kanaganapalli election
-
'బీసీల జోలికొస్తే పుట్టగతులుండవ్'
అనంతపురం: అనంతలో మంత్రి పరిటాల సునీత అరాచకాలపై వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు పెద్దయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనగానపల్లెలో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ మంత్రి పరిటాల కుతంత్రాలు పన్ని టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికలో మంత్రి బీసీలను మోసంచేశారని, ఇది అనైతికమని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీసీల జోలికి వస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. -
కనగానపల్లె ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
► వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు నిరంజన్ ధ్వజం ఉరవకొండ: అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు పాటిల్ నిరంజన్గౌడ్ ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కనగానపల్లె మండల పరిషత్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మంత్రి పరిటాల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. వైఎస్సార్సీపీ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి ఏకపక్షంగా ఎన్నికలు జరిపించారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి మండల పరిషత్లో సంపూర్ణ ఆధిక్యం ఉన్నా పరిటాల వర్గీయులు తమ ఉనికి కాపాడుకోవడం కోసం నీచ రాజకీయాలుచేసి ఎంపీపీ స్థానం కైవసం చేసుకున్నారని నిరంజన్ ధ్వజమెత్తారు.