్చడానికే జనసేన పార్టీ పెట్టారేగానీ ప్రజాసేవ చేయడానికి కాదని కేతిరెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు గిమ్మిక్కులు చేసి ప్రజలను మోసం చేయడానికి వస్తారన్నారు. రైతులు, ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి ఎమ్మెల్యే వరదాపురం సూరి చిత్రావతిలో ఇసుక తరలించి, రైతుల పొట్ట కొడుతున్నాడన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ముదిగుబ్బలో భూసేకరణ పేరుతో 110 ఎకరాలకు రైతులకు రెండు సార్లు నోటీసులు ఇచ్చారని, ఆ భూములను లాక్కుని రియల్ ఎస్టెట్ వ్యాపారం చేయాలనుకుంటున్నాడన్నారు. పచ్చాచొక్కాల నాయకులకు దిమ్మ తిరిగేలా పోలింగ్ రోజున ఏకపక్షంగా ఓట్లు పడే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఇందుకూరి నారాయణరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేలూరి రామాంజనేయులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫైర్
సాక్షి, అనంతపురం: జిల్లాలోని మొగలిచెట్లపల్లిలో రోడ్లను ధ్వంసం చేసిన టీడీపీ నేతలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలసి ఆయన వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ బీసీలపై కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొగలిచెట్లపల్లి గ్రామస్తులు వైఎస్సార్సీపీలో చేరడంతోనే రోడ్లను ధ్వంసం చేయటం ఆటవిక పాలనేనని ఆయన విమర్శించారు. ఈ విషయంపై ఆధికారులు కఠినంగా వ్యవహరించకపోతే ప్రత్యక్ష ఆందోళకు దిగుతామని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. -
చేనేత కుటుంబాలకు చేయూత
అనంతపురం, ధర్మవరం: భిక్షమెత్తయినా చేనేత కార్మికుల కుటుంబాల్ని ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతోనే చేనేత రంగం సంక్షోభంలో కూరకుపోయిందన్నారు. నెలకో చేనేత కార్మికుడు బలవన్మరణం పొందుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తన నివాసంలో పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు బీరే ఎర్రిస్వామి, పట్టణ అధ్యక్షుడు గడ్డం కుళ్లాయప్పలతో కలసి విలేకరలతో మాట్లాడారు. చేనేత రంగాన్ని నమ్ముకుని ధర్మవరం పట్టణానికి ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది పొట్టచేత బట్టుకుని వలస వచ్చారన్నారు. ప్రస్తుతం వారంతా ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత కార్మికుల పరిస్థితి చాలా దుర్భరంగా తయారైందన్నారు. నెలకో చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. గతంలో చేనేత కార్మికులకు అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలనూ ఈ నాలుగున్నరేళ్లలో నిలిపివేసి చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. తన హయాంలో ముడిసరుకుల ధరలు పెరిగినప్పుడు, ఇతర సంక్షోభం ఎదురైనప్పుడు తానే చొరవ తీసుకుని ఆ రంగంలోని ప్రముఖులందరితో చర్చించి ఇబ్బందులు లేకుండా చేశానన్నారు. ఇప్పుడు చేనేత రంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోగా స్థానిక నాయకులకూ ఏమాత్రం అవగాహన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు 60 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కానీ ప్రభుత్వం చేనేత కార్మికుల ఆత్మహత్యలపైనా రాజకీయం చేసి బుకాయించే ప్రయత్నం చేసిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ధర్మవరం పట్టణంలో పర్యటించి, ఆత్మహత్యలకు పాల్పడ్డ 15 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చి, ఆర్థిక సహకారం అందించామని గుర్తుచేశారు. ఆ తరువాత ప్రభుత్వం ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలకు రూ.5లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటించిందని కానీ.. ఆ ప్రకటన ఇప్పటి వరకు అమలుకు నోచుకుకోలేదన్నారు. సోమ, మంగళవారాల్లో భిక్షాటన చంద్రబాబు ప్రభుత్వం చేనేతలకు చేసిన మోసాన్ని వివరిస్తూ, ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలకు భరోసానిచ్చేందుకు ఈ నెల 19, 20వ తేదీల్లో ధర్మవరం పట్టణంలో భిక్షాటన చేయనున్నట్లు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. 2016 తరువాత 30 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు గుర్తించామన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే డెత్ సర్టిఫికెట్, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని తమ కార్యాలయానికి రావాలని కోరారు. ఆసరా కోల్పోయిన చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు తాము భిక్షాటన నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇబ్బందులు పడుతున్న ఆ చేనేత కుటుంబాల్ని ఆదుకునేందుకు దాతలందరూ ముందుకు రావాలని ఆయన అభ్యర్థించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ చందమూరి నారాయణరెడ్డి, నాయకులు కోటం ఆనంద్, గుర్రం రాజా, తొండమల రవి, చింతా యల్లయ్య, తేజ, శీలా రాయుడు, కాంతమ్మ, గంగాదేవి పాల్గొన్నారు. -
సూరీ.. కళ్లల్లో ఇసుక కొట్టలేవు!
ధర్మవరం: ‘‘ఇసుక అక్రమ రవాణ జరిగితే సహించేదిలేదు.. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆధారాలతో చూపితే ఒక్కో లారీకి రూ. లక్ష ఇస్తామని చెప్పారు కదా..? ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణకు చెందిన ఎన్ఎస్సీ కంకరప్లాంట్ వద్ద వందలాది లారీల ఇసుకను డంప్ చేశారు.. ఆ ఇసుక ఎక్కడినుంచి తోలారు.. దమ్ముంటే ఆ ఇసుక అక్రమం కాదు.. సక్రమమని నిరూపించగలరా..?’’ అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ నాయకులు పంచభూతాలను అమ్మి సొమ్ముచేసుకుంటున్నారని దుయ్యబట్టారు. బుధవారం ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఇళ్లు కట్టుకునేందుకు సామాన్యులు రెండు ట్రిప్పుల ఇసుకను తోలుకుంటే నానా హంగామా చేసే రెవెన్యూ, విజిలెన్స్, పోలీస్ అధికారులు.. టీడీపీ నేతలు వందలాది లారీల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా ఎందుకు పట్టింతుకోవడం లేదని ప్రశ్నించారు. సీసీరేవు, పీసీరేవు ఇసుక రీచ్‌ల వద్ద హిటాచీలు ఉంచి వందలాది లారీల్లో ఇసుకను తరలిస్తూ విక్రయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రీచ్‌లకు సంబంధంలేని ఉప్పర్లపల్లి చిత్రావతి వద్ద హిటాచీలు పెట్టి తోడుతున్నారని, ఆ ఇసుక ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ కంకరమిషన్ వద్ద డంప్చేశారని ఆధారాలతో చూపారు. లారీల్లో ఉన్న ఇసుక, కంకరమిషన్ వద్ద డంప్ ఫొటోలను మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఇసుక అక్రమ రవాణ చేస్తున్నట్లు ఆధారాలతో చూపితే ఒక్కో లారీకి లక్ష చొప్పున ఇస్తామని బడాయిమాటలు చెప్పారనీ...తాను 1,500 లారీల ఇసుకను డంప్ చేసినట్లు ఆధారాలతో సహా బయటపెట్టాననీ..ఈ లెక్కన లారీకి రూ. లక్ష చొప్పున రూ.15 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందనీ, ఆమెత్తాన్ని ఆత్మహత్యలు చేసుకున్న చేనేతల కుటుంబాలకు ఇవ్వాలన్నారు. నా లారీలైతే కాల్చిపారేయండి స్థానిక టీడీపీ నేతలు ఎక్కడ ఇసుక లారీలు పట్టుకున్నా... కేతిరెడ్డివేనని అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. ఇక మీదట ఎక్కడ ఇసుక లారీ పట్టుపడినా.. ఆ లారీలన్నింటినీ కాల్చివేయవచ్చన్నారు. మీ ఎమ్మెల్యేకి చెందిన లారీలు అక్రమ ఇసుక రవాణ చేస్తే కాల్చిపారేయండని చెప్పే దమ్ము మీకుందా..? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. దందాలు దోపిడీలతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కొందరు.. వారికి వెయ్యి, రెండువేలు ఇచ్చి అపర దాన కర్ణునిలా కలర్ ఇస్తున్నారని, కేవలం ఆర్జించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చినవారు తనపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. అధికారులు కూడా అధికార పార్టీ నాయకుల అక్రమాలకు సహకరిస్తున్నారని... ఇందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. -
డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్
ధర్మవరం: ‘సెంటుకు ఇంత.. ఎకరాకు ఇంత.. అని లెక్కకట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతిరోజూ ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని లెక్కకట్టి మరీ డబ్బులు దండుకుంటున్నారు. నిందలేమో మాపైన వేస్తారా? అసలు రిజిస్ట్రేషన్లు జరిగిన వాటికి డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఎందుకు పెండింగ్‌లో పెట్టారు. ఆ డాక్యుమెంట్లను టీడీపీ నాయకులకు ఇస్తే వారు వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసుకుని ఇస్తున్నారు. అసలు మీరు ఇక్కడెందుకు? రిజిస్ట్రేషన్లు టీడీపీ ఆఫీస్ నుంచే చేయించండి’ అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటామిరెడ్డి ధర్మవరం సబ్‌రిజిస్ట్రార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి తంతు గురించి తెలుసుకున్న ఆయన గురువారం బాధితులతో కలిసి అక్కడికెళ్లి ఆధారాలు చూపుతూ సబ్‌రిజిస్ట్రార్‌ను నిలదీశారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలు చేయాలి కానీ వాటిని పార్టీ కార్యాలయాలుగా మార్చకూడదని మందలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 200లకు పైగా రిజిస్ట్రేషన్లను పెండింగ్‌లో పెట్టారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధికి డబ్బులిచ్చి, పర్మిషన్ తెచ్చుకున్న వారికి మాత్రమే డాక్యుమెంట్లు ఇస్తున్నారన్నారు. అలా మామూళ్లు ఇవ్వలేని నిస్సహాయుల పత్రాలను పెండింగ్‌లో పెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తంతు నడిపించేందుకు ఏకంగా ఓ వ్యక్తిని కాపలాదారుగా పెట్టారన్నారు. ఇలా రోజువారీ రిజిస్ట్రేషన్లు లెక్కించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏప్రిల్ నోటీసులకు,ఫిబ్రవరి రిజిస్ట్రేషన్లకు ఏంటి సంబంధం? ఫిబ్రవరి నెలలో 200 మంది రిజిష్టర్ చేయించుకుంటే ఏప్రిల్ నెలలో మున్సిపల్ అధికారులు ఇచ్చిన నోటీసుల ఆధారంగా వాటిని పెండింగ్‌లో ఉంచారని, దీన్నిబట్టి చూస్తే అవినీతి ఎంత స్థాయిలో జరుగుతోందో ఇట్టే అర్థమవుతుందని కేతిరెడ్డి అన్నారు. పట్టణంలోని చుక్కల భూములను, 08లను టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని విమర్శించారు. వారు ఎప్పుడు చెబితే అప్పుడు ఆ జాబితాలో చుక్కల భూములను చేర్చడం, తొలగించడం పరిపాటిగా మారిందన్నారు. ధర్మవరం తహసీల్దార్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లిస్ట్ పేరుతో ఇటీవల ఓ జాబితానివ్వడం, ఆ తర్వాత మళ్లీ వెంటనే వెనక్కు తీసుకోవడం ఎందుకోసమని ప్రశ్నించారు. అధికారులను అడ్డుపెట్టుకుని టీడీపీ ప్రజాప్రతినిధి పెద్ద ఎత్తున భూదందా చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. కనీసం చుక్కల భూములు, 08కు సంబంధించిన భూముల విషయంలో నెలకొన్న సందిగ్దతపై ఏనాడైనా స్పందించారా అని ప్రశ్నించారు. న్యాయం చేసేవరకు పోరాటం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికార పార్టీ నాయకుల దందా, అవినీతిపై చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేసేవరకూ పోరాటం ఉధృతం చేస్తామని కేతిరెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉంచిన 200 మంది రిజిస్ట్రేషన్ పత్రాలను తక్షణం అందించాలని, అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయంలోకి వచ్చి తీసుకువెళ్లిన రవూఫ్ పత్రాలను కూడా సోమవారంలోగా తెప్పించాలని సబ్ రిజిస్ట్రార్‌ను హెచ్చరించారు. చుక్కల భూములు, 08లను ఒక నిర్ధిష్ట విధానంతో గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని, అలా కాకుండా కేవలం అక్రమార్జనే ధ్యేయంగా దొంగ జాబితాలను సృష్టించి డబ్బులు దండుకోవాలని చూస్తే సహించేది లేదని అన్నారు. వారం రోజుల్లోపు బాధితులకు న్యాయం చేయని పక్షంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. దందాలు మీరు చేస్తూ.. నిందలు మాపైనా? పట్టణ శివార్లలోని సర్వే నెంబర్ 631లో రవూఫ్ అనే వ్యక్తికి చెందిన 1.50 ఎకరాల భూమిని రిజిస్టర్ చేసి ఏడాది పూర్తవుతున్నా ఇంతవరకు పత్రాలు ఇవ్వలేదని కేతిరెడ్డి తెలిపారు. రిజిష్టర్ మినిట్స్ బుక్‌లో ఆ పత్రాలను టీడీపీకి చెందిన గోరకాటి రఘునాథ్‌రెడ్డి తీసుకెళ్లినట్లు నమోదు చేసిన విషయాన్ని ఆయన బట్టబయలు చేశారు. ఒకరి భూమికి చెందిన పత్రాలను వేరొకరికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది చట్ట వ్యతిరేకమని, ఫోర్జరీ కిందకు వస్తుందని అన్నారు. సర్వే నెంబర్ 571లో కేవలం 5 ఎకరాలు మాత్రమే 08 కింద ఉంటే 36 ఎకరాల భూమిని రిజిష్టర్ చేయకుండా పెండింగ్‌లో ఉంచుతున్నారన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇష్టారాజ్యంగా జరుగుతున్న ఇలాంటి అవినీతి, అక్రమాలపై తాము సమగ్ర ఆధారాలతో ఉన్నతాధికారులకు నివేదించామని, దీంతో టీడీపీ నాయకులు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేతిరెడ్డి దుయ్యబట్టారు. ‘మేమిచ్చిన జాబితాకు, ప్రస్తుతం నిలిపేసిన రిజిస్టర్లకు సంబంధం ఉందా?’ అని సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామిని ప్రశ్నించారు. అందుకాయన స్పందిస్తూ అలాంటిది ఏమీ లేదని విలేకర్ల సమక్షంలో తెలిపారు. కేవలం మున్సిపల్ అధికారులు ఇచ్చిన నోటీసులను ప్రామాణికంగా తీసుకున్నామని, వేరే ఏ ఇతర లేఖలను పరిగణలోకి తీసుకోవడం లేదని సబ్‌రిజిస్టార్ తెలిపారు. అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకుల ఆదాయానికి గండికొట్టామన్న ఉద్దేశంతో వారు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ప్రతిరోజూ ప్రజాప్రతినిధికి డబ్బులు చేరుతున్న విషయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. -
అఖిలపక్షం పేరుతో చంద్రబాబు డ్రామా
ధర్మవరం టౌన్: ప్రత్యేక హోదా సాధన కోసం సీఎం చంద్రబాబు అఖిలపక్ష సమావేశం నిర్వíంచడం పెద్ద డ్రామా అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేసిన పాపాలను తలా పిడికెడు పంచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన తన ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం చేసిన మోసాన్ని తొలినుంచీ వైఎస్సార్ సీపీ తప్పుపడుతోందని, ఆ మేరకు ఉద్యమాలు కూడా చేసిందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని గతంలోనే వైఎస్సార్సీపీ, ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇపుడు హోదాపై యూ టర్న్ తీసుకుని నాటకాలు ఆడుతున్నారన్నారు. నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి హోదాను బుట్టదాఖలు చేసిన చంద్రబాబు... ఇప్పుడు తాజాగా వచ్చి ఏం సాధిస్తారన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవంతో పుట్టిన పార్టీ అని చెప్పుకునే టీడీపీ... జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ సిద్దాంతాలను తుంగలో తొక్కిందన్నారు. ఎవరైనా చంద్రబాబును విమర్శిస్తే...అది ఆంధ్రులను విమర్శించినట్లుగా చెప్పుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు తన అవినీతి వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారన్నారు. హోదా పేరెత్తితో జైల్లో పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి... ఇప్పుడు హోదాపై పోరాటం చేస్తామనడం దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తూ బురదజల్లింది టీడీపీ నాయకులు కాదా..? అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు హోదా అంశంలో పోరాడటం పక్కనపెట్టి...ప్రతిపక్ష ఎంపీలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. గల్లీలో ప్రజల సమస్యలు తీర్చలేని చంద్రబాబు.. ఢిల్లీతో పోరాడి ఏం సాధిస్తారన్నారు. ప్రజలు అమాయకులు కాదని.. టీడీపీ సర్కార్ చేస్తున్న ప్రతిపనిని గమనిస్తున్నారన్నారు. సరైన సమయంలో ఈ ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలుపుతారన్నారు. సమావేశంలో బత్తలపల్లి ఎంపీపీ, వైఎస్సార్సీపీ బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి సూర్యప్రకాష్ బాబు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
ముదిగుబ్బ: ధర్మవరం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల ప్రేక్షకపాత్ర వైఖరి కారణంగా టీడీపీ నాయకుల అరాచకాలు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని «ధ్వజమెత్తారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, తాను అండగా ఉంటానని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు భరోసానిచ్చారు. సోమవారం ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లిలో టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాజశేఖర్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, బయపరెడ్డి,రమేష్, ఇర్పాన్, రాజుల ఇళ్లకు వెళ్లి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు టీడీపీ నేతల దౌర్జన్యాన్ని కేతిరెడ్డికి వివరించారు. నవరత్నాలపై గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ నాయకుడు దేవేంద్రనాథ్‌రెడ్డి అనుచరులతో వచ్చి దాడి చేశారన్నారు. పోలీస్‌స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అరాచక పాలనకు త్వరలోనే చరమగీతం తెలుగుదేశం అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని కేతిరెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలకు న్యాయం జరిగేందుకు ఎందాకైనా పోరాటం సాగిస్తామన్నారు. ఎవ్వరూ అధైర్యపడవద్దన్నారు. అనంతరం మండల పరిధిలోని మలకవేముల క్రాస్‌లో సేవేనాయక్ను పరామర్శించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇందుకూరు నారాయణరెడ్డి,రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి వేలూరి రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతలు పరిరక్షించండి ధర్మవరం నియోజకవర్గంలో రోజురోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని కేతిరెడ్డి కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం పట్నం పోలీస్‌స్టేషన్‌లో ఆయన డీఎస్పీని కలిసి అధికార పార్టీ ఆగడాలను వివరించారు. ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు తెగబడితే విచారణ జరిపి న్యాయం చేయాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను అరికట్టాలని ఫిర్యాదు చేసేందుకు భాదితులు పోలీస్‌స్టేషన్‌కు వెళితే ప్రతిగా వారిపైనే కౌంటర్కేసులు కడుతున్న దుర్మార్గపు పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం వలన భవిష్యత్‌లో మరిన్ని సంఘటనలు పునరావృతమై శాంతి భద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని, భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. -
చంద్రబాబును ప్రజలు విశ్వసించరు
ధర్మవరం టౌన్: ఆనాడు తామంతా హోదా కోసం పోరాటం చేస్తే అక్రమ కేసులు బనాయించిన సీఎం చంద్రబాబునాయుడు నేడు హోదా కోసం పోరాటం చేస్తాననడం హాస్యాస్పదమని, ఈ విషయంలో ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్న ఆయనను ప్రజలు విశ్వసించరని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రత్యేకహోదా కోసం 2015 ఆగస్టు 29వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో ధర్మవరం పట్టణంలో చేపట్టిన బంద్‌ను టీడీపీ ప్రభుత్వం పోలీసుల చేత అణిచి వేయాలని చూసింది. అయినప్పటికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపిన కేతిరెడ్డితోపాటు 53 మంది పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి శుక్రవారం స్థానిక సబ్కోర్టుకు వాయిదాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా హోదా కోసం తాము ఆందోళన చేస్తే అక్రమకేసులు బనాయించారన్నారు. అప్పటినుంచి రెండేళ్లపాటు తాము వాయిదాలకు తిరుగుతూనే ఉన్నామన్నారు. రాష్ట్రంలో హోదా పేరెత్తితేనే జైల్లో పెట్టాలని పోలీసులను ఆదేశించి విద్యార్థులను, ఉద్యమకారులను, ప్రజలను బెదిరించిన సీఎం ప్రజల ఒత్తిడి మేరకు హోదా కావాలని ప్రజల దారికే వస్తున్నారన్నారు. ఆలస్యంగానైనా యూటర్న్ తీసుకున్న ఆయన హోదా ఉద్యమకారులపై కేసులను ఎందుకు ఎత్తివేయడం లేదని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే స్పెషల్ జీవోలను ఇచ్చి 265 మంది స్వంత అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల మీదున్న కేసులను ఎత్తివేసిన చంద్రబాబుకు హోదాపై చిత్తశుద్ధి ఉంటే హోదా కోసం పోరాడిన వారిపై కేసులను ఎందుకు ఎత్తివేయలేదని ప్రశ్నించారు. ధర్మవరం నియోజకవర్గంలో హోదా ఉద్యమకారులపై బనాయించిన కేసులను తక్షణం ఎత్తివేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు. -
17న ధర్మవరంలో వైఎస్ జగన్ పర్యటన
ధర్మవరం (అనంతపురం): చేనేతలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. చేనేతలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేం దుకు ఈనెల 17న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్మవరానికి వస్తున్నారని వెంకటరామిరెడ్డి చెప్పారు. శుక్రవారం ఇక్కడ ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. నేతన్నల దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు, దగాకోరు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, అవస్థలు పడుతున్న చేనేత కార్మికులకు ధైర్యం చెప్పేందుకు జగన్ ఇక్కడికి వస్తున్నారని వెంకటరామిరెడ్డి తెలిపారు. చేనేతలకు సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేసి ఆ రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కష్టాల్లోకి నెడుతోందని విమర్శించారు. తనకు అన్నీ ఆన్లైన్లోనే తెలుస్తాయని చెప్పుకునే సీఎంకు గిట్టుబాటు ధర లేక, సంక్షేమ పథకాలు అందక బలవన్మరణాలకు పాల్పడుతున్న, వలసపోతున్న చేనేత కార్మికులు కనిపించకపోవడం విడ్డూరమన్నారు. 33 రోజులుగా తమ పార్టీ ఆధ్వర్యంలో నేతన్నలు దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తే.. చేనేత కార్మికుల పట్ల సీఎంకున్న చిత్తశుద్ధి అవగతమవుతుందన్నారు. నేతన్నలకు మద్దతుగా అధికారులను ప్రశ్నించేందుకు వెళితే తమ పార్టీ నాయకులను పోలీసులచేత అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చేనేత దీక్షలను ఎత్తి వేయించేందుకు ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. నేతన్నలకు న్యాయంగా దక్కాల్సిన సంక్షేమ పథకాల గురించి తాము పోరాటం చేస్తున్నామన్నారు. -
వారి అరెస్టులు అక్రమం.. కేసులు ఎత్తి వేయాలి
అనంతపురం: అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపులకు దిగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులపై వేధింపులు కొనసాగిస్తోంది. ధర్మవరం చేనేత కార్మికుడి ఆత్మహత్యకు వైఎస్సార్సీపీ మద్దతుదారులు మాధవనాగరాజు, రాఘవ కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసుల చర్యలపట్ల వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల వైఖరి సరైనది కాదంటూ వైఎస్సార్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. అక్రమ కేసులను ఎత్తివేయకుంటే ఆందోళన చేస్తామని కేతిరెడ్డి హెచ్చరించారు.