విలేకరులతో మాట్లాడుతున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
ధర్మవరం టౌన్: ప్రత్యేక హోదా సాధన కోసం సీఎం చంద్రబాబు అఖిలపక్ష సమావేశం నిర్వíంచడం పెద్ద డ్రామా అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేసిన పాపాలను తలా పిడికెడు పంచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన తన ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం చేసిన మోసాన్ని తొలినుంచీ వైఎస్సార్ సీపీ తప్పుపడుతోందని, ఆ మేరకు ఉద్యమాలు కూడా చేసిందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని గతంలోనే వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇపుడు హోదాపై యూ టర్న్ తీసుకుని నాటకాలు ఆడుతున్నారన్నారు. నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి హోదాను బుట్టదాఖలు చేసిన చంద్రబాబు... ఇప్పుడు తాజాగా వచ్చి ఏం సాధిస్తారన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవంతో పుట్టిన పార్టీ అని చెప్పుకునే టీడీపీ... జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ సిద్దాంతాలను తుంగలో తొక్కిందన్నారు.
ఎవరైనా చంద్రబాబును విమర్శిస్తే...అది ఆంధ్రులను విమర్శించినట్లుగా చెప్పుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు తన అవినీతి వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారన్నారు. హోదా పేరెత్తితో జైల్లో పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి... ఇప్పుడు హోదాపై పోరాటం చేస్తామనడం దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తూ బురదజల్లింది టీడీపీ నాయకులు కాదా..? అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు హోదా అంశంలో పోరాడటం పక్కనపెట్టి...ప్రతిపక్ష ఎంపీలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. గల్లీలో ప్రజల సమస్యలు తీర్చలేని చంద్రబాబు.. ఢిల్లీతో పోరాడి ఏం సాధిస్తారన్నారు. ప్రజలు అమాయకులు కాదని.. టీడీపీ సర్కార్ చేస్తున్న ప్రతిపనిని గమనిస్తున్నారన్నారు. సరైన సమయంలో ఈ ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలుపుతారన్నారు. సమావేశంలో బత్తలపల్లి ఎంపీపీ, వైఎస్సార్‌సీపీ బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి సూర్యప్రకాష్ బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment