అనంతపురం: అనంతలో మంత్రి పరిటాల సునీత అరాచకాలపై వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు పెద్దయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనగానపల్లెలో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ మంత్రి పరిటాల కుతంత్రాలు పన్ని టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికలో మంత్రి బీసీలను మోసంచేశారని, ఇది అనైతికమని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీసీల జోలికి వస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు.