minister paritala sunitha
-
టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీల గొడవ.. ఎస్పీకి ఫిర్యాదు!
సాక్షి, అనంతపురం : ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా మంత్రి లోకేష్ కర్నూల్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలతో నేతల మధ్య చిచ్చురగులుకున్న విషయం తెలిసిందే. అనంతపురంలో టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో ఫ్లెక్సీల గొడవ చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. కానీ సూరి అనుచరులు మాత్రం మంత్రి పరిటాల సునీత వర్గీయులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే సూరి ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాక ఫ్లెక్సీలు తొలగించిన కొంతమందిని పోలీసులు తప్పించారని ఎమ్మెల్యే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. -
పరిటాల అనుచరుల రౌడీరాజ్యం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని పరిటాల అనుచరులు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఉండే సయ్యద్ పాషాను పరిటాల వర్గం కిడ్నాప్ చేసి, మంత్రి స్వగ్రామమైన వెంకటాపురానికి తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు. రూ. 4 కోట్లు ఇవ్వాలని బెదిరించి, బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 30 లక్షలు తీసుకుని అతడిని విడిచిపెట్టారు. దీంతో సయ్యద్ పాషా కర్ణాటకలోని బాగేపల్లిలో పోలీసులును అశ్రయించాడు. పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ అనుచరుడు భాస్కర్ నాయుడు సహా 8 మందిపై చర్యలు తీసుకోవాలని అతను ఫిర్యాదు చేశాడు. కర్ణాటక పోలీసులు ఈ కేసును అనంతపురం ఫోర్త్ టౌన్ పీఎస్‌కు బదిలీ చేశారు. పరిటాల వర్గీయులు ఆగడాలు పెచ్చుమీరుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిటాల వర్గీయుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నారు. -
పరిటాల అనుచరుల దౌర్జన్యం..
-
కిడ్నాప్ కలకలం.. టీడీపీ మంత్రి వర్గీయులే..
సాక్షి, ధర్మవరం : అనంతరపురం జిల్లా ధర్మవరంలో కిడ్నాప్ కలకలం చోటుచేసుకుంది. ధర్మవరం ఆర్టీవో కార్యాలయం వద్ద గురువారం బళ్లారి వెంకటేశ్ అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివి.. టీడీపీ మంత్రి పరిటాల సునీత వర్గీయులే వెంకటేష్‌ను కిడ్నాప్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన వెంకటేష్ పేరు మీద పది కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి ఉందన్నారు. గతంలో ఆస్తిని కోటి రూపాయాలకు విక్రయించాలిని టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు కుటుంట సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
మంత్రికి పట్టని ‘అంగన్ వాడీ’!
అద్దె భవనాల్లోనే కేంద్రాల నిర్వహణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే దయనీయ స్థితి ప్రారంభానికి నోచుకోని కొత్త భవనాలు ఐదేళ్లలోపు చిన్నారులకు ఆటపాటలతో అక్షరాలు నేర్పడం.. కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య పరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు, పౌష్టికాహారాన్ని అందజేయడం... ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, పల్స్ పోలియో... ఓటరు నమోదు ప్రక్రియలను విజయవంతం చేయడంలోనూ అంగన్వాడీ కార్యకర్తల పాత్ర ఎనలేనిది. అలాంటి అంగన్వాడీ వ్యవస్థ నిర్వహణపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సొంత భవనాలు సమకూర్చడంలోనూ, మౌలిక వసతులు మెరుగు పరచడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోనే అంగన్వాడీల పరిస్థితి దయనీయంగా ఉందంటే.. ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. - కనగానపల్లి (రాప్తాడు) సొంత భవనాలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులు లోపించాయి. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గం రాప్తాడులోనే ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, రామగిరి, ఆత్మకూరు మండలాల్లో 305 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 115 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. మిగిలిన వాటిని అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. వీటిలో కూడా చాలా భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. మౌలిక వసతులు లోపించడంతో సుమారు పది వేల మంది చిన్నారులు, 1,500 మంది గర్భిణులు, 1,600 మంది బాలింతలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె చెల్లింపుల్లోనూ తిరకాసు జిల్లా వ్యాప్తంగా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి అద్దె చెల్లింపుల్లో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కనగానపల్లి మండలంలో పరిశీలిస్తే.. 58 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా,వ వీటిలో 18 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. మిగిలిన 40 కేంద్రాల్లో కొన్నింటిని ప్రభుత్వ పాఠశాలల్లో, మరికొన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో సుమారు 2,100 మంది చిన్నారులు ఆటపాటలతో అక్షరాలు నేర్చుకుంటున్నారు. ఈ పిల్లలతో పాటు 260 మంది బాలింతలు, 350 మంది గర్భిణులకు ఈ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. అద్దె భవనాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు లోపించాయి. ప్రధానంగా కనగానపల్లి-2, శివపురం, భానుకోట, కుర్లపల్లి గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అద్దె భవనాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో బాడుగలు చెల్లించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇంటి యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. పర్వతదేవరపల్లి, చంద్రశ్చర్ల, రాంపురం, బాలేపాళ్యం, కోనాపురం తదితర గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈతరహా పరిస్థితులు ఒక్క కనగానపల్లి మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఉంది. ప్రారంభానికి నోచుకోని కొత్త భవనాలు కనగానపల్లి, తగరకుంట, భానుకోట గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ ప్రారంభించలేకపోయారు. దీంతో ఈ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను అద్దె గదుల్లోనే నిర్వహిస్తున్నారు. పక్కా భవన నిర్మాణాలకు సంబంధించి రూ. లక్షల్లో ప్రజా ధనాన్ని వెచ్చించి, నిరుపయోగం చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నా.. అధికారులు, పాలకులు స్పందించడం లేదు. అసంపూర్తి నిర్మాణాలతోనే.. ఒక వైపు నిర్మాణాలు పూర్తి అయిన భవనాలను ప్రారంభించకుండా అలసత్వం వహించిన ప్రభుత్వం.. మరో 11 నూతన భవనాలను మంజూరు చేసింది. వీటి నిర్మాణం చేపట్టి ఏడాది అవుతున్నా.. ఎక్కడా పూర్తి కాలేదు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. కుర్లపల్లి గ్రామంలో 2004లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో పనికి ఆహార పథకం కింద అంగన్ వాడీ భవన నిర్మాణాన్ని చేపట్టారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోక పోవడంతో 90 శాతం వరకూ నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న భవనాన్ని అలాగే వదిలేశారు. మరో పది శాతం నిధులు కేటాయించి ఉంటే ఈ భవనం పూర్తి అవుతుంది. అలా కాకుండా ఇదే ప్రాంతంలో కొత్తగా రూ. 5 లక్షలతో మరో భవనాన్ని మంజూరు చేసి, ప్రజా ధనం దుర్వినియోగానికి ప్రభుత్వం తెరలేపింది. కేవలం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల లబ్ధితో పాటు, పర్సంటేజీల కోసమే ఇలాంటి చవకబారు చర్యలకు ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై మంత్రి దృష్టి సారించాలని కోరుతున్నారు. -
‘పరిటాల’ దర్పం
- దళిత ఉద్యోగికి వేధింపులు - విధులకు అనుమతి నిరాకరణ - 13 నెలలుగా వేతనం బంద్ - హైకోర్టు ఉత్తర్వులూ బేఖాతర్ అనంతపురం టౌన్ : మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో ‘అధికార’ అరాచకం పెరిగిపోతోంది. అన్ని శాఖల్లోని అధికారులు మంత్రి, ఆమె అనుచరుల కనుసన్నల్లో పని చేయాల్సిందే. ఇక్కడ విధులు నిర్వర్తించాలన్నా.. విధుల్లోంచి తొలగించాలన్నా మంత్రి ఆజ్ఞ తప్పనిసరి. చివరకు కోర్టు తీర్పును కూడా బేఖాతరు చేస్తూ ఓ దళిత ఉద్యోగిని మానసికంగా వేధిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నేకొత్తపల్లి మండలం పులేటిపల్లి పంచాయతీలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్ఏ)గా చంద్రమోహన్ 2012 ఆగస్టు 1న నియమితులయ్యారు. 2014 మార్చిలో సామాజిక తనిఖీలు నిర్వహించి పనులు కల్పించడంలో అలసత్వం వహించారని విధుల్లోంచి తొలగించారు. బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు వచ్చాయి. దీంతో చంద్రమోహన్‌ను విధుల్లోంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డ్వామా పీడీ నాగభూషణం ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత వివరాలను పీడీ కార్యాలయానికి అందజేయాలని చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓకు సూచించారు. చంద్రమోహన్‌కు సంబంధించి ఐడీ నంబర్‌ను పునరుద్ధరించాలని హెచ్ఆర్ మేనేజర్‌కు ఆదేశించారు. దీంతో 2015 అక్టోబర్ 19న ఎఫ్ఏను విధుల్లోకి తీసుకున్నారు. ఎనిమిది నెలలు సజావుగా సాగినా ఆ తర్వాత మళ్లీ కథ మొదటికొచ్చింది. రాజకీయ ఒత్తిడితో అతడ్ని విధుల్లోంచి తొలగించారు. ఆ తర్వాత బాధితుడు ఎన్నిసార్లు కలెక్టర్, డ్వామా అధికారులను ఆశ్రయించినా అదే పరిస్థితి. చివరకు తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఏకంగా గ్రీవెన్స్‌లో 2016 డిసెంబర్ 15న ఫిర్యాదు చేశారు. మళ్లీ కోర్టును ఆశ్రయించగా అదే నెల 31న సీకే పల్లి ఎంపీడీఓ తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే పనులు మాత్రం ఈయనతో చేయించడం లేదు. మంత్రి పరిటాల సునీత అండతో మరో వ్యక్తి అనధికారికంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఉద్యోగంలో ఉన్న వ్యక్తికి జీతాలు రావాలంటే ఉపాధి హామీ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ చంద్రమోహన్ విషయంలో ఇప్పటికీ పేరు ఎక్కించని పరిస్థితి. ఉద్యోగి ఐడీ నంబర్‌ను పునరుద్ధరించాల్సిన హెచ్ఆర్ విభాగం అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే సుమారు 13 నెలల జీతం రావాల్సి ఉంది. ఈ విషయంపై అధికారులకు అర్జీలు ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోతోంది. ప్రస్తుతం ఈ కుటుంబం పూటగడవడానికి సైతం ఇబ్బందులు పడుతోంది. అప్పులు చేసి బతుకీడుస్తున్నారు. ఈ విషయమై చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓ రామాంజనేయులును ‘సాక్షి’ వివరణ కోరగా చంద్రమోహన్ విషయంలో రాజకీయ ఒత్తిడి ఉందని అంగీకరించారు. అసలేం జరిగిందని అడుగగా ‘మీటింగ్‌లో ఉన్నాను.. మళ్లీ కాల్ చేస్తానని’ చెప్పారు. కోర్టు ఆదేశాలను అమలు చేశాం : నాగభూషణం, డ్వామా పీడీ విధి నిర్వహణలో అలసత్వం కారణంగా మొదల్లో తొలగించాం. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు విధుల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు చంద్రమోహన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గానే ఉన్నాడు. జీతాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి వివరాలు రాగానే చెల్లిస్తాం. స్థానికంగా ఉన్న పరిస్థితుల కారణంగానే విధులకు వెళ్లలేకపోతున్నాడు. అతడి స్థానంలో అనధికారికంగా ఎవరూ పని చేయడం లేదు. -
టైపిస్టును చెప్పుతో కొట్టిన ఎంపీపీ భర్త
-
టైపిస్టును చెప్పుతో కొట్టిన ఎంపీపీ భర్త
అనంతపురం: అధికారంలో ఉన్నామనే అహంకారంతో టీడీపీ వర్గీయుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. ఇటీవల విజయవాడలో ఎంపీ కేశినేని నాని.. రవాణా శాఖ అధికారిని దుర్బాషలాడి అనంతరం ఆ అధికారికి క్షమాపణ చెప్పిన వైనం మర్చిపోకముందే అనంతపురం జిల్లాలో మరో సంఘటన చోటుచేసుకుంది. కనగానపల్లెలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు ఎంపీడీఓ కార్యాలయ టైపిస్టు మూర్తిపై దౌర్జన్యం చేశారు. తాము చెప్పినట్లు వృద్ధాప్య పెన్షన్ల జాబితా తయారు చేయలేదనే కోపంతో టైపిస్టును ఎంపీపీ భర్త ముకుందనాయుడు చెప్పుతో కొట్టారు. అడ్డుకోబోయిన ఎంపీడీఓ జలజాక్షిని దుర్భాషలాడారు. ఈ దౌర్జన్యంపై మంత్రి సునీత దృష్టికి తీసుకెళ్లారు. అయితే తెలుగు తమ్ముళ్ల వ్యవహారాన్ని వెనకేసుకొచ్చిన మంత్రి... ఓ సారీ చెప్పిస్తే సరిపోతుందని అనడంతో వారు ఖంగుతిన్నారు. కాగా, టీడీపీ నాయకుల భయంతో టైపిస్టు, ఎంపీడీఓలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరోవైపు ఈ ఘటనను వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడిని ఖండిస్తున్నామని, మంత్రి పరిటాల వ్యవహార శైలిని ముఖ్యమంత్రి పునపరిశీలించాలని ఆయన అన్నారు. -
మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే: తోపుదుర్తి
అనంతపురం : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలపై దాడులు చేయడం పిరికిపంద చర్య అని రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే రాప్తాడులో ఇప్పటివరకూ ఎనిమిది వైఎస్ఆర్ విగ్రమాలపై దాడులు జరిగాయని ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. కాగా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యం కొసాగుతోంది. వైఎస్ఆర్ విగ్రహాలపై టీడీపీ నేతలు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సీకేపల్లిలో వైస్ఆర్ విగ్రహాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. -
పరిటాల సునీత,సూరి వర్గాల మధ్య ఘర్షణ
-
'బీసీల జోలికొస్తే పుట్టగతులుండవ్'
అనంతపురం: అనంతలో మంత్రి పరిటాల సునీత అరాచకాలపై వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు పెద్దయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనగానపల్లెలో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ మంత్రి పరిటాల కుతంత్రాలు పన్ని టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికలో మంత్రి బీసీలను మోసంచేశారని, ఇది అనైతికమని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీసీల జోలికి వస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. -
కనగానపల్లె ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
► వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు నిరంజన్ ధ్వజం ఉరవకొండ: అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు పాటిల్ నిరంజన్‌గౌడ్ ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కనగానపల్లె మండల పరిషత్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మంత్రి పరిటాల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. వైఎస్సార్సీపీ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి ఏకపక్షంగా ఎన్నికలు జరిపించారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి మండల పరిషత్‌లో సంపూర్ణ ఆధిక్యం ఉన్నా పరిటాల వర్గీయులు తమ ఉనికి కాపాడుకోవడం కోసం నీచ రాజకీయాలుచేసి ఎంపీపీ స్థానం కైవసం చేసుకున్నారని నిరంజన్ ధ్వజమెత్తారు. -
మంత్రి సునీత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
ప్రైవేట్ సైన్యాన్ని పెంచి పోషించలేదు
∙ నాకు రక్తపు మరకలు అంటించొద్దు ∙ అరాచకాలు, సెటిల్మెంట్లకు వ్యతిరేకం ∙ పరోక్షంగా ‘పరిటాల’ వర్గాన్ని టార్గెట్ చేసిన చౌదరి అనంతపురం టౌన్ : అరాచకాలు, సెటిల్మెంట్లకు తాను వ్యతిరేకమని, అనవసరంగా రక్తపు మరకలు అంటించవద్దని అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. రుద్రంపేట సమీపంలో రెండ్రోజుల క్రితం జరిగిన జంట హత్యలో తన ప్రమేయం ఉందని కొందరు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ సైనాన్ని పెంచి పోషించే సంస్కృతి తనది కాదన్నారు. ‘అవే’ సంస్థ స్థాపించి ఫ్యాక్షన్‌కు వ్యతిరేకంగా సీమలో పోరాటం చేశానన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. అజయ్‌ఘోష్ కాలనీలో కొంత మంది నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడి అందులో వచ్చిన గొడవల వల్లే ఈ హత్యలు జరిగాయన్నారు. హతులు గతంలో కొన్ని మర్డర్ కేసుల్లో ఉన్నారని, ఆ హత్యలు ఎవరి కోసం చేశారో.. ఎవరికి తగాదాలు ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే అంతా అర్థమవుతుందన్నారు. హత్య జరిగిన రోజు కొందరు స్లిప్పులు రాయించి తనపై ఆరోపణలు వచ్చేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిలుక పలుకులు పలికించారని ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని, అందులో తనకు సంబంధం ఉన్న వాళ్లు ఉంటే కఠినంగా శిక్షించాలని సూచించారు. ఇదిలావుండగా ఎమ్మెల్యే ప్రెస్‌మీట్ అంతా పరోక్షంగా మంత్రి పరిటాల సునీతను టార్గెట్ చేస్తూ ఉండడం పట్ల విలేకరులు తీవ్ర స్థాయిలో చర్చించుకున్నారు. ‘చిలుక పలుకుల’పై మీడియా ప్రశ్నలు వేయగా అది అందరికీ తెలిసిందేనని, సమయం వచ్చినప్పుడు రివీల్ అవుతానని చెప్పడం గమనార్హం. నిందితులు దొరికాక మరోసారి సవివరంగా ప్రెస్‌మీట్ పెడతానన్నారు. -
వెలగపూడిలో ఎన్టీఆర్ క్యాంటీన్
విజయవాడ : నూతన రాజధాని వెలగపూడిలోఈ నెలాఖరున ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ క్యాంటీన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో క్యాంటీన్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎన్టీఆర్ క్యాంటీన్లపై మంత్రులు నారాయణ, పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే నెలలో మరో రెండు ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీఆర్డీఏ పరిధిలో వీటి నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించామని తెలిపారు. క్యాంటీన్ల కోసం ఇప్పటికే స్థలసేకరణ పూర్తయిందని, ఒకచోట వంటశాల ఏర్పాటుచేసి అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన క్యాంటీన్లకు పంపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తామన్నారు. అల్పాహారంలో ఇడ్లీ-సాంబార్, పొంగల్ మధ్యాహ్నం భోజనంగా లెమన్ రైస్, సాంబార్ రైస్, పెరుగన్నం ఇస్తామన్నారు. మంత్రుల కమిటీ చేసిన ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రికి వివరిస్తామని చెప్పారు. -
ఆగస్టు నాటికి ఏయే చెరువులకు నీళ్లిస్తారో చెప్పాలి
► ఇవ్వకపోతే రాజీనామా చేస్తారా? ► మంత్రి పరిటాల సునీతకు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సవాల్ అనంతపురం: హంద్రీ-నీవా కాలువ నిర్మాణాలను పూర్తి చేసి ఆగస్టు నాటికి జిల్లాలోని చెరువులకు నీళ్లిస్తామని మంత్రి పరిటాల సునీత చెబుతున్నారని, రాప్తాడు నియోజకవర్గంలో ఏయే చెరువులకు నీళ్లిస్తారో బహిర్గతం చేయాలని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా అందుబాటులో లేని మంత్రి ఈరోజు నియోజకవర్గ ప్రజల్లో ఉండేందుకు తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. హంద్రీ-నీవా నీటిని కుప్పం తరలించేందుకు కుట్ర పన్నిన వైనంపై హంద్రీ-నీవా జలసాధన సమితి ఆధ్వర్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి తాము ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశామన్నారు. దీనిపై అనవసరంగా ప్రజలకు అపోహాలు కల్పిస్తున్నారంటూ మంత్రి మాట్లాడుతున్నారన్నారు. అధికార పార్టీ చే స్తున్న నీటి చౌర్యంపై ప్రజలు ఎక్కడ తిరగబడుతారోనని భయపడి భూములకు అంచనాలు వేసి ప్రతిపాదనలు పంపామని ఈనెల రెండో వారంలో అధికారులకు చెప్పార న్నారు. అయితే ఇప్పటి దాకా చెరువులు, పిల్లకాలువల తవ్వకాలకు ప్రతిపాదనలు ఇవ్వలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి సునీతకు కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటిపై రైతులకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రరెడ్డి, కనగానపల్లి జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, కనగానపల్లి సింగిల్‌విండో అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ నరసింహారెడ్డి, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి యూపీ నాగిరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి బాబా సలాం, కార్యదర్శి సునీల్‌దత్తరెడ్డి పాల్గొన్నారు. ►జీఓ 22ను అడ్డుపెట్టుకుని రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని ఆయకట్టును తొలిగించిన మాట వాస్తవం కాదా? లేదంటే ఉత్తర్వులు బహిరంగపరచండి. ►2,3,4,5,7 ప్యాకేజీల్లో రాప్తాడు నియోజకవర్గంలోని సుమారు 80 కిలోమీటర్ల ప్రధానకాలువలో ఒక ఎకరా నీరివ్వడానికైనా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు చేశారా? తూములు, చెరువులకు నీళ్లిచ్చేందుకు, సప్లయ్చానళ్లకు ప్రొవిజన్ లేదని చెప్పిన మాట వాస్తవం కాదా? మీరు ఒప్పుకుంటారా.. లేదంటే తాము బహిర్గ పరచాలా? ► జిల్లాలో 1263 చెరువులకు ఆగస్టులోగా నీళ్లిస్తామని చెబుతున్నారు. ఏయే చెరువులకు నీళ్లిస్తారో చెప్పాలి. ►చెరువులు, ఆయకట్టుకు నీళ్లివ్వక ప్రధానకాలువను పూర్తిచేసి నీటిని కుప్పం తరలించడమే మీ ఉద్ధేశం కాదా? ►కుప్పం నియోజకవర్గంలోని ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని చూస్తున్నారు తప్ప రాప్తాడు రైతులకు నీళ్లు అవసరం ఉందా? లేదా? ►హంద్రీ నది నుంచి నీవా నది వరకు కాలువ పూర్తి చేసి, తర్వాత ఆయకట్టుకు నీళ్లిస్తామని మంత్రి చెబుతున్నారని నీవా దిగువ సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం వరకు కాలువ తవ్వడం వెనుక మర్మమేమిటో? ► బద్ధలాపురం చెరువుకు నీరు ఏవిధంగా ఇస్తారో చెప్పాలి ►పేరూరు డ్యాంకు హంద్రీ-నీవా నుంచి నీరిస్తామని సర్వే అంచనాలు సిద్ధం చేశామని చెబుతున్నారు. ఆ వివరాలు బహిర్గ పరచాలి ► హంద్రీ-నీవా సృష్టికర్త శివరామకృష్ణయ్య డీపీఆర్ కంటే కూడా మీరు చేస్తున్న సర్వే గొప్పదా అని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఇ-పోస్తో పారదర్శకత
► రేషన్ డీలర్ల కమిషన్ పెంపుపై త్వరలో నిర్ణయం ► మంత్రి పరిటాల సునీత విజయవాడ(భవానీపురం) : ఇ -పోస్ విధానం ద్వారా నిత్యావసర సరుకులను సకాలంలో అందించడంపట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీ (ఆహార సలహా సంఘం) సమావేశం బుధవారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇ-పోస్ విధానాన్ని అమలు చేయడం వలన 30 వేల మెట్రిక్ టన్నులు పొదుపు చేశామని, తద్వారా రూ. 300 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని వివరించారు. పార్టీలకు అతీతంగా రేషన్ కార్డులు, దీపం కనెక్షన్లను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇస్తామని చెప్పారు. 2017 నాటికి ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ అందచేస్తామని తెలిపారు. చౌక ధరల దుకాణాల డీలర్లకు కమిషన్ పెంచే విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోందని, త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎమ్ఎల్ఎస్ పాయింట్ల వద్ద ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ఏర్పాటు చేసి డీలర్లకు అందిస్తామన్నారు. వృద్ధులు, వికలాంగులకు నిత్యావసర సరుకులను నేరుగా వారి ఇంటి వద్దకే అందించేలా ‘మీ ఇంటికి - రేషన్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ కరికాల వలవన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్వంత భవనాలు లేని వినియోగదారుల ఫోరంలకు త్వరలో భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. పౌరసరఫరాల శాఖ డెరైక్టర్ జి రవిబాబు మాట్లాడుతూ ఇ-పోస్ పోర్టబులిటీ విధానం ద్వారా రాష్ర్టంలో ఏ ప్రాంతంలోనైనా రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. ఏపి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ ఎం లింగారెడ్డి ఆన్లైన్ విధానంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పి చంద్రశేఖరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, వివిధ జిల్లాల వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పలు సలహాలు, సూచనలు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ జనరల్ అనూరాధ, ఉన్నతాధికారులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
అమ్మకానికి ‘చంద్రన్న కానుక’
చంద్రబాబు ఫొటోతో ముద్రించిన సంచులు మార్కెట్లో విక్రయం గోవిందరావుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా చంద్రన్న కానుక పేరుతో ముద్రించిన బ్యాగులు తెలంగాణలో అమ్మకానికి వచ్చాయి. పేదలకు చంద్రన్న కానుక పేరుతో సంక్రాంతికి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సరుకులు అందిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా సంచులను ముద్రించింది. సంచులపై ఏపీ సీఎం చంద్రబాబు, పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఫొటోలు ముద్రించారు. అయితే ముద్రణలో లోపాలున్న సంచులు కొన్ని వరంగల్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని దుకాణాల్లో దర్శనమిస్తున్నాయి. ఒక్కో సంచి రూ. 15 నుంచి రూ. 20 వరకు అమ్ముతున్నారు. -
రేషన్ షాపుల్లో సరుకుల్లేవు..!
పొగతోట (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు) : వరద బాధితులకు అందించాల్సిన నిత్యావసరాలు చౌక ధరల దుకాణాల్లో లేకపోవటంతో పౌర సరఫరాల శాఖ మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పరిటాల సునీత శనివారం ఉదయం నెల్లూరు నగరంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కొత్తూరులోని రేషన్ షాపులో తనిఖీలు చేశారు. అందులో బియ్యం మినహా ప్రభుత్వం వరద బాధితులకు సరఫరా చేసిన కందిపప్పు, చక్కెర, పామాయిల్ నిల్వలు లేవు. అనంతరం ఆమె పొదలకూరు రోడ్డులోని మరో రేషన్ షాపును పరిశీలించారు. అందులో బియ్యం సహా సరుకులేమీ లేవు. ఈ పరిస్థితిపై ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసరాలను వెంటనే అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రహదారులు దెబ్బతినటం, ఆగని వానల కారణంగానే తాము సరుకులను రవాణా చేయలేకపోయామని అధికారులు అంటున్నారు. -
సాయంత్రానికే మూత
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సర్వజనాస్పత్రి రాత్రి 10 గంటలు... ఏడుగురు సభ్యుల ‘సాక్షి’ బృందం ఆస్పత్రిలోకి వెళ్లగానే ఆరుబయట రోగుల బంధువులు నిద్రపోతున్న దృశ్యం కన్పించింది. వారి మధ్యలో కుక్కలు తిరుగుతున్నాయి. ఏడుగురు మూడు బృందాలుగా విడిపోయి ఆస్పత్రి వార్డులను పరిశీలించారు. మొదట అడ్మిషన్ వార్డులోకి వెళ్లగానే ఓ వ్యక్తి రికార్డులు రాస్తున్నారు. రోజుకు ఎంతమంది రోగులు వస్తారని ప్రశ్నించగా.. 40-60మంది వస్తారని బదులిచ్చారు. ‘మీ పేరేంటని’ ఆరా తీయగా.. ఆ కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోయాడు. వాస్తవమేంటంటే అతను సెక్యూరిటీ గార్డు. అడ్మిషన్ రికార్డులు రాసే వ్యక్తి రాలేదు. రోజూ ఇదే తంతు! తర్వాత ఎమర్జెన్సీలోకి వెళ్లగా.. క్యాజువాలిటీలో డాక్టర్ శారద, ఫిజీషియన్ మురళీ, సర్జన్ విజయలక్ష్మి రాత్రి విధుల్లో ఉన్నారు. స్టాఫ్ నర్సులూ ఉన్నారు. అంతలోనే 108 వాహనం వచ్చి ఆగింది. లోపల ఓ యువకుడు తీవ్ర గాయాలతో ఉన్నాడు. ఇతన్ని కిందకు దించేందుకు సిబ్బంది ఎవ్వరూ రాలేదు. నడవలేని స్థితిలో ఉన్నా స్ట్రెచర్ తీసుకురాలేదు. అనంతపురం మూడోరోడ్డుకు చెందిన శేఖర్ అనే ఆ యువకుణ్ని స్నేహితులే చేతులపై తీసుకుని ఎమర్జెన్సీలో చేర్పించారు. అక్కడి నుంచి ఆర్థోపెడిక్ వార్డుకు వెళ్లాం. అక్కడ కుక్కలు గుంపుగా కన్పించాయి. వార్డులో డాక్టర్లెవరూ లేరు. డ్యూటీ నర్సులు ఉన్నారు. తర్వాత గైనిక్ వార్డుకు వెళ్లగా గైనకాలజిస్ట్ లక్ష్మీకాంత ఉన్నారు. ఇక్కడ భద్రత విధులు మహిళ నిర్వహించాలి. కానీ పురుషుడు ఉన్నారు. పీడియాట్రిక్, బ్లడ్‌బ్యాంకు వద్ద గార్డులు లేరు. తక్కిన వార్డుల్లో డ్యూటీ డాక్టర్లంతా విధుల్లో ఉన్నారు. 24గంటల ఆస్పత్రులు మరీ దారుణం జిల్లాలో రౌండ్‌ది క్లాక్ పనిచేయాల్సిన ఆస్పత్రులను ‘సాక్షి’ క్షేత్రస్థాయి సిబ్బంది పరిశీలించింది. మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడిచెరువు, పాముదుర్తి ఆస్పత్రులకు సాక్షి విలేకరులు రాత్రి తొమ్మిది గంటలకు వెళ్లారు. అప్పటికే ఆ ఆస్పత్రులు మూత వేసి ఉన్నాయి. కొత్తచెరువు, బుక్కపట్నం ఆస్పత్రులు తెరిచి ఉన్నా డాక్టర్లు లేరు. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గం(రాప్తాడు)లోనూ ఇదే తీరు. కనగానపల్లి, నాగసముద్రం, రామగిరి, ఆత్మకూరు పీహెచ్‌సీలను తనిఖీ చేయగా.. ఆత్మకూరు మినహా ఎక్కడా డాక్టర్లు లేరు. ఆత్మకూరులో కూడా హౌస్‌సర్జన్ విధులు నిర్వర్తించారు. హిందూపురం ఆస్పత్రిలో పరిస్థితి మరీ దారుణం. విలేకరులు రాత్రి 10 గంటలకు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ 181 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. కానీ 100 పడకలే ఉన్నాయి. ఒక్కో బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు ఉన్న దృశ్యాలు కనిపించాయి. రాత్రి విధుల్లో డాక్టరు లేరు. ఫోరెన్సిక్ నిపుణుడు రోహిల్ మాత్రమే ఉన్నారు. చిలమత్తూరు, లేపాక్షి ఆస్పత్రులలోనూ రాత్రి విధుల్లో డాక్టర్లు లేరు. ఇక్కడ రోజూ ఇదే పరిస్థితి. హిందూపురం, కదిరి ఆస్పత్రిలో మంచినీటి సౌకర్యం లేక రోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పెనుకొండ ఆస్పత్రిలో రాత్రి 9.45 గంటలకు విలేకరులు వెళ్లగా.. ఒక్క డాక్టరూ కన్పించలేదు. ఏఎన్ఎం మాత్రమే ఉన్నారు. ఆరా తీస్తే..‘ఆన్ ఫోన్‌కాల్స్ డ్యూటీ చేస్తామన్నారు. జిల్లాలోని మొత్తం 42 రౌండ్‌ది క్లాక్ ఆస్పత్రులలో 29 ఆస్పత్రులను సాయంత్రానికే మూసేశారు. -
వాన వస్తే కారుతోంది..
♦ నీటిని ఎత్తివేసేందుకు అవస్థపడుతున్నాం.. ♦ భోజనం సరిగా లేదు ♦ మంత్రి వద్ద వాపోయిన హాస్టల్ విద్యార్థినులు ♦ సిబ్బందిపై మంత్రి ఆగ్రహం అనంతపురం అర్బన్ : ‘భోజనం బాగుండడం లేదు.. వాన వస్తే హాస్టల్ కారుతోంది, ఆ నీటిని ఎత్తివేసేందుకు అవస్థలు పడుతున్నాం.. భవనంలో 300 మంది ఉంటున్నాం.. టాయ్లెట్లు లేవు..’ అని స్థానిక అరవిందనగర్‌లోని ఎస్సీ బాలిక హాస్టల్-2 విద్యార్థినులు పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత వద్ద వాపోయారు. మంత్రి ఆదివారం హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను తమ సమస్యలను ఆమెకు వివరించారు. హాస్టల్ నిర్వహణ సరిగ్గాలేకపోవడంపై ఆమె సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థినులు హాస్టల్లో ఉంటూ చదువుకుంటారు. వారిని మీ సొంత పిల్లల్లా చూసుకోవాలి. వారిని ఇబ్బంది పెడుతున్నట్లు నా దృష్టికి వస్తే చర్చలు తప్పవు’ అని అన్నారు. మీ ఇంట్లో పిల్లలను ఇలాగే చూసుకుంటారా..? వీళ్లు అమ్మనాన్నలను వదిలేసి ఇక్కడి వచ్చి చదువుకుంటున్నారు. వీళ్లను మీ పిల్లల్లా చూసుకోవాల్సింది పోయి పట్టించుకోరా..? భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదంట. ఇలాగైతే మీ అందరిపైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇంత మంది పిల్లలకు ఈ చిన్న భవనం సరిపోదు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వేరొక మంచి భవనంలో మార్పించే ఏర్పాటు చేస్తామని విద్యార్థినులకు హామీ ఇచ్చారు. -
సునీత సాక్షిగా..భగ్గుమన్న వర్గ విభేదాలు
► బయటపడిన కళా, అచ్చెన్న వర్గాల మధ్య ఆదిపత్యపోరు ► ఎవరికి వారే అవతలి వర్గాన్ని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ ► చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చిన పరిటాల శ్రీకాకుళం అర్బన్: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీత సాక్షిగా టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కళావెంకటరావు వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకోవడం, ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలతో పాటు ఎవరికి వారే అవతలి వర్గాన్ని సస్పెండ్ చేయాలంటూ సునీతకు ఫిర్యాదు చేయడం విశేషం. జిల్లా పర్యటన సందర్భంగా స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం మధ్యాహ్నం పార్టీ అంతర్గత సమావేశం సునీత నిర్వహించారు. ఈ సమీక్షకు విలేకరులను పిలవలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన సమావేశం 3 గంటల వరకూ జరిగింది. సమీక్ష మధ్యలో పాలకొండ, కొత్తూరు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన తగాదాలు చర్చకు వచ్చాయి. పార్టీలో విశేషాలు ఏంటని మంత్రి అడుగగా పాలకొండ వర్గీయులు..పార్టీనేత కర్నేని అప్పలనాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నిమ్మక జయకృష్ణ సహా నేతలంతా కుండ బద్దలుగొట్టారు. అదే సమయంలో ఆయనను ఎందుకు సస్పెండ్ చేయాలంటూ కళావెంకటరావు వర్గం భగ్గుమంది. పార్టీని పదేళ్లపాటు జెండా మోసి కష్టకాలంలో ఆదుకుని అధికారంలోకి తెస్తే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మరో టీడీపీ నాయకురాలు ఖండాపు జ్యోతి ఆరోపణలు గుప్పించారు. తనకు ఓ ఉన్నత పదవి ఇప్పిస్తామని మోసం చేశారంటూ వాపోయారు. వెనువెంటనే పాలకొండ పార్టీ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణను పదవి నుంచి తప్పించాలని మరో వర్గం డిమాండ్ చేసింది. దీనికి మిగతావారు కొంతమంది వంతపాడారు. వీటన్నింటికీ మూల కారణం జిల్లా మంత్రి అచ్చెన్న, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళావెంకటరావు మధ్య ఎప్పటినుంచో చోటుచేసుకుంటున్న విభేదాలేనని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. చివరాఖరులో ఎవరినీ సస్పెండ్ చేయక్కరలేదు. మీరు చెప్పింది అధిష్టానం దృష్టికి తీసుకువెళతానంటూ పరిటాల సునీత నవ్వుకుంటునే విభేదాలను ముక్తాయించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శివాజీ, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, గుండ లక్ష్మీదేవి, సహా విప్ కూన రవికుమార్, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, పార్టీ నేత చౌదరి బాబ్జి, పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు నిమ్మక జయకృష్ణ, శత్రుచర్ల విజయరామరాజు, ఎమ్మెల్సీ కావలి ప్రతిభా భారతి, బోయిన గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. -
'ఉల్లికి కనీస మద్దతు ధర నిర్ణయిస్తాం'
కర్నూలు : ఉల్లికి కనీస మద్దతు ధర ప్రకటించే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావులతో చర్చిస్తానని వెల్లడించారు. మంగళవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోళ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉల్లి ధరలు పడిపోయినా రైతులకు నష్టం లేకండా ఉండేందుకు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తామన్నారు. మార్కెట్లో ఆ ధర కంటే తగ్గినపుడు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వివరించారు. కిలో ఉల్లి రూ.20 ప్రకారం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌యార్డులో 400ల టన్నులు కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు 6,166 టన్నులు కొనుగోలు చేసి జానాభా ప్రకారం అన్ని జిల్లాలకు సరఫరా చేయనున్నామని చెప్పారు. -
సరుకులు సక్రమంగా సరఫరా చేయండి
అనంతపురం అర్బన్ : ‘‘ఇది నా సొంత జిల్లా. నేను ప్రాతినిథ్యం వహించే పౌర సరఫరాల శాఖ ద్వారా సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలి.’’ అంటూ అధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆదేశించారు. మంగళవారం ఆమె తన నివాసంలో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతంతో కలిసి ఈ పాస్, ఉల్లిపాయల విక్రయం, తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మునిసిపాలిటీల్లో ఉల్లిపాయలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జేసీని మంత్రి ఆదేశించారు. ఉల్లిపాయలు ప్రతి రోజు వంద టన్నులు కొనుగోలు చేసి జిల్లాకు పంపిస్తున్నామన్నారు. మార్కెటింగ్ సొసైటీల ద్వారా కూడా ఉల్లిపాయల విక్రయానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. స్మార్ట్ కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు రూపొందించే ఆలోచన చేస్తున్నామన్నారు. సాంకేతిక సమస్య వల్ల కార్డుదారులకు రేషన్ ఇవ్వకుండా వెనక్కి పంపించకూడదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వారికి రేషన్ ఇచ్చే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ మేనేజర్ శ్రీనివాసులు, మార్కెటింగ్ ఏడీ శ్రీకాంత్‌రెడ్డి, ఆర్డీఓ హుసేన్‌సాబ్ పాల్గొన్నారు. -
ఈ-పాస్ ‘హుష్’
- మంత్రి ఇలాకాలోనే అమలుకాని వైనం అనంతపురం అర్బన్: పేదల బియ్యం నల్లబజారుకు తరలకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ-పాస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిం ది. అయితే ఆ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో ఈ-పాస్ విధానం అమలు అరకొరగా సాగుతోంది. కొం దరు డీలర్లు ఈ పాస్ యంత్రాలను వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. నియోజవకర్గం పరిధిలో ఈ పాస్ అంతంత మాత్రంగా అమలవుతోంది. అనంతపురం రూరల్ మండలం చెందిన పాపంపేట, విద్యారణ్యనగర్, నందమూరినగర్, తారకరామనగర్, గణేశ్‌నగర్, సుందయ్య కాలనీలతో పాటు నియోజకవర్గం పరిధిలోని పలు చోట్ల ఈ పాస్ అమలు కావడం లేదు. ఈ పాస్ యంత్రాలు వచ్చినప్పుడు స్థానిక నాయకులు ప్రారంభించారు. ఒక నెల ఈ-పాస్ విధానంలో సరుకులు పంపిణీ చేసిన డీలర్లు అటు తరువాత వాటిని వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని డీలర్ల వద్ద ప్రస్తావిస్తే... అసలు తమకు ఈ పాస్ యంత్రాలు ఇవ్వలేదని, రాబోయే నెలలో ఇస్తామని అధికారులు అన్నారని వారు చెప్పుకొస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని మేమెందుకు ఈ పాస్ ద్వారా ఇవ్వాలంటూ అనంతపురం రూరల్ మండల పరిధిలోని కొందరు డీలర్లు ఈ పాస్ యంత్రాలను ఆ శాఖకు వెనక్కి ఇచ్చేసినట్లు తెలిసింది. రెండవ విడతలో మునిసిపాలిటీలకు మొదటి విడతలో మంజూరైన 554 ఈ పాస్ యంత్రాలు మంత్రి ఇలాకాలో ఇచ్చినవి కొన్ని వెనక్కి వచ్చాయి. ఇక రెండవ విడతలో జిల్లాకు 690 ఈ పాస్ యంత్రాలు వచ్చాయి. వీటిని మునిసిపాలిటీల పరిధిలోనూ, కొన్ని ఉరవకొండ, కూడేరు మండలాల పరిధిలోని చౌక దుకాణాలకు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లలేదనేది కొసమెరుపు. ఈ- పాస్ యంత్రాలు వెనక్కు ఇస్తే చర్యలు జిల్లాలో తొలి విడత మంజూరైన 594 ఈ- పాస్ యంత్రాలను జిల్లాలోని 63 మండలాలకు కేటాయించాం. వీటిని వెనక్కు ఇవ్వడానికి వీలులేదు. ఎవరైనా వెనక్కు ఇస్తే వారిపై పచర్యలు తప్పవు. రెండవ విడత మంజూరైన 690 యంత్రాలను అన్ని మునిసిపాలిటీల పరిధిలోని దుకాణాల్లో ఏర్పాటు చేశాము. ఉరవకొండ, కూడేరు మండలాల్లో కేవలం ఒకటి రెండు చోట్ల ఉండడంతో ఆ ప్రాంతాలకు కొన్ని కేటాయించాము. - బి.లక్ష్మికాంతం, జాయింట్ కలెక్టర్ -
మంత్రుల మధ్య చిచ్చు రేపిన రంజాన్ తోఫా!
సాక్షిప్రతినిధి, అనంతపురం : రంజాన్‌తోఫా ‘అనంత’ మంత్రుల మధ్య చిచ్చురేపింది. తోఫా పంపిణీ చేసే సంచులపై సీఎం చంద్రబాబుతో పాటు పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ఫోటోను మాత్రమే ముద్రించారు. మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి పల్లెరఘునాథరెడ్డి ఫోటోను విస్మరించారు. తన ఫోటో లేకుండా సంచులను పంపిణీ చేయడంపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. పౌరసరాలశాఖ మంత్రిగా సంచిపై సునీత తన ఫోటోను ముద్రించుకోవడం సముచితమే అని, అయితే మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అయిన తన ఫోటోను విస్మరించడం ఎంత వరకు సమంజసమని తోటి మంత్రుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. జిల్లా పార్టీలో అంతా తన పెత్తనమే ఉందని చాటుకునేందుకే సునీత ఇలా వ్యవహరిస్తున్నారని పల్లె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కావాలనే మంత్రి పల్లె ఫోటో విస్మరణ: ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వాలని నెలకిందటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా 5కిలోల గోధుమపిండి, 2కిలోల చక్కెర, కిలో సేమియా, 100మిల్లీలీటర్ల నెయ్యి ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. వీటన్నిటిని ‘సంక్రాంతి కానుక’ తరహాలో ఒక సంచిలో అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి కానుక అనేది ప్రజలందరికీ సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యమంత్రితో పాటు ఈ శాఖ మంత్రి ఫోటోను సంచులపై ముద్రించారు. వీరితో పాటు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు ఫోటోను ముద్రించారు. రంజాన్‌తోఫా అనేది ప్రత్యేకంగా ఓ సామాజికవర్గానికి సంబంధించిన అంశం. ఈ క్రమంలో మైనార్టీశాఖ మంత్రి అయిన తన ఫోటోను సంచిపై ముద్రించకపోవడాన్ని పల్లె తీవ్రంగా తప్పుబడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ అంశంలో సునీత వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పల్లె ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది చెప్పకుండా కరపత్రాల పంపిణీ చేపట్టాలని సూచించారు. దీంతో కేవలం పల్లె రఘునాథరెడ్డిని సంతృప్తి పరచడం కోసం రంజాన్‌తోఫా సంచితో పాటు సీఎం, మంత్రులు పల్లె, సునీత ఉన్న ఫోటోలతో ఉన్న కరపత్రాలను అందించాలని రేషన్‌డీలర్లకు కరపత్రాలు అందించారు. అయితే చాలా చోట్ల కరపత్రాలు రేషన్‌షాపుల్లో పంపిణీ చేయలేదు. కరపత్రాలు పంపిణీ చేస్తున్నారా? లేదా? అనేది తెలుసుకునేందుకు పల్లె వర్గీయులు కొన్ని రేషన్‌షాపులు తిరిగారు. అయితే చాలాచోట్ల పంపిణీ చేయలేదు. ఎందుకని ఆరా తీస్తే కరపత్రాలు ఇచ్చార ని... సంచుల్లో ఉంచి ముస్లింలకు ఇవ్వాలని తమకు ఎవ్వరూ చెప్పలేదని డీలర్లు చెప్పారు. దీంతో ఇటు అధికారులు, అటు పరిటాల సునీత వ్యవహారాన్ని పల్లె రఘునాథరెడ్డి వర్గీయులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. -
మున్సిపల్ కార్మికుల సమస్యలు సీఎం దృష్టికి
మంత్రి పరిటాల సునీత హామీ కడప కార్పొరేషన్ : మున్సిపల్ కార్మికుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సునీతను అడ్డుకొనేందుకు మున్సిపల్ కార్మికులు నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కోటిరెడ్డి సర్కిల్, ఏడురోడ్ల కూడలి మీదుగా కళాక్షేత్రం వరకూ ర్యాలీ నిర్వహించారు. కళాక్షేత్రం బయట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు చొరవ తీసుకొని మంత్రి సునీతను కార్మికుల వద్దకు తీసుకొచ్చి మాట్లాడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కొందరు మహిళలు మంత్రి కాళ్లు పట్టుకొనే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చే స్తున్నారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి బి. మనోహర్, కార్మిక నాయకులు ఎస్. రవి, శ్రీరామ్, సిద్దిరామయ్య, దస్తగిరమ్మ, సాలమ్మ, కొండమ్మ, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. త్వరలో రేషన్ డీలర్లకు వేతనాలు వేంపల్లె : రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు త్వరలో వేతనాలు అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. వేతనాలను సీఎం ఆమోదించారని.. కేబినేట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత వేతనాలు మంజూరు చేస్తామన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం వేంపల్లెకు వచ్చిన మంత్రి పరిటాల సునీతకు శాసనమండలి డిప్యూటీ చెర్మైన్ సతీష్‌రెడ్డి, సర్పంచ్ విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక రేషన్ డీలర్లు మంత్రికి వినతి పత్రం సమర్పించారు. పనిభారం ఎక్కువగా ఉందని.. ప్రభుత్వం ఇచ్చే కమీషన్ సరిపోలేదని డీలర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రేషన్ డీలర్లకు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. -
అర్హులందరికీ పండుగ సరుకులు
రంజాన్ తోఫా ప్రారంభ సభలో మంత్రి పరిటాల సునీత ♦ కడపలో హజ్ హౌస్ నిర్మాణానికి ♦ రూ.12 కోట్లు విడుదల : సతీష్‌రెడ్డి కడప సెవెన్‌రోడ్స్ : వేలి ముద్రలు సరిపడలేదనో, ఐరిస్ మ్యాచ్ కాలేదనో ఎవరినీ వెనక్కి పంపవద్దని, అర్హులందరికీ చంద్రన్న రంజాన్ తోఫా అందజేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. కడప కళాక్షేత్రంలో మంగళవారం ఆమె రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. పేద వారు పండుగపూట సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారన్నారు. చంద్రన్న రంజాన్ తోఫా ఎవరికైనా అందకపోతే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ముస్లింల అభ్యున్నతి కోసం గతంలో మసీదులు, ఈద్గాలు, మదరసాల వంటి వాటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. కడపలో హజ్ హౌస్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ర్ట శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హజ్ైహౌస్ నిర్మాణం కోసం 10 ఎకరాల భూమిని కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించిందని చెప్పారు. కడపలో ఉర్దూ అకాడమి ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గతంలో సంక్రాంతి కానుకను అందరికీ అందించామని, ఇప్పుడు ముస్లింలు, దూదేకులకు రంజాన్ తోఫాను ప్రభుత్వం అందిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని విమర్శించారు. గతంలో హైదరాబాద్‌లో నిరంతరం మత ఘర్షణలు జరిగేవని, టీడీపీ ఆవిర్భావం తర్వాత వాటి దాఖలాలు లేవన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ముస్లింలు తమ పార్టీకి దూరమయ్యారన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కోసం బీజేపీతో తాము పొత్తు పెట్టుకున్నాము తప్ప మైనార్టీల అభ్యున్నతిని, రక్షణను ఎప్పటికీ విస్మరించలేదన్నారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ర్టం ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు అమలు చేసేందుకు అహరహం శ్రమిస్తున్నారన్నారు. ఎవరూ అడగకపోయినా రంజాన్ తోఫా ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కేవీ రమణ, జేసీ రామారావు, డీఎస్ఓ కృపానందం, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వెంకటేశం, మాజీ మంత్రి డాక్టర్ ఎస్ఏ ఖలీల్‌బాష, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎం.లింగారెడ్డి, విజయమ్మ, నాయకులు విజయజ్యోతి, అమీర్‌బాబు, జిలానీబాష, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళల అసంతృప్తి రంజాన్ తోఫా ప్రారంభ కార్యక్రమానికి పౌర సరఫరాల అధికారులు నగరంలోని ముస్లిం మహిళలను సభా స్థలికి తీసుకువచ్చారు. అందరికీ తోఫా పంపిణీ చేస్తామని అధికారులు, డీలర్లు నమ్మ బలకడంతో పేద మహిళలంతా ఎంతో ఆశగా కళాక్షేత్రం వద్దకు వచ్చారు. లాంఛనంగా కొందరికి మాత్రమే పంపిణీ చేయడంతో మిగిలిన వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. -
బియ్యం, కంది బేడల పంపిణీ కేంద్రం ప్రారంభం
ధర్మవరంటౌన్ : తక్కువ ధరలకు కందిబేడలు, సోనామసూరి బియ్యాన్ని సరఫరా చేసేందుకు మర్చంట్స్ అండ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేతలు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. స్థానిక వాసవి కొత్తసత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా చౌక ధరలకు సోనామసూరి బియ్యం, కంది బేడలు పంపిణీ చేసే కౌంటర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రేషన్ లబ్ధిదారులకు కిలో రూ. 90లకు నాణ్యమైన కంది బేడలు, కిలో రూ.29లకు సోనామసూరి బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. సేవా దృక్పథంతో రైస్‌మిల్లర్స్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, జి.సూర్యనారాయణ, ఆర్డీవో నాగరాజు, తహశీల్దార్ వి.కుమారి పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా
జిల్లా ఇన్చార్జి మంత్రి పరిటాల సునీత శ్రీకాకుళం సిటీ/ శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషిచేస్తానని టీడీపీ జిల్లా ఇన్చార్జి మంత్రి పరిటాల సునీత అన్నారు. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతపురం జిల్లాకు ఇక్కడ పరిస్థితికి చాలా వ్యత్యా సం ఉందన్నారు. జిల్లాలోని టీడీపీ కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని చెప్పారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతిపేద కుటుంబంలో ఇస్తున్న రేషన్‌పై ఏటా *700కు పైగా అదనపు భారాన్ని ప్రభుత్వం మోస్తోందన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా 11 లక్షల రేషన్‌కార్డుల దరఖాస్తులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల మేర రేషన్ కార్డులు ఉండగా 8 లక్షల బోగస్ రేషన్ కార్డులను గుర్తించామన్నారు. రాష్ట్ర కార్మిక శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 24 వరకూ హైదరాబాదులో మహానాడు జరగనుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మరచిపోతే మనుగడ ఉండదన్నారు. తోటపల్లి రిజర్వాయర్ ద్వారా 1.87 లక్షల ఎకరాలకు జూన్ నాటికి సాగునీరందిస్తామన్నారు. 2016 జూన్ నాటికి వంశధార రెండవదశ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల పర్యవేక్షకుడు, ఎంపీ తోట నర్సింహం, ఎన్నికల పర్యవేక్షకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికతో పాటు ముఖ్యమైన కమిటీలు, అనుబంధ కమిటీల ప్రక్రియను ఆదివారం సాయంత్రానికి పూర్తి చేసి వాటి జాబితాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ప్రభుత్వవిప్ కూన రవికుమార్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా అని, ఈ జిల్లాపై ప్రత్యేకదృష్టి సారించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పరిటాల సునీతను కోరారు. ఆర్థిక వనరులు, హైవే, ఇరిగేషన్, తాగునీరు, మౌలికవసతులు మెరుగుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ మంత్రి, ఎచ్చెర్ల శాసనసభ్యుడు కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల సభ్యత్వం దేశం పార్టీలో ఉందన్న విషయాన్ని తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి మాట్లాడుతూ పార్టీ పూర్వవైభవానికి, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందర్ శివాజీ, గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి, ఇన్చార్జిలు నిమ్మక జయకృష్ణ, శత్రుచర్ల విజయరామరాజు, గొర్లె హరిబాబునాయుడు, బోయిన గోవిందరాజులు, ఎల్ ఎల్ నాయుడు, తలే భద్రయ్య, పి.వి.రమణ, కలిశెట్టి అప్పలనాయుడు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సునీతకు ఘనస్వాగతం రాష్ట్ర పౌరసంబంధాల శాఖామంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పరిటాల సునీతకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం, ఏజేసీ పి.రజనీకాంతరావు, ఆర్డీవో బి.దయానిధి, డీఎస్వో సీహెచ్.ఆనంద్‌కుమార్ తదితరులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. -
చెరువులు, చెక్ డ్యాంలకు నీరందిస్తాం
మంత్రి పరిటాల సునీత వెల్లడి రాప్తాడు : పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) ధర్మవరం కుడికాలువ కింద ఉన్న 49 చెరువులతో పాటు 100 చెక్ డ్యాంలను పూర్తి స్థాయిలో నీటితో నింపుతామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. మంగళవారం రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలోని ధర్మవరం కుడికాలువలో ఉన్న ముళ్ల కంపలు, పిచ్చిమొక్కలను శ్రమదానం ద్వారా తొలగించారు. మంత్రి సునీతతో పాటు అధికారులు, టీడీపీ నాయకులు, ఆయా గ్రామాల రైతులు, ఉపాధి కూలీలు స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావం వల్ల భూగర్భజలాలు అడుగంటాయని, వరుస కరువుతో అల్లాడుతున్న ప్రజలు తాగేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎవరి కోటా నీరు వారికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలువకు నీటిని విడుదల చేయగానే రైతులు, ఆయా గ్రామాల ప్రజలు కాలువ దగ్గర కాపలాగా ఉండి ఘర్షణలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. కమిటీని ఏర్పాటు చేసి ఒకచెరువు నిండిన తర్వాత మరొక చెరువుకు నీటిని అందిస్తామన్నారు. అక్టోబర్ 15 నుంచి అన్ని చెరువులకూ నీటిని విడుదల చేస్తామని ఇదివరకు చెప్పామని, అయితే ప్రస్తుతం పీఏబీఆర్ లో ఒక టీఎంసీ మాత్రమే ఉందని, ఆ నీటిని విడుదల చేస్తే కాలువకు మాత్రమే సరిపోతుందని తెలిపారు. మరో పది రోజులు ఆలస్యమైనా హంద్రీనీవా నీటిని జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా డ్యాంలోకి మరొక రెండు టీఎంసీల నీటిని తీసుకొచ్చి తాగునీటి కోసం అన్ని చెరువులకూ నింపుతామని, రెండో విడతలో సాగుకు అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ నాగరాజు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి నారాయణస్వామి, తహశీల్దార్ హరికుమార్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, డ్వామా ఏపీడీ నాగభూషణం, ఎంపీపీ దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, వైస్ ఎంపీపీ గవ్వల పరంధామ, హెచ్చెల్సీ డీఈలు పాండురంగారావు, జేఈలు శివశంకర్, మండల కన్వీనర్ సాకే నారాయణస్వామి పాల్గొన్నారు.