ఉల్లికి కనీస మద్దతు ధర ప్రకటించే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు.
కర్నూలు : ఉల్లికి కనీస మద్దతు ధర ప్రకటించే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావులతో చర్చిస్తానని వెల్లడించారు. మంగళవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోళ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉల్లి ధరలు పడిపోయినా రైతులకు నష్టం లేకండా ఉండేందుకు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తామన్నారు.
మార్కెట్‌లో ఆ ధర కంటే తగ్గినపుడు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వివరించారు. కిలో ఉల్లి రూ.20 ప్రకారం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌యార్డులో 400ల టన్నులు కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు 6,166 టన్నులు కొనుగోలు చేసి జానాభా ప్రకారం అన్ని జిల్లాలకు సరఫరా చేయనున్నామని చెప్పారు.