ధర్మవరంటౌన్ : తక్కువ ధరలకు కందిబేడలు, సోనామసూరి బియ్యాన్ని సరఫరా చేసేందుకు మర్చంట్స్ అండ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేతలు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. స్థానిక వాసవి కొత్తసత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా చౌక ధరలకు సోనామసూరి బియ్యం, కంది బేడలు పంపిణీ చేసే కౌంటర్‌ను మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ రేషన్ లబ్ధిదారులకు కిలో రూ. 90లకు నాణ్యమైన కంది బేడలు, కిలో రూ.29లకు సోనామసూరి బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. సేవా దృక్పథంతో రైస్‌మిల్లర్స్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, జి.సూర్యనారాయణ, ఆర్డీవో నాగరాజు, తహశీల్దార్ వి.కుమారి పాల్గొన్నారు.
బియ్యం, కంది బేడల పంపిణీ కేంద్రం ప్రారంభం
Published Thu, May 21 2015 3:37 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM
Advertisement
Advertisement