Onions price
-
ఇక ఉల్లి కూడా..ఈ నెలాఖరుకు: క్రిసిల్ షాకింగ్ రిపోర్ట్
Onion prices ఇప్పటికే కొండెక్కి కూచున్న టమాట ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో పాటు చింతపండు, వెల్లుల్లి, అల్లంతో పాటు ఇతర కూరగాయలు ధలు కూడా మండిస్తున్నాయి. తాజాగా ఉల్లిపాయ ధరలపై క్రిసిల్ షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఉల్లి ధరలు కూడా టమాటా బాట పట్టనుందని క్రిసిల్ పరిశోధన వెల్లడించింది. ఆగస్టు నెలాఖరు నాటికి ఉల్లి ధరలు 150 శాతం ఎగిసి కిలో రూ.60/70కి చేరవచ్చని క్రిసిల్ పేర్కొంది. సప్లయ్ కూడా కష్టంగా మారితే ధరలు మరింత అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. (మహిళల రికార్డ్: వారి టార్గెట్ పక్షి కన్నే, గర్వంగా ఉంది: ఆనంద్ మహీంద్ర ప్రశంసలు) శుక్రవారం విడుదల చేసిన అధ్యయనం, ఫిబ్రవరి ,మార్చి 2023లో నమోదైన అమ్మకాల కారణంగా రబీ ఉల్లిపాయల షెల్ఫ్ లైఫ్ ఒకటి నుండి రెండు నెలల వరకు తగ్గిందని ఫలితంగా, గత రబీ సీజన్‌లోని ఉల్లి నిల్వలు సెప్టెంబర్ కంటేముందే ఆగస్టు నాటికే గణనీయంగా క్షీణించవచ్చని తెలిపింది. ప్రస్తుతం, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డేటా ప్రకారం, ఢిల్లీ మార్కెట్లలో ఉల్లిపాయల రిటైల్ ధర కిలోకు సుమారు రూ.30. క్రిసిల్ నివేదిక నిజమైతే, నెలాఖరు నాటికి ధరలు రెట్టింపు కావచ్చు. (పండగ సందడి షురూ: టాటా సీఎన్జీ కార్లు వచ్చేశాయ్!) అయితే దీంతోపాటు ఈ నివేదిక కొన్ని సానుకూల అంశాలను కూడా వెల్లడించింది.ఈ పెరుగుదల 2020లో కనిపించిన గరిష్ట స్థాయిల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. మరీ ముఖ్యంగా, ఖరీఫ్ పంట అక్టోబర్ నుండి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఖరీఫ్ ఉల్లి పంట మార్పిడి , పంటను నిర్ణయించడంలో ఆగస్టు , సెప్టెంబర్లలో వర్షపాతం కీలక పాత్ర పోషిస్తుందని నివేదిక హెచ్చరించింది.సెప్టెంబర్‌లో ఉన్న అధిక ధరలతో పోలిస్తే, పండుగ నెలల్లో (అక్టోబర్-డిసెంబర్) ధరల హెచ్చుతగ్గులు స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తోంది" అని నివేదిక స్పష్టం చేసింది. దేశంలో ఉల్లి ప్రస్తుత రిటైల్ ధరలు కిలోకు రూ. 25 వద్ద ఉన్నాయి. -
కర్నూలు: కోవిడ్ నిబంధలను అనుసరించి ఉల్లి క్రయవిక్రయాలు
-
కొత్తజంటకు ఉల్లిగడ్డలే బహుమానం
బెంగళూరు: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. కేజీ రూ.200 పలుకుతుండడంతోతో సామాన్యలు బెంబేలెత్తిపోతున్నారు. ఒకటి రెండు ఉల్లికాడలే మహాప్రసాదమని వంటల్లో వేసుకుని అలా కానిచ్చేస్తున్నారు. ఇదే సమయంలో ఉల్లి ఘాటుపై హాస్య సన్నివేశాలూ నమోదవుతున్నాయి. బాగల్కోటెలో జరిగిన ఒక పెళ్లిలో స్నేహితులు వధూవరులకు ఉల్లిగడ్డల కానుకను బహూకరించారు. చిన్న గంపలో ఉల్లి వేసి అందజేయడంతో కొత్త జంటతో పాటు అతిథులు నవ్వుల్లో మునిగితేలారు. నిర్మలా సీతారామన్‌కు ఉల్లిగడ్డల పార్శిల్ తాను ఉల్లిగడ్డలు తినలేదు కాబట్టి వాటి ధర తెలియదంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కి పెరంబలూర్ కాంగ్రెస్ నేతలు ఉల్లిగడ్డలను పార్శిల్ చేశారు. ప్రçస్తుతం ఉల్లి ధర రూ.200కు చేరింది. జనవరి వరకూ ధర తగ్గద ని వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై పార్లమెంట్లో చర్చ సాగింది. ఉల్లి ధరలు నియంత్రించడంతో ప్రభుత్వ తీవ్రంగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ తమ ఇంట్లో ఉల్లిగడ్డ, వెల్లుల్లి తినరని, ఉల్లి ధర గురించి తెలియ దని వ్యాఖ్యానించారు. దీనిపై దుమారం రేగింది. శుక్రవారం పెరంబలూర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రాజీవ్‌గాంధీ ఆధ్వర్యంలో దేశంలో ఉల్లిగడ్డ ధరని తగ్గించడంలో విఫలైన ప్రధానమంత్రికి, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి నిర్మాలాసీతారామన్‌కు ఉల్లిగడ్డలను పార్సల్ చేశారు. అందులో పంపిన లేఖలో.. ఇప్పటి వరకు ఉల్లిగడ్డలు తినని వారు మొదట తినాలన్నారు. ఉల్లిగడ్డ ధరలు నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ చర్యలతో దిగొస్తున్న ఉల్లి
సాక్షి, అమరావతి, కర్నూలు(అగ్రికల్చర్) : ఒకవైపున రాయితీపై రైతు బజార్లలో ఉల్లిని సరఫరా చేస్తూనే మరోవైపున బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితం ఇస్తున్నాయి. రెండు రోజులుగా మార్కెటింగ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రవాణా శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో.. రెండు రోజుల క్రితం వరకు పోటీపడి క్వింటా రూ.13 వేలకు కొనుగోలు చేసిన ట్రేడర్లు శనివారం కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్లలో క్వింటా రూ.8,750కి మించి కొనుగోలు చేయలేదు. వచ్చిన ఉల్లిలో 30 నుంచి 40 శాతానికి మించి కొనలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ ట్రేడర్లతో పోటీపడి ఉల్లిని కొనుగోలు చేస్తోంది. నాణ్యమైన ఉల్లి మార్కెట్లో కనిపిస్తే ఎంత రేటుకైనా కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ముందుకు వస్తుండటంతో ట్రేడర్లు వెనుకంజ వేస్తున్నారు. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు శనివారం 1000 క్వింటాళ్ల ఉల్లి రాగా, క్వింటా రూ.8,500 చొప్పున మార్కెటింగ్ శాఖ 550 క్వింటాళ్లను కొనుగోలు చేసింది. కర్నూలు మార్కెట్‌కు 6,500 క్వింటాళ్లు రాగా, మార్కెటింగ్ శాఖ క్వింటా రూ.8,750 – రూ.9,300 చొప్పున 4,000 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. కాగా ఇప్పటి వరకు 33,950 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయిస్తోంది. రైతుబజార్లకు సత్వరమే చేరవేత షోలాపూర్, ఆల్వార్ నుంచి ఉల్లి దిగుమతులు శనివారం నుంచి ప్రారంభం అయ్యాయి. కొనుగోలు చేసిన ఉల్లిని వెంటనే రాయితీపై రైతుబజార్లలో విక్రయించేందుకు సత్వర రవాణాకు మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంది. కర్నూలులో కొనుగోలు చేసిన ఉల్లిని రాయలసీమ జిల్లాలకు, తాడేపల్లిగూడెంలో కొనుగోలు చేసిన ఉల్లిని ఉభయగోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాలకు, షోలాపూర్ నుంచి వచ్చిన ఉల్లిని ఉత్తరాంధ్రకు రవాణా చేస్తున్నారు. రవాణాలో జాప్యాన్ని నివారించడంతోపాటు ఖర్చులు తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. రాష్ట్ర సరిహద్దులు, ప్రధాన మార్కెట్ల వద్ద ఉల్లి రవాణా, కొనుగోళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిఘా కొనసాగిస్తోంది. ఇతర రాష్ట్రాలకు ఉల్లిని ఎగుమతి చేస్తున్న లారీలను తనిఖీ చేస్తోంది. సరైన డాక్యుమెంట్లు లేకపోతే లారీలను నిలిపివేస్తోంది. వేలం పాటలు జరిగిన సమయంలో ఎక్కువ మొత్తంలో ఉల్లిని కొనుగోలు చేస్తున్న ట్రేడర్ల వివరాలను విజిలెన్స్ విభాగం అధికారులు నమోదు చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారులు భయపడి పెద్ద మొత్తంలో ఉల్లిని కొనుగోలు చేసేందుకు ధైర్యం చేయడం లేదు. దీనికితోడు డైలీ ట్రాన్స్‌పోర్టుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం వేలంలో ఉల్లి ధర తగ్గింది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతులు ప్రారంభం కావడంతో రెండు రోజుల్లోనే ఉల్లి ధరలు తగ్గుతాయని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఉల్లి కిలో రూ.8 : కన్నీరు మున్నీరవుతున్న రైతు
సాక్షి, ముంబై: ఒకవైపు దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తోంది. మరోవైపు మహారాష్ట్ర ఉల్లి రైతులు పండించిన పంటకు కనీస విలువ లభించక లబోదిబో మంటున్నారు. ఆరుగాలం శ్రమించిన పండించిన పంటకు సరియైన ధర లభించక కన్నీరు మున్నీరవుతున్నాడు. దేశవ్యాప్తంగా కిలో ఉల్లి దర సుమారు రూ.100 పలుకుతోంటే..అహ్మద్ నగర్‌కు చెందిన రైతుకు లభించింది మాత్రం రూ. 8. దీంతో రైతులు తీరని సంక్షోభంలో కూరుకుపోయిన రైతు పొలం నుంచి ఉల్లిపాయను తీసిన కార్మికులకు ఏమి చెల్లించాలి, కుటుంబ అవసరాలు ఎలా తీర్చాలి? అని బిడ్డల్ని ఎలా పోషించాలంటూ కన్నీరు పెడుతున్న వైనం పలువుర్ని కదిలిస్తోంది. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. సీఎం పదవి కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. రైతుల పరిస్థితి వారికి పట్టదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అటు విపరీతంగా పెరిగిన ఉల్లి ధరను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలకు దిగింది. ఒక లక్ష టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుని దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని నిర్ణయిచింది. దిగుమతి చేసుకున్న ఉల్లిని నవంబర్ 15- డిసెంబర్ 15 మధ్యకాలంలో దేశీయ మార్కెట్లో పంపిణీ చేయడానికి ఎంఎంటీసీని కోరామని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ఇటీవల ప్రకటించారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర పౌరులు తమ తీర్పునిచ్చి పద్దెనిమిది రోజులు గడిచాయి. కానీ బీజేపీ-శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి పీఠం ఎవర్ని వరించబోతోందన్న ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. దీంతో రాష్ట్ర రాజకీయం వాడి వేడిగా సాగుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, కాంగ్రెస్‌తో భారీ మంతనాలు సాగించి చివరకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధ మవుతుండటంతో, మహారాష్ట రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేచినట్టే. This is so heartbreaking! A poor farmer from Ahmednagar, #Maharashtra got a measly Rs 8/kg for his onion produce. He is devastated & doesn't know how he is going to pay labourers or feed his family. This is what the man busy trying to save his CM's chair has done for farmers! pic.twitter.com/Zv8sZHMUkw — Sunil Ahire (@SunilAh64145529) November 10, 2019 -
మహబూబ్‌నగర్‌లో ఉల్లి..లొల్లి!
సాక్షి, మహబూబ్‌నగర్: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అటువంటి ఉల్లి నేడు ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఉన్న ధర నేడు ఉండటంలేదు. ఈ రోజు ఉన్న రేటు రేపు రెట్టింపవుతోంది. నెల రోజుల కిందట కేవలం రూ.20 ఉన్న ఉల్లి ధర బుధవారం రూ.60కు ఎగబాకింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వ్యాపారులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దిగుమతి లేకనే.. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని తక్కువగా దిగుమతి చేసుకోవడంతో కొరత వచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతుండగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ ప రిస్థితి వచ్చిందని రైతులు అంటున్నారు. ఉల్లిపాయల ఉత్పత్తికి పేరుగాంచిన మహారాష్ట్ర రాష్ట్రంలో ముందుగా కరువు ఉండటంతో సా గు ఆలస్యమైంది. కర్నాటక నుంచి రావాల్సిన ఉల్లి కూడా రాకపోవడంతో రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుత దిగుబడి సమయంలో వర్షాలు అధికమవడం కూడా కొరతకు కారణంగా చెప్పవచ్చు. ఇదే అదునుగా కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరల పెరుగుదలకు కారణమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వా రానికే సగానికి సగం ధర పెరిగిపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల వ్యవధిలో కిలో కు రూ. 15 నుంచి రూ. 20 పెరగడం తో సామాన్యులు తట్టుకోలేకపోతున్నా రు. సాధారణంగా కిలో రూ.15 నుంచి రూ. 20 వరకు ఉండేది. ప్రస్తుతం రూ. 50 నుంచి రూ. 60 పలుకుతోంది. ప్రభుత్వ కేంద్రాలు ఎక్కడా? ప్రతీఏటా ఉల్లి ధర అమాంతం పెరుగుతూనే ఉంటుంది. ఆ సమయంలో మార్కెటింగ్, జిల్లా పౌరసరఫరాల శాఖల అధికారులు రైతుబజార్ లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తుంటారు. గ తంలో చౌకధర దుకాణాల ద్వారా కూడా తక్కు వ ధరకు ఒక్కొక్కరికి రెండు కిలోల చొప్పున ఉ ల్లిని అందించారు. అయితే ఈసారి విక్రయ కేం ద్రాలు ఏర్పాటు చేయలేదు. పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి సామాన్య, పేద ప్రజలకు తక్కువ ధర కు ఉల్లిగడ్డలు అందించాలని వినియోగదారులు కోరుతున్నారు. సామాన్యులు విలవిల ఓ వైపు నిత్యవసర సరుకులు, మరో వైపు కూరగాయలు ఇలా రోజురోజుకు పెరగుతున్న ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రలో ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో వరదలు వచ్చిన కారణంగా ఉల్లిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీంతో ప్రస్తుతం ఉల్లిధర కొండెక్కి కూర్చుంది. ఇదే సాకుగా వ్యాపారులు అక్రమ నిల్వలు చేస్తున్నారు. ఆనందంలో రైతులు దేవరకద్ర మార్కెట్లో కొత్త ఉల్లి దిగుమతులు ప్రారంభమైనా ధర మాత్రం తగ్గడం లేదు. అధికారుల సూచనలు పాటించి పండించిన రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఏడాది మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో వచ్చిన భారీ వర్షాల కారణంగా ఉల్లి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా రాష్ట్రాలలో ఉల్లి కొరత తీవ్రంగా ఏర్పడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో రాష్ట్రానికి తగినంత వచ్చే ఉల్లి దిగుమతులు పూర్తిగా తగ్గి పోయాయి. జిల్లాలో కూడా ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల డిమాండ్ బాగా పెరిగింది. గత రెండేళ్ల నుంచి రూ. 1000 దాటని ఉల్లి ధరలు రెండు నెలల నుంచి మూడింతలయ్యాయి. గరిష్టంగా రూ. 3,520 దేవరకద్ర మార్కెట్లో బుధవారం ఉల్లి వేలం జోరుగా సాగింది. మార్కెట్లోని రెండు షెడ్లు ఉల్లి కుప్పలతో నిండి పోయాయి. గూరకొండ, గోప్లాపూర్ తదితర గ్రామాల నుంచి రైతులు కొత్త ఉల్లిని అమ్మకానికి తీసుకువచ్చారు. ట్రాక్టర్లలో తెచ్చిన ఉల్లిని కిందకు పోయకుండానే వేలం వేశారు. దాదాపు 5 వందల బస్తాల ఉల్లి మార్కెట్‌కు అమ్మకానికి వచ్చినా ధరలు మాత్రం పెరిగాయి తప్ప దిగిరాలేదు. దేవరకద్ర మార్కెట్ వ్యాపారులతో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పోటీ పడ్డారు. ఉల్లి క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 3,520, కనిష్టంగా రూ. 2,910, మధ్యస్తంగా రూ. 3,215 వరకు ధరలు వచ్చాయి. ఇక పాత ఉల్లికి ఏకంగా క్వింటాల్‌కు రూ. 3800 వరకు ధర వచ్చింది. గతంలో తీవ్రంగా నష్ట పోయిన ఉల్లి రైతులు ఉల్లిని ఇప్పుడు వచ్చిన ధరలు చూసి ఆనందంలో మునిగి పోయారు. 45 కేజీల బస్తా ధర రూ. 1800... మార్కెట్లో కొనుగోలు చేసిన ఉల్లిని వ్యాపారులు 45 కేజీల బస్తాను గరిష్టంగా రూ. 1800 లకు విక్రయించగా, కనిష్టంగా రూ. 1600 నుంచి వరకు ప్యాకెట్‌గా విక్రయించారు. చిరు వ్యాపారులు ఉల్లిని బస్తాలుగా కొనుగోలు చేసి బుధవారం జరిగిన దేవరకద్ర సంతలో చిల్లరగా కిలో రూ. 40 నుంచి రూ. 35 వరకు విక్రయించారు. -
ఉల్లి అ‘ధర’హో
సాక్షి, కర్నూలు: ఉల్లి ధరలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో రైతుల్లో సంతోషం కన్పిస్తోంది. మూడేళ్ల తర్వాత మళ్లీ మంచి రోజులు వస్తున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటాల్ ఉల్లి గరిష్ట ధర రూ.3,310 ఉండగా.. బుధవారం ఒక్కసారిగా రూ.4 వేలకు చేరింది. ఒక్క రోజులోనే రూ.690 పెరగడం విశేషం. అత్యధిక లాట్లకు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు ధర లభించింది. మూడేళ్లుగా ఉల్లి ధరలు పడిపోవడం వల్ల రైతులు భారీగా నష్టపోయారు. గత ఏడాది క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.600 వరకు మాత్రమే లభించింది. ప్రస్తుతం ధరలు పెరుగుతుండడంతో గత ఏడాది వరకు మూటకట్టుకున్న నష్టాల నుంచి రైతులు బయటపడుతున్నారు. మహారాష్ట్రలో అతివృష్టి కారణంగా ఉల్లి పంట పూర్తిగా దెబ్బతినడంతో కర్నూలు జిల్లాలో పండించిన పంటకు డిమాండ్ వచ్చింది. రాష్ట్రంలో ఉల్లి అత్యధికంగా పండేది మన జిల్లాలోనే. మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడంతో వ్యాపారుల దృష్టి కర్నూలు మార్కెట్‌పై పడింది. వ్యాపారులు భారీగా పోటీ పడుతుండడంతో ధరలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం క్వింటాల్ రూ.4 వేలకు చేరగా.. ఈ ధర మరింత పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ధరలు పెరుగుతుండడంతో మార్కెట్‌కు ఉల్లిగడ్డలు కూడా పోటెత్తుతున్నాయి. మార్కెట్‌యార్డులో కనీసం 20 వేల క్వింటాళ్ల నిల్వలు ఉన్నాయి. జిల్లాలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 21,145 హెక్టార్లు ఉండగా.. ఈ ఖరీఫ్‌లో 13,235 హెక్టార్లలో సాగైంది. ధరలు పెరుగుతుండడంతో ఇప్పుడు కూడా రైతులు పోటీపడి సాగు చేస్తున్నారు. దీంతో ఉల్లి విత్తనాల ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. పెరుగుతున్న ధరలు ఊరటనిస్తున్నాయి గత ఏడాది వరకు ఉల్లి సాగు చేసి నష్టాలు మూట కట్టుకున్నాం. ఇప్పుడు ధరలు పెరుగుతుండడంతో నష్టాల నుంచి బయటపడుతున్నాం. మేము కర్నూలు మార్కెట్‌కు 40క్వింటాళ్లకు పైగా ఉల్లి తెచ్చాం. క్వింటాల్‌కు రూ.3,360 చొప్పున ధర లభించింది. ఈ ధర సంతృప్తినిచ్చింది. – నడిపిరంగడు, బస్తిపాడు, కల్లూరు మండలం -
ఉల్లి.. రైతు భీతిల్లి..!
దేవరకద్ర: ఉల్లి రైతుకు ఈ ఏడాది కన్నీరే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది.. దేవరకద్ర మార్కెట్లో ప్రతీ వారం జరిగే వేలంలో ధర పడిపోతుండడం వారి ఆవేదనకు కారణమవుతోంది. ఎన్నో ఆశలతో.. అప్పులు చేసి మరీ ఉల్లి సాగు చేస్తే ఆశించిన రీతిలో ధర దక్కకపోవడంతో చేసేదేం లేక అయిన కాడికి అమ్ముకుని నిరాశగా ఇంటి ముఖం పడుతున్నారు. అయితే, ఈ బుధవారం మార్కెట్‌కు వేలాదిగా బస్తాల ఉల్లిని అమ్మకానికి తీసుకురాగా ఇదే పరిస్థితి ఎదురైంది. గత కొన్ని వారాలుగా ధరలు అటూఇటు మారుతుండడమే తప్ప పెద్దగా పెరగకపోవడం గమనార్హం. ఐదు వేల బస్తాలు దేవరకద్ర మార్కెట్‌కు బుధవారం ఉల్లి పోటెత్తింది. దేవరకద్ర మండలంతో పాటు మరికల్, ధన్వాడ, నారాయణపేట, మక్తల్, చిన్నచింతకుంట, కోయిలకొండ మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఉల్లిని అమ్మకానికి తీసుకొచ్చారు. దాదాపు 5 వేల బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో మార్కెట్ ఆవరణలో ఎక్కడా చూసినా ఉల్లిగడ్డలే కనిపించాయి. ఇంత పెద్దమొత్తంలో ఉల్లిని వ్యాపారులు సైతం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు రైతులు వేలం వేయకుండానే నేరుగా బస్తాలకు నింపి వినియోగదారులకు విక్రయించారు. వారానికోసారి... మార్కెట్లో ప్రతీ బుధవారం జరిగే వేలంలో రైతులు తీసుకొచ్చిన ఉల్లికి వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా ధరలు నిర్ణయిస్తారు. ఏడాది పొడువున ప్రతీ వారం సాగే ఉల్లి వేలంలో స్థానిక వ్యాపారులతో పాటు వివిధ ప్రాంతాల వ్యాపారులు పాల్గొంటారు. ఈ బుధవారం బుధవారం జరిగిన వేలంలో క్వింటా ఉల్లికి గరిష్టంగా రూ.700, కనిష్టంగా రూ.350 వరకే ధరలు పలికాయి. నాలుగు వారాలుగా పరిశీలిస్తే ధరలు అటు ఇటుగా ఉన్నాయే తప్ప పెరగడం లేదు. ఈ వారం మరింత తగ్గడంతో రైతులు వచ్చిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆటుపోట్లు గత 12 నెలలుగా ఉల్లి ధరలు అటుపోట్లకు గురవుతున్నాయి. ప్రస్తుతం ధరలు మరింత పడిపోవడం తో తమకు కన్నీళ్లే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు తగిన ధర రాక పోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉల్లి ధరలు పెరగకపోతాయా అని వారం వారం ఎదురుచూసే రైతులు నిరాశే ఎదురవుతుండడం గమనార్హం. గత ఏడాది ఆగస్టు సీజన్ కింద పండించిన ఉల్లికి ధరలు అంతంత మాత్రంగా వచ్చాయి. ప్రస్తుత సీజన్ కింద పండిన ఉల్లి గత రెండు నెలలుగా మార్కెట్‌కు తెస్తున్నారు. ధరలు మాత్రం అటు ఇటుగా రూ. వేయి దాటడం లేదు. వేసవి సమీపిస్తున్న తరు ణంలో మార్కెట్‌కు ఉల్లి పోటెత్తుతోంది. మరో నా లుగు నెలల పాటు సీజన్ కొనసాగనుండగా ఇప్పు డు తగిన ధరలు రాక పోవడంతో రైతులు కృంగిపోతున్నారు. ఎంతో శ్రమకోర్చి పండించిన ఉల్లిని మార్కెట్‌కు తీసుకువస్తే పెట్టిన పెట్టుబడి కాదు కదా.. కనీసం కూలీల ఖర్చు, మార్కెట్‌కు తీసుకొచ్చిన వాహనం కిరాయి కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల క్రితం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉల్లి కొనుగోళ్లు చేపట్టారు.ఇప్పుడు వస్తున్న ధరలు చూస్తే మళ్లీ ప్రభుత్వం రంగంలోకి దిగితే తప్ప రైతులకు న్యాయం జరగదని చెబుతున్నారు. దిగుమతులు పెరగడమే కారణం గత ఏడాది జనవరి ప్రారంభం వరకు మహారాష్ట్ర, కర్ణాటకలో ఉల్లి దిగుమతులు తగ్గడంతో మంచి ధరలు పలికాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు పెరగడం ధరల తగ్గుదలకు కారణమని చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గడంతో ఇక్కడ కూడా పడిపోతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఉల్లి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మళ్లీ ఫిబ్రవరి వచ్చినా ధరలో మార్పు లేకపోగా మరింత మరింత తగ్గుతుండడం గమనార్హం. సొంతంగా అమ్ముకుంటున్నా... దేవరకద్రలో జరిగే ఉల్లి వేలంలో మంచి ధర పలుకుతుందని ఎంతో శ్రమకోర్చి తీసుకొచ్చా. కానీ ధరలు చూసి ఏం చేయాలో పాలుపోక ఉల్లిని బస్తాలకు నింపి రూ.400కు బస్తా చొప్పున విక్రయించా. సరుకు ఎక్కువగా రావడంతో వేలానికి కూడా వ్యాపారులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతులను ఆదుకోవాలి. – రాంరెడ్డి, ఉల్లి రైతు, లక్ష్మీపురం క్వింటాల్‌కు రూ.470 వచ్చింది ఉల్లిని పండించిన కష్టం రాకున్నా.. కనీసం కూలీల ఖర్చులు, రవాణా చార్జీలైనా వస్తాయని భావించా. అలాగే కానీ ఇక్కడ క్వింటా ఉల్లికి రూ.470 ధర పలికింది. దీంతో రవాణా చార్జీలు, కూలీల ఖర్చులు కూడా నేనే భరించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇలా అయితే మా కుటుంబం బతకడం ఎలా? అప్పులు తీర్చడం ఎలా అనేది తెలియడం లేదు. – జంగ్యానాయక్, ఉల్లి రైతు -
ఉల్లి మెల్లగా జారింది..!
గడచిన నాలుగు నెలలుగా కొండెక్కిన ఎర్రగడ్డ ఎట్టకేలకు కొండ దిగింది. సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. కిలో రూ.20 లోపు పలుకుతోంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి దిగుమతి పెరగడంతో ధరలు తగ్గి నట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో బాగా తగ్గి న కూరగాయల ధరలు మళ్లీ కాస్త పెరగడం గమనార్హం. తిరుపతి తుడా: ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎర్రగడ్డల సమస్య ఉత్పన్నమవుతుంది. 2016 చివర, 2017 జనవరిలో కిలో ఎర్రగడ్డల ధర రూ.100లు దాటింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి (2017 నవంబర్, డిసెంబర్, 2018 జనవరి) రూ.60లకే ఎర్రగడ్డలు లభించినా.. గడ్డల్లో నాణ్యత లోపించింది. పంటపై ప్రభావం అధికంగా ఉండటంతో ఈసారి ఫిబ్రవరి నెల వరకు ఎర్రగడ్డల ధర అధికంగానే ఉంది. ఎట్టకేలకు మన రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి ఉల్లిపాయల దిగుమతులు పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. కూరగాయల ధరలూ భారీగానే తగ్గినా, ఇటీవల కాస్త పైకెక్కి కూర్చున్నాయి. ఇందులో టమాట, బీట్రూట్, ఆకుకూర, వంకాయ, బీన్స్ ధరలు తక్కువగా ఉన్నాయి. ధరలు కొండెక్కడానికి ఇదీ కారణం.. నిరుడు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో ముసురు పట్టుకుంది. ఫలితంగా మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో, మహారాష్ట్రలోనూ ఎర్రగడ్డ పంటలు బాగా దెబ్బతిన్నాయి. పంట దిగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎర్రగడ్డల ధరలు అమాంతం పెరిగాయి. కర్నూలు జిల్లాలో రబీలో సీజన్లో సాధారణంగా 20,764 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 13వేల హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేశారు. భారీ వర్షాలతో సుమారు 4 వేల హెక్టార్లలో పంట దిబ్బతింది. మహారాష్ట్రలో 38వేల హెక్టార్లకు గాను 27వేల హెక్టార్లలో మాత్రమే పంట వేశారు. ఇక్కడా సుమారు 10 వేల హెక్టార్లలో వర్షం కారణంగా పంట నాశనమైంది. దిగుబడులు తగ్గడంతో రైతుల వద్దే రూ.30 ధర పలికింది. మహారాష్ట్రలో రైతుల వద్దే రూ.35 పలకడం, ఇవి జిల్లాకు చేరి విక్రయానికి వచ్చేసరికి రూ.50, 60లు అయిందని దుకాణదారులు చెబుతున్నారు. కొత్త పంటతో దిగిన ధరలు.. నీటివనరులు పుష్కలంగా ఉండటంతో మహారాష్ట్రతో పాటు ఏపీలోని కర్నూలు, అనంతపురం, కడప జిలాల్లోనూ ఎర్రగడ్డల సాగు ఆశాజనకంగా సాగుతోంది. ఇప్పటికే కర్నూలు గడ్డలతోపాటు మహారాష్ట్ర గడ్డల దిగుమతులు పెరుగుతున్నాయి. రాబోవు రోజుల్లో మరింతగా పంట దిగుమతులు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దిగుమతులు పెరుగుతుండటంతో ఉల్లిపాయల ధరలు కిందికి జారుతున్నాయి. మార్కెట్లో కిలో ఎర్రగడ్డలు రూ.18– 20లు పలుకుతోంది. రైతుబజార్లో రూ.16లకే విక్రయిస్తున్నారు. పడిపోయిన టమాట.. గతేడాదితో పోలిస్తే అన్ని రకాల కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో సకాలంలో వర్షాలు పడటంతో పడమటి మండలాల్లో చెరువులు నిండుకుండల్లా మారాయి. బావుల్లోనూ పుష్కలంగా నీరు ఉండటంతో పడమటి మండలాల్లో కూరగాయల పంటల సాగు జోరందుకుంది. దీంతో టమాట ధరలు పూర్తి స్థాయిలో పడిపోయాయి. తిరుపతి మార్కెట్లో కిలో రూ.4– 5లకే దొరుకుతోంది. భారీగా తగ్గి.. కాస్త పెరిగిన కూరగాయలు.. జనవరి నెల్లో కిలో టమాట రూ.60, బీన్స్ రూ.70, బీట్రూట్ రూ.90, చిక్కుడు రూ.50, మునగ రూ.100.. ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు రూ.50 పైమాటే. ప్రస్తుతం అన్ని రకాలు కూరగాయలు ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే టమాట మినహా, అన్ని కూరకాయల ధరలు ఫిబ్రవరి నెలతో పోలిస్తే కాస్త పెరిగాయి. -
తగ్గని ఉల్లి ధరలు
-
తగ్గని ఉల్లి ధరలు
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్ లో ఉల్లి ధరలు మరింత పుంజుకున్నా యి. వ్యాపారం కూడా జోరందుకుంది. బుధవారం జరిగిన ఉల్లిపాయల బ హిరంగ వేలంలో వచ్చిన ధరలు గత వా రం కన్నా మరింత పెరిగాయి. గరిష్టంగా రూ.3,400 పలుకగా కనిష్టంగా రూ. 3,100 వరకు ధరలు వచ్చాయి. రెండేళ్ల క్రితం ఉల్లి ధరలు ఏకంగా రూ.వందకు పడిపోగా.. గతేడాది రూ.1100 వరకు చే రుకుంది. ఈసారి సీజన్ ప్రారంభం నుం చి ఉల్లి ధరలు పెరగడం తప్ప తగ్గడం లే దు. కొత్త ఉల్లి వచ్చిన తర్వాత వారం వా రం ధరలలో పెరుగుదల కనిపిస్తుంది. గత నెలలో జరిగిన వేలంలో ఒక దశలో రూ.4,400 వరకు ఉల్లి ధరలు చేరుకున్నాయి. ఇటీవల కొత్త ఉల్లి దిగుమతులు రావడంతో కొంత వరకు తగ్గినా మంచి ధరలే వస్తున్నాయి. పెరిగిన కొనుగోళ్లు.. దేవరకద్ర మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు బాగా పెరిగాయి. ఒక వ్యాపారులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తూ చిరు వ్యాపారులకు బస్తాల లెక్కన అమ్ముకుంటున్నా రు. మార్కెట్‌కు వచ్చిన ఉల్లి నాణ్యంగా ఉండడంతో చాలామంది ఎగబడి కొనుగోలు చేశారు. వివిధ గ్రామాల నుంచి వ చ్చిన ప్రజలు శుభకార్యాలకు, ఇంటి అవసరాలకు ఉల్లిపాయలను బస్తాల లెక్కన కొనుగోలు చేశారు. ఇక చిరు వ్యాపారులు కూడా బస్తాల లెక్కన కొనడంతో మార్కెట్ అంతా సందడిగా కనిపించింది. 45 కిలోల ఉల్లి బస్తా రూ. 1,800 నుంచి రూ.1,600 వరకు విక్రయాలు సాగాయి. చిల్లరగా కిలో రూ.35 నుంచి రూ.40 వరకు విక్రయించారు. కందుల కొనుగోలు మార్కెట్లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో గురువారం వరకు 19,500 క్వింటాళ్లు కందులను కొనుగోలు చేశారు. గత నెల 20వ తేదీ నుంచి ఇక్కడ కొనుగోలు కేంద్రం ప్రార ంభించారు. హాకా దేవరకద్ర ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నారు. రైతుల కు మద్దతు ధర రూ.5,450లకు క్వింటాల్‌గా కందులను కొనుగోలు చేయడం వ ల్ల రైతులు పెద్ద ఎత్తున అమ్మకానికి తెస్తున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన కందులకు దాదాపు రూ.10.62 కోట్లు రై తులకు చెల్లించాల్సి ఉంది. కొందరికి నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఉల్లి ఎగుమతులకు చెక్
సాక్షి,న్యూఢిల్లీ: రోజురోజుకూ భారమవుతున్న ఉల్లి ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఉల్లి ఎగుమతులను నియంత్రించాలని నిర్ణయించింది. ఉల్లి ఎగుమతులకు టన్నుకు రూ 800 డాలర్ల కనిష్ట ఎగుమతి ధరను (ఎంఈపీ) నిర్ణయించేందుకు కసరత్తు చేస్తోంది. ఎంఈపీ కన్నా తక్కువ ధరకు ఎగుమతులను అనుమతించరు. 2015లో ఉల్లికి ఎంఈపీని తొలగించిన విషయం తెలిసిందే. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉల్లి ధరల నియంత్రణ, ఎంఈపీపై వినియోగదారుల మంత్రిత్వ శాఖ అధికారులు, పరిశ్రమ వర్గాలతో విస్తృతంగా చర్చించింది. ఉల్లి ఎగుమతులను నియంత్రించేందుకు, స్ధానిక మార్కెట్లలో ఉల్లి ధరలకు చెక్ పెట్టేందుకు ఎంఈపీ విధించాలని ఈ భేటీలో నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. ఈ దిశగా త్వరలోనే తుది నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు. -
కొనేది 6... అమ్మేది 36
రైతుకు దక్కని మార్కెట్ ధర బహిరంగ మార్కెట్లో తగ్గని ధర కర్నూలులోనే భారీ తేడా కోల్‌కతాకు నిలిచిపోయిన ఎగుమతులు మార్కెట్లో పడిగాపులు కాస్తున్న రైతులు కర్నూలు: నిన్న మొన్నటిదాకా చుక్కలనంటిన ఉల్లి ధర ఒక్కసారిగా పడిపోయింది. అయితే రైతు నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు బహిరంగ మార్కెట్లో మాత్రం ఎప్పటి మాదిరిగానే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇటు రైతులు, అటు వినియోగదారులు నష్టపోతుండగా దళారులు, వ్యాపారులు మాత్రం భారీగా లాభాలు పొందుతున్నారు. కర్నూలు మార్కెట్‌కు రైతు తెచ్చిన ఉల్లిని కొనేవారే కనిపించడంలేదు. కనా కష్టంగా కిలో ఆరు రూపాయలకు కొని, పక్కనే ఉన్న బహిరంగ మార్కెట్లో రూ. 36 కు అమ్ముతున్నారు. మహారాష్ట్రలో ఉల్లి పంట భారీగా రావడం, కర్ణాటక రాష్ట్రంలోనూ దిగుబడులు పెరగడం, రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఉల్లి సాగు పెరిగి దిగుబడులు మార్కెట్లోకి భారీగా వస్తున్నాయి. దాంతో రైతు నుంచి కొనుగోళ్లు మందగించాయి. ధర క్రమంగా పడిపోతోంది. కర్నూలు జిల్లాలో పండిన ఉల్లి 80 శాతం వరకు కోల్‌కతా... అక్కడి నుండి బంగ్లాదేశ్‌కు ఎగుమతి అవుతుంది. దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని కోల్‌కతాలో మార్కెట్ బంద్ కావడం.. బంగ్లాదేశ్‌కు ఎగుమతులు నిలిచిపోవడం కూడా ధర తగ్గేందుకు కారణమైంది. ప్రస్తుతం రైతులు మార్కెట్లో ఉల్లిని అమ్ముకునేందుకు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. సోమవారం మార్కెట్‌కు వచ్చిన ఉల్లి దిగుబడులను శుక్రవారం వరకు కొనలేదంటే కొనుగోళ్లు ఏ స్థాయిలో నడుస్తుందో తెలుస్తోంది. గత నెలలో క్వింటా ఉల్లి ధర రూ. 5,800 వరకు చేరుకుంది. ప్రస్తుతం ఉల్లి ధర క్వింటా గరిష్టంగా కేవలం రూ. 1,600 మాత్రమే. 80 శాతం రైతులకు రూ. 600 నుండి రూ. 900 ధర మాత్రమే లభిస్తోంది. అంటే కిలో రూ. 6 నుంచి రూ. 9. కర్నూలులో ఒక రేటు.. హైదరాబాద్‌లో మరో రేటు డోన్‌కు చెందిన బాలు అనే రైతు మంగళవారం కర్నూలు మార్కెట్‌కు లారీ ఉల్లి తీసుకొచ్చాడు. వేలం పాటలో క్వింటాకు రూ. 1,200 మాత్రమే లభించింది. ఈ ధరకు అమ్ముకోవడం ఇష్టం లేక హైదరాబాద్‌కు తరలించాడు. అక్కడ క్వింటా రూ. 2,100 ప్రకారం అమ్మడయింది. కర్నూలు మార్కెట్లో ధరలు ఏ స్థాయిలో పతనం అవుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. బహిరంగ మార్కెట్లో తగ్గని ధర ఆరుగాలం కష్టించి పండించిన ఉల్లి ధర తగ్గడంతో రైతులు నష్టపోతుండగా, వినియోగదారులు మాత్రం ఇంకా ఎక్కువ ధరకే కొనుగోలు చేయాల్సి వస్తోంది. రైతుకు, వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న ధర వ్యాపారులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. కర్నూలు మార్కెట్లో రైతులనుంచి సారాసరి కిలో రూ. 12 లకు కొనుగోలు చేస్తుండగా అదే కర్నూలులో బహిరంగ మార్కెట్లో వినియోగదారుడు రూ. 36 లకు కొనాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో రూ. 40, విజయవాడలో రూ. 35, విశాఖలో రూ. 38, తిరుపతిలో రూ. 35 లకు అమ్ముతున్నారు. వ్యాపారుల మాయాజాలంతో అటు రైతులు, ఇటు సాధారణ జనం నష్టపోతున్నారు. 13వ తేదీ వచ్చినా ఉల్లిని కొనలేదు గోనెగండ్ల మండలం వేముగోడులో ముక్కాలు ఎకరా భూమిలో ఉల్లి సాగు చేశా. 85 ప్యాకెట్ల (ఒక్కో ప్యాకెట్ 45 కిలోలు) పంట వచ్చింది. కర్నూలు వ్యవసాయమార్కెట్‌లో అమ్ముకునేందుకు ఈనెల 13న వచ్చినా. ఇంతవరకు వేలం పాటకే రాలేదు. రోజు ఖర్చులు ఒక్కొక్కరికి రూ. 300 అవుతాంది. ఎప్పటికి కొంటారో తెలియదు. - ఎల్లయ్య పెట్టుబడిలో 50 శాతం కూడా రాలేదు మాది కోడుమూరు మండలంలోని ఎర్రదొడ్డి గ్రామం. ఎకరా భూమిలో ఉల్లి సాగు చేసినా రూ. 90 ప్యాకెట్ల పంట రాగా మంగళవారం మార్కెట్లో విక్రయానికి తీసుకొచ్చినా ధర పడిపోవడంతో దిక్కుతోచడం లేదు. పెట్టుబడి రూ. 35 వేలు పెట్టినా. ప్రస్తుత ధరతో పెట్టుబడిలో సంగం కూడా చేతికొచ్చేలా లేదు. - రాముడు -
'ఉల్లికి కనీస మద్దతు ధర నిర్ణయిస్తాం'
కర్నూలు : ఉల్లికి కనీస మద్దతు ధర ప్రకటించే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావులతో చర్చిస్తానని వెల్లడించారు. మంగళవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోళ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉల్లి ధరలు పడిపోయినా రైతులకు నష్టం లేకండా ఉండేందుకు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తామన్నారు. మార్కెట్లో ఆ ధర కంటే తగ్గినపుడు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వివరించారు. కిలో ఉల్లి రూ.20 ప్రకారం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌యార్డులో 400ల టన్నులు కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు 6,166 టన్నులు కొనుగోలు చేసి జానాభా ప్రకారం అన్ని జిల్లాలకు సరఫరా చేయనున్నామని చెప్పారు. -
కేజీ ఉల్లి రూ.20 కే అందిస్తాం: టీ సర్కార్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతున్నవేళ తెలంగాణ ప్రభుత్వం చల్లని కబురు చెప్పింది. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఒక కేజీ ఉల్లిగడ్డలను రూ. 20 కే అందించనున్నట్లు ప్రకటిచంది. ఉల్లి ధరల పెరుగుదలపై శుక్రవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బహిరంగ మార్గెట్ లో ఉల్లిగడ్డ ధర ఒక కిలోకు రూ. 40 గా ఉంది. కొన్ని చోట్ల ఇంతకు మించి కూడా ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం మొత్తం 80 ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు వెలువడ్డాయి. హైదరాబాద్ లో 40 కేద్రాలు, మిగతా జిల్లాల్లో మరో 40 ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఏపీలోని కర్నూలు, మహారాష్ట్రలోని నాసిక్ ల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
రైతన్న ‘ఉల్లి’కిపాటు
ఉల్లి..ఆ పేరు వింటేనే రైతన్నలు ఉలిక్కిపడుతున్నారు. కష్టనష్టాలకోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. సీజన్ ప్రారంభంలో క్వింటాలుకు రూ.4వేలు పలికిన ఉల్లి రెండువారాలుగా రూ.250కు పడిపోయింది. దీంతో మార్కెట్లో అన్నదాతలకు దిక్కుతోచనిస్థితి ఎదురవుతోంది. దేవరకద్ర, న్యూస్‌లైన్ : ఉల్లి ధరలు ఒక్కసారిగా మళ్లీ పడి పోయాయి. దాంతో రైతన్న దిక్కు తోచని పరిస్థితిలో పడిపోయాడు. గ డిచిన రెండు వారాలుగా ఓ మోస్తరుగా పె రిగిన ఉల్లి ధరలను చూసిన రైతాంగం బుధవారం దేవరకద్ర మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున ఉల్లిపాయలు తీసుకువచ్చారు. పా త యార్డు, కొత్త యార్డు ఆవరణ అంతా ఉ ల్లి కుప్పలతో నిండిపోయింది. తగిన స్థలం లేక షెడ్ల పక్కన, గోదాముల పక్కన రో డ్లపై కుప్పలుగా పోశారు. దాదాపు 10 వేల బస్తాల ఉల్లి పాయలు రావడంతో మార్కెట్ యార్డు అవరణ అంతా ఉల్లిపాయల కుప్పలతో ముంచెత్తాయి. ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్‌కు ఉల్లి పాయలు రావడం ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు. ధరలు పెరుగుతున్నాయని భావించిన రైతాంగానికి వేలం పాటలు ప్రారంభమైన తరువాత ఒక్కసారిగా నిరాశలో కురుకు పోయారు. గత రెండు వారాలుగా పెరుగుతూ వచ్చిన ధరలు సగానికి సగం పడి పోవడంతో చాల మంది రైతలు ట్రాక్టర్ల నుంచి కింద పోయకుండానే వాపసు తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున వచ్చిన ఉల్లిపాయలను కొనడానికి వ్యాపారులు ఆసక్తిని చూపక పోవడంతో కొందరు రైతులు తెచ్చిన ఉల్లిపాయలకు వేలం వేసే వారు కూడా కరువయ్యారు. సగం తగ్గిన ధరలు.. గత వారం కనిష్టంగా రూ. 600 ఉండగా, ప్రస్తుతం రూ. 250కు పడిపోయింది. గత వారం వచ్చిన ధరల కన్నా దాదాపు రూ. 350 వరకు ధరలు తగ్గిపోయాయి. గరిష్టంగా గత వారం రూ. 780 ఉండగా ఈ వారం రూ. 570లకు పడిపోయింది. ఇలా ఒక్కసారిగా ధరలు పడి పోవడానికి కారణం ఉల్లి ఎక్కువగా అమ్మకానికి రావడం వల్లనే అని తెలుస్తుంది. నాలుగు నెలల క్రితం సీజన్ ప్రారంభంలో రూ. 4 వేలకు క్వింటాల్ పలికిన ఉల్లి ధరలు ప్రతి వారం తగ్గు ముఖం పడుతూ వచ్చి చివరకు రూ. 250 పడిపోయింది. ధరలు రాక వాపసు తీసుకెళ్లిన రైతులు.. ఉల్లికి తగిన ధరలు రాక పోవడంతో కొందరు రైతులు వాపసు తీసుకెళ్లారు. మరి కొందరు తెచ్చిన ట్రాకర్ల నుంచి ఉల్లిని కింద పోయకుండానే తీసుకెళ్లి పోయారు. మరి కొందరు రైతులు వ్యాపారులను ప్రాధేయ పడుతూ ఏదో ధరకు తీసకోవాలని వేడుకున్నారు. మార్కెట్లో రైతుల పరిస్థితి చూస్తే దయనీయంగా తయారయింది. ఉల్లిని అడిగేవారు లేరు మార్కెట్‌కు ఉల్లిని తీసుకు వస్తే అడిగేవారు కరువయ్యారు. ధరలు చూస్తే కన్నీరు పెట్టిస్తున్నది. కనీసం ఉల్లిని తెంచడనికి మార్కెట్‌కు తీసుకురావడానికి అయిన ఖర్చులు కూడ రాని పరిస్థితి ఉంది. - బుచ్చారెడ్డి, ఉల్లి రైతు, డోకూర్ దిక్కు తోచడంలేదు.. తెచ్చిన ఉల్లి కొనేవారు కరువయ్యారు. ధరలు పెరుగుతున్నాయని మార్కెట్‌కు తెస్తే ఇలా కావడంతో దిక్కు తోచడంలేదు. తెచ్చిన ఉల్లిని మళ్లీ తీసుకెళ్లడానికి కూడా ఖర్చులు రావు. ఏదో ధరకు అమ్ముకోక తప్పదు. -రాములు, ఉల్లిరైతు, గోపన్‌పల్లి ధరలు చూస్తే కన్నీరొస్తుంది.. తె చ్చిన ఉల్లికి తక్కువ ధర వచ్చింది. గత వారం రూ. 600 వరకు వచ్చిన ఉల్లికి ఈ వారం రూ. 360 వచ్చింది. ఇలా ధరలు తగ్గడం రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. అధికారులు ఉల్లి రైతులను ఆదుకోవాలి. -రాము, ఉల్లిరైతు, మోదీపూర్ ఎవరిని అడుక్కోవాలి.. ధరలు రాలే దు. కనీసం తెచ్చిన ఉల్లిని కొనేవారు క రువయ్యారు. రైతు ల గురించి ఎవరికీ పట్టడంలేదు. ఉల్లిని కొనమని ఎవరిని అ డుక్కోవాలో తెలియడంలేదు. కనీసం పెట్టిన ఖర్చులు వస్తే చాలు. -రాకంకొండ, ఉల్లిరైతు, గూరకొండ -
ఉల్లి.. దిగివస్తోంది మళ్లీ
సామాన్యుల కంట కొంత కాలం కన్నీరు పెట్టించిన ఉల్లి ధర దిగివస్తోంది. తెల్ల ఉల్లి ధర కిలోకు రూ. 25కు తగ్గింది. ఎర్ర ఉల్లి ధర రూ. 20 పలుకుతోంది. మహారాష్ట్ర ప్రాంతంనుంచి భారీగా ఉల్లి పంట దిగుమతి అవుతుండడంతో ధర తగ్గుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. వేసవిలో ఉల్లి ధర భారీగా పెరిగింది. కిలో ఉల్లి ధర రూ. 80కి పైగా పలికింది. తర్వాత కొంత దిగివచ్చినా రూ. 50 కి తగ్గలేదు. వారం రోజులుగా మహారాష్ట్రలోని అకోలా, ఉమ్రీ, నాందేడ్ తదితర ప్రాంతాలనుంచి ఎర్ర ఉల్లిగడ్డలు, ఆంధ్ర ప్రాంతం నుంచి తెల్ల ఉల్లిగడ్డలు భారీగా దిగుమతి అవుతున్నాయి. దీంతో రెండు రోజులుగా ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం తెల్ల ఉల్లిగడ్డలు కిలోకు రూ. 25, ఎర్ర ఉల్లిగడ్డలు రూ. 20కి లభిస్తున్నాయి. ఉల్లి సీజన్ ప్రారంభమైందని, ఇక ధర తగ్గుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. -
మళ్లీ ఉల్లి బాంబ్!
-
మళ్లీ ఉల్లి బాంబ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉల్లి ధరలు పెరగటానికి దిగుబడి తగ్గటం... ఎగుమతులు పెరగటం... అక్రమ నిల్వలుంచటం వంటివి అసలు కారణాలు కాదు. రైతు నుంచి సరుకును వినియోగదారుకు చేర్చడానికి మధ్య ఉన్న దళారీ వ్యవస్థే అసలు కారణం. ఇరువురి మధ్యా వారధిలా ఉండాల్సిన వ్యవస్థ... ఇరువురినీ శాసించే స్థాయికి చేరటమే అసలు సమస్య. ఉల్లి ధర పెరుగుదలకు దిగుబడి తగ్గటమే కారణమా? అబద్ధం. ఎందుకంటే ఈ ఏడాది దేశవ్యాప్తంగా అంచనా వేసిన పంట దిగుబడి 16.5 మిలియన్ టన్నులు. దిగుబడి కూడా అంచనాకు తగ్గట్టే 16 నుంచి 17 మిలియన్ టన్నుల మధ్య వస్తోంది. అంటే దిగుబడి తగ్గిందన్న ప్రసక్తే లేదు. ఒకవేళ నాలుగైదు శాతం దిగుబడి తగ్గినా దానికి ధరల్ని 300 నుంచి 400 శాతం పెంచేంత శక్తి ఉందనుకోలేం. ఇక ఎగుమతులు పెరగటం వల్లేనన్న వాదనను తీసుకుంటే... అది కూడా అబద్ధమని తేలుతుంది. ఎందుకంటే ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య మన దేశం నుంచి ఎగుమతయిన మొత్తం ఉల్లి 7 లక్షల టన్నులు. గతేడాది ఈ కాలంలో జరిగిన ఎగుమతి 8.5 లక్షల టన్నులు. మరి అప్పటికన్నా తక్కువ ఎగుమతి జరిగినపుడు అప్పటికన్నా రేటు ఇంతలా ఎలా పెరిగింది? పెపైచ్చు జూలైలో 1.5 లక్షల టన్నులు ఎగుమతి కాగా... ధరలు ఆకాశానికెగసిన ఆగస్టులో జరిగిన ఎగుమతులు కేవలం 30 వేల టన్నులు. అయినా దేశీయంగా ఇంత ధరొస్తున్నపుడు ఎవరైనా ఎగుమతులెందుకు చేస్తారు చెప్పండి!! పోనీ ఈ రెండూకాక అక్రమ నిల్వల వల్లే ధరలు ఈ స్థాయికి చేరాయన్న వాదనను పరిశీలించినా... అదీ అబద్ధమని తేలిపోతుంది. ఎందుకంటే ఉల్లి సీజనల్ ఉత్పత్తి. దాన్ని అన్‌సీజన్‌లో నిల్వ ఉంచక తప్పదు. అలా నిల్వ ఉంచడానికి ప్రభుత్వ ఏజెన్సీలే సహకరిస్తుంటాయి. పెపైచ్చు మార్కెట్లో ధర ఈ స్థాయికి చేరినపుడు ఏ వ్యాపారైనా బయట విక్రయిస్తాడు తప్ప దాచుకోడు. ఇవన్నీ చూశాక... రైతుల వాదన విన్నాక అనిపించేదొక్కటే. రైతులకు, వినియోగదారులకు మధ్య ఏర్పాటయిన బలమైన దళారీ వ్యవస్థకే అధిక డబ్బులు పోతున్నాయని. అది రైతుల మాటల్లోనే విందాం... ధర 80 దాటినా రైతుకు దక్కింది రూ. 22!! ఆగస్టులో రాష్ట్రంలో ఉల్లి ధర కిలో రూ.80 దాటేసింది. అప్పుడు కర్నూలులో ఉల్లి పండించిన రైతుకు... అత్యుత్తమ రకానికి కిలోకు రూ.25 దక్కింది. మామూలు రకాలకైతే కిలోకు రూ.20 నుంచి 22 వరకూ దక్కింది. దీనిపై కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన రైతు అయ్యప్పతో మాట్లాడితే ‘‘మార్కెట్లో ధర ఎంతున్నా మాకొచ్చేది తక్కువే. ఒకోసారి మార్కెట్లో ఎంత ధర ఉందో కూడా మాకు తెలియదు. తెలిసే అవకాశం కూడా ఉండదు. ఇప్పటికీ మాకు ఉల్లి పంట గిట్టడమే లేదు. ఎందుకంటే ఎకరాకు రూ.40 వేల వరకూ ఖర్చవుతోంది. దిగుబడి తగ్గి 70 క్వింటాళ్లకు మించటం లేదు. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావటమే లేదు. కిలోకు రూ.15 మించితేనే మాకు గిడుతుంది’’ అనే సమాధానం వచ్చింది. రాష్ట్రంలో మళ్లీ ఉల్లి ధరలు ఘాటెక్కుతున్నాయి. కిలో రూ.60 దాటేస్తోంది. ఏ కారణం వల్లో కానీ ఇపుడు కర్నూలు రైతుకు దాదాపు సగం ధర వస్తోంది. దీనిపై అదే జిల్లా సి.బెల్గల్ గ్రామానికి చెందిన రైతు మద్దిలేటి మాట్లాడుతూ ‘‘మాకు నాణ్యమైన పంట వచ్చింది. పంట తక్కువగా ఉండటం వల్లో ఏమో కానీ ఇపుడు మాకు క్వింటాలుకు రూ. 3200 వరకూ వస్తోంది. (కిలోకు రూ.32) అయితే దళారుల చేతికి క్వింటాలుకు రూ.500 వరకూ పోతోంది. అలా పోకుండా ఉంటే మాకు మంచి లాభసాటిగా ఉండేది’’ అని చెప్పాడు. రాష్ట్రంలో అతిపెద్ద ఉల్లిమార్కెట్ అయిన తాడేపల్లిగూడెంలో ప్రస్తుతం రైతుకు ఒక్కో కేజీకి రూ.32 చొప్పున లభిస్తుండగా.. వ్యాపారులు హోల్‌సేల్‌గా రూ.55-60కి విక్రయిస్తుండటం గమనార్హం. మొత్తమ్మీద ఎలా చూసుకున్నా... రైతు నుంచి మార్కెట్ కొచ్చేసరికి ఉల్లి రెండు నుంచి నాలుగింతలు ఘాటెక్కుతోంది. ఎందుకిలా? తెచ్చేది, కొనేది వారే... వ్యవసాయ మార్కెట్లలో క్రయ విక్రయాలు బహిరంగ వేలం ద్వారానే సాగుతాయి. లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయనేది వ్యాపారుల మాట. నిజమే! కానీ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చేవారంతా రైతులేనా? రైతులేమో చేల దగ్గరే సరుకును విక్రయిస్తున్నామంటున్నారు. మరి మార్కెట్‌కు తెచ్చేదెవరు? వ్యాపారులేగా! సరుకు తెచ్చేవారు, కొనేవారు కుమ్మక్కయి... అంతా కలిసి ఒకే ధర నిర్ణయిస్తే అటు రైతులకు గానీ ఇటు వినియోగదారులకు గానీ దిక్కెవరు? రైతు దగ్గర కిలో రూ.10కి కొన్న వ్యాపారి, అవే ఉల్లిగడ్డల్ని వ ్యవసాయ మార్కెట్లో రూ.40కి విక్రయిస్తే... వాటిని కొన్న వ్యాపారి రూ.42కు హోల్‌సేలర్‌కు అమ్మితే... అక్కడి నుంచి రిటైలర్‌కు.. తర్వాత వినియోగదారుకు వచ్చేసరికి ధర రూ.50-60కి చేరితే దాన్ని ఛేదించాల్సింది ప్రభుత్వం కాదా? ప్రతిసారీ ఉల్లిపాయలు జాతీయ స్థాయిలో హాట్‌టాపిక్‌గా మారడానికి ఈ సరఫరా లింకేజీ లోపాలే అసలు కారణం కాదా? ఇదీ... రైతు దుస్థితి రైతుల మాటల్లో చెప్పాలంటే వారు నేరుగా తెచ్చి విక్రయించలేరు. అది సాధ్యం కాదు. కారణమేంటంటే స్థానికంగా ఉండే దళారి. గౌరవంగా చెప్పాలంటే ఖరీదుదారు. దళారిని కాదని మార్కెట్లో విక్రయించే పరిస్థితి రైతుకుండదు. ఎందుకంటే తను ఆ రైతుకు ముందే రుణమిస్తాడు. ఇలా రుణాలివ్వటానికి దళారులు ఎప్పుడూ ముందే ఉంటారు. బ్యాంకుల నుంచి రుణం రావటమంటే మాటలు కాదు కనక రైతులెప్పుడూ దళారులనే ఆశ్రయిస్తారు. అవసరాన్ని బట్టి ఈ రుణాలకు నెలకు 4 శాతం వడ్డీ చెల్లించే రైతులూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో సాగు ప్రారంభానికి ముందే రైతు, దళారి మధ్య ‘ఒప్పందం’ జరుగుతోంది. పంట చేతికి రాగానే సదరు దళారికి సరుకు పూర్తిగా అప్పగించాలి. దళారి మొదట నిర్ణయించిన ధరకు మించి ఒక్కపైసా రైతుకివ్వడు. ‘‘అవసరమైనప్పుడు సాయం చేస్తారు కాబట్టి వారి మాట వింటాం. వారు చెప్పిన ధరకు సరుకు విక్రయిస్తాం. రూ.6 వేలు అప్పు ఇచ్చిన దళారి కూడా మాకు గొప్పే’’ అని ఓ రైతు చెప్పాడు. ఒకవేళ రేటు గిట్టుబాటు కాదని బతిమాలితే... పంట నాణ్యత సరిగా లేదు. ఇంత కన్నా ఎక్కువ ధర రాదనే సమాధానం ఎదురవుతుంది. పంటను నిల్వ చేసే తాహతు రైతుకుండదు.అందుకే రైతుకు దక్కిందే బంగారం మరి. -
తగ్గుముఖంపట్టిన ఉల్లిధర
పరిగి, న్యూస్‌లైన్: రెండు నెలలకు పైగా వినియోగదారులకు కన్నీళ్లు పెట్టించిన ఉల్లి కాస్త శాంతించింది. ఉల్లిధరలు కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఉల్లి ధరలు కాస్తా దిగివచ్చాయి. గత వారం పరిగి మార్కెట్లో కిలో ఉల్లిధర రూ. 60 నుంచి 70 వరకు విక్రయించగా ఈ వారం ఆధరలు 40 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గాయి. శుక్రవారం పరిగి మార్కెట్లో తెల్లరకం ఉల్లిగడ్డ కిలో రూ. 40 నుంచి 50 వరకు విక్రయించగా, ఎర్రఉల్లిగడ్డలు కిలో రూ.30 చొప్పున విక్రయించారు. దీంతో వినియోగదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో టమాటా ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. గతవారం కిలో టమాటాలు రూ. 30కి విక్రయించగా ఈ వారం కిలో టమాటాలు రూ. 15నుంచి 20 వరకు విక్రయించారు. ఇదే సమయంలో మిర్చి ధరలు మాత్రం వినియోగదారులను ఆందోళనకు గురిచే స్తున్నాయి. గత వారం కిలో మిర్చి రూ. 50నుంచి రూ. 60కి విక్రయించగా ఈ వారం ఏకంగా ఆధరలు కిలో రూ.80కి పెరిగాయి. ప్రభుత్వం విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు అనుమతించటం, ప్రభుత్వమే డీసీఎంఎస్‌ల ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకోవటంతోనే ఉల్లి ధరల్లో తగ్గుదల నమోదైందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆహార బిల్లును ఇలా సవరిద్దాం..!
న్యూఢిల్లీ: ఆహార భద్రత బిల్లుకు ప్రభుత్వం కొన్ని సవరణలు చేసే అవకాశముంది. విపక్షాలు లేవనె త్తిన ఆందోళనలను తొలగించేందుకు బిల్లులో కొన్ని సవరణలు చేయనున్నట్లు సమాచారం. మంగళవారం పార్లమెంటులో బొగ్గు స్కాం, ఉల్లి ధరలు వంటి అంశాలపై రభసతో బిల్లుపై చర్చకు ఆటంకం కలగడం తెలిసిందే. గురువారం లోక్‌సభలో బిల్లుపై చర్చ జరుగుతుందని, దానికి సభ ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. ఆహార భద్రత పథకానికి సంబంధించి విపక్షాలు 265 సవరణలు సూచించాయి. పథకాన్ని అందరికీ వర్తింపజేసి, తిండిగింజలతోపాటు పప్పు ధాన్యాలు, వంటనూనె, చక్కెరలను చేర్చి, మనిషికి నెలకు 5 కేజీలకు బదులు 7 కేజీల ధాన్యమివ్వాలన్నది వీటి సారాంశం. ఆహార సబ్సిడీని నగదు రూపంలో చెల్లించవద్దన్నది మరో కీలక సవరణ. ఈ సవరణల్లో కొన్నింటి గురించి క్లుప్తంగా.. బీజేపీ..: ఆహార సబ్సిడీకి సంబంధించి ఆధార్ సంఖ్య ప్రాతిపదికన చేపట్టిన సంస్కరణలను, నగదు సబ్సిడీని రద్దు చేయాలి. పౌష్టికాహార లేమితో బాధపడుతున్న పిల్లలకు ఉచిత భోజన సదుపాయం కల్పించాలి. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇది ఉత్పాదక వ్యయానికంటే 1.5 రెట్లు ఎక్కువగా ఉండాలి. వామపక్షాలు..: బిల్లులో ప్రతిపాదించినట్లు 67 శాతం జనాభాకే కాకుండా మొత్తం జనాభాకు ఆహార భద్రత కల్పించాలి. నగదు సబ్సిడీ విధానాన్ని రద్దు చేయాలి. పేదలకు ఒక పూట ఉచిత భోజనం అందివ్వాలి. డీఎంకే..: ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రాష్ట్రాలకు ఇస్తున్న తిండిగింజల కోటాను ఇకముందూ కొనసాగించాలి. తృణమూల్ కాంగ్రెస్..: గ్రామాల్లో 90 శాతం మందికి, పట్టణాల్లో 75 శాతం మందికి ఆహార భద్రత కల్పించాలి. -
రాజ్యసభలో రగడ
న్యూఢిల్లీ: ఉల్లి ధరల పెరుగుదలకు నిరసనగా వామపక్ష సభ్యులు, ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు గలభా సృష్టించడంతో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. మాజీ సభ్యులు దిలీప్‌సింగ్ జుదేవ్ (బీజేపీ), ఎస్.ఎం.లాల్‌జాన్ భాషా (టీడీపీ)ల మృతికి, సబ్మెరీన్ ప్రమాదంలో నౌకాదళ సిబ్బంది మరణానికి సభ సంతాపం వ్యక్తం చేస్తున్నట్టుగా చైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించిన వెంటనే బీజేపీ, ఎస్పీ, వామపక్ష పార్టీల సభ్యులు లేచి నిలబడ్డారు. అయితే బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లు గల్లంతు కావడం తీవ్రమైన అంశమని వెంకయ్యనాయుడు అన్నారు. జీరో అవర్‌లో ఈ విషయం ప్రస్తావించాల్సిందిగా అన్సారీ ఆయనకు సూచించారు. బీజేపీ సభ్యులు కూర్చోగానే ఎస్పీ సభ్యులు ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. పెరుగుతున్న ఉల్లి ధరలను అదుపు చేయాలంటూ వామపక్ష ఎంపీలు పోస్టర్లు ప్రదర్శించారు. సభ్యులు సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తి చేసిన చైర్మన్.. ఫలితం లేకపోవడంతో తొలిసారి 15 నిమిషాలపాటు సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాతా ఎస్పీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో రెండోసారి మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. ప్రధానిని కాపాడే కుట్ర: బొగ్గు శాఖకు చెందిన కీలక ఫైళ్లు మాయం కావడంపై రాజ్యసభ జీరో అవర్ విపక్షాల అరుపులతో దద్దరిల్లింది. బొగ్గు స్కాం నుంచి ప్రధానిని రక్షించేందుకు కుట్ర జరుగుతోందని విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై ప్రధాని జవాబు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీ దిలీప్ సింగ్ జుదేవ్ మృతికి సంతాపం ప్రకటించాక లోక్‌సభ మంగళవారానికి వాయిదా వేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం వక్ఫ్ ఆస్తుల దురాక్రమణలను అరికట్టడంతో పాటు వాటి లీజును గరిష్టంగా ముప్పయ్యేళ్ల వరకు పొడిగించేందుకు వక్ఫ్ సవరణ బిల్లును సోమవారం రాజ్యసభ ఆమోదించింది. వక్ఫ్ సవరణ బిల్లు-2010 ద్వారా వక్ఫ్ ఆస్తులు వాణిజ్యపరంగా సక్రమంగా వినియోగించేందుకు వీలవుతుందని, వాటిపై ఏటా రూ.లక్ష కోట్ల వరకు ఆదాయం లభిస్తుందని మైనారిటీ వ్యవహారాల మంత్రి రెహమాన్ ఖాన్ చెప్పారు. నిరాటంకంగా ప్రశ్నోత్తరాలు: సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయాల నేపథ్యంలో అన్సారీ సోమవారం అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. వర్షాకాల సమావేశాల్లో ఇకపై శాసన పరమైన సభా వ్యవహారాలకు అంతరాయం కలిగించబోమని సభ్యులు హామీ ఇచ్చారు. ప్రశ్నోత్తరాలు నిరాటంకంగా కొనసాగేందుకు సహకరిస్తామని చెప్పారు. -
ఉల్లికిపాటు
సాక్షి, విశాఖపట్నం : జిల్లావాసులను ఉల్లి కన్నీళ్లు ఇప్పట్లో వీడేలా లేవు. పెరిగిన ధరలతో సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న వీటి ధర మరో రెండు మూడు నెలలైనా తగ్గేలా కనిపించడం లేదు. ఆకాశాన్నంటిన ధరలను ఎలాగైనా దించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. డిమాండ్, సప్లయికి మధ్య అంతరం రోజురోజుకు పెరిగిపోతుండటంతో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాకు 136 మెట్రిక్ టన్నుల ఉల్లి అవసరమైతే కేవలం 3 టన్నులు మాత్రమే దిగుమతవుతోంది. దీంతో పెరిగిన వినియోగానికి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. కిలో రూ.60పైనే అమ్ముడుపోతోంది. దీనిని తగ్గించే క్రమంలో జిల్లా అవసరాలకు మించి సరకును దిగుమతికి ఇప్పటికే మార్కెటింగ్‌శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అందు కోసం రాష్ట్రంలో కర్నూలు తర్వాత హోల్‌సేల్ ఉల్లి వ్యాపారానికి రెండో కేంద్రంగా పెట్టింది పేరైన తాడేపల్లిగూడెం నుంచి రప్పించాలని ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఇక్కడి నుంచి రైతు బజార్ల ఎస్టేట్ అధికారులు ఇద్దరిని అక్కడకు ధరలు, నాణ్యత పరిశీలనకు పంపారు. తీరా అక్కడ హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.45 నుంచి రూ.50 పలుకుతోంది. దానికి తోడు నిల్వలు తక్కువగా ఉండటం, ఉల్లిపాయల నాణ్యత అసలేం బాగోలేకపోవడంతో చేసేది లేక ఇటీవల తిరిగొచ్చేశారు. అక్కడ కొనుగోలుచేసినా రవాణా ఖర్చుతో కలిసి ఇక్కడ ధరకే అక్కడి నుంచి కొనుగోలు చేసినట్టవుతుందని ప్రయత్నాలు విరమించుకున్నారు. మరోపక్క సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం నిత్యావసర వస్తువుల ధరలు ఎలాగైనా తగ్గించే ప్రయత్నాలు చేయాలని ఆయా జిల్లాల అధికారులకు సూచించడంతో జేసీ కూడా రంగంలోకి దిగారు. మార్కెటింగ్‌శాఖ అధికారులతో మాట్లాడారు. అవసరమైతే జిల్లాతోపాటు చుట్టు పక్క జిల్లాల్లో ఉల్లిసాగుచేసే రైతులు,వ్యాపారులతో మాట్లాడి వారి నుంచి నేరుగా కొనుగోలుచేసి రైతుబజార్లలో విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాని వ్యాపారుల వద్దకూడా నిల్వలు లేకపోవ్చనే సమాచారంతో తదుపరి ఏంచేయాలనేదానిపై ఆలోచిస్తున్నారు. అక్కడంతా కుళ్లిపోయింది... : కర్నూలుతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జిల్లాకు ఉల్లి దిగుమతవుతోంది. ఇందులో అధిక భాగం మహరాష్ట్ర, కర్ణాటక నుంచే అధికారులు కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల అక్కడ భారీ వర్షాలతోపాటు,వరదల కారణంగా ఉల్లిపంట తీవ్రంగా నష్టపోయింది. ఉపయోగానికి వీలులేకు ండా కుళ్లిపోవడంతో దిగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటికిప్పుడు జిల్లాలో ఉల్లి ధరలు దిగిరావాలంటే ఎంతలేదన్నా 140 మెట్రిక్ టన్ను ల సరకు వస్తేనే ధరలు దిగివస్తాయని చెబుతున్నారు. -
నిత్యావసరాల ధరలు నియంత్రించండి: కిరణ్‌కుమార్‌రెడ్డి
ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉల్లిపాయలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆయన శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీకే మహంతి, ఇతర ఉన్నతాధికారులతో నిత్యావసర సరుకుల ధరలు, భారీ వర్షాలు, సీమాంధ్రలో సమ్మె తదితర అంశాలపై సమీక్షించారు. ఉల్లిపాయలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. సీమాంధ్రలో ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ సిబ్బంది సమ్మె నేపథ్యంలో రవాణాపరంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన వాకబు చేశారు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అత్యవసర రవాణాకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వల వివరాలపై ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. ఈనెల 14వ తేదీన రాష్ట్ర సగటు వర్షపాతం మూడు మిల్లీమీటర్లు కాగా శుక్రవారం 20.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం రికార్డయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఈనెల 16వ తేదీ వరకూ 398.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా ఈ ఏడాది ఇదే కాలంలో 443.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం (11 శాతం అధికంగా) నమోదైందని వారు వివరించారు. నల్లగొండ జిల్లాలో ఈనెల 13 - 15 తేదీల్లో కురిసిన వర్షాలవల్ల 6,375 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. -
మేడ్చల్ పీఏసీఎస్‌లో చోరీకి యత్నం
మేడ్చల్ న్యూస్‌లైన్: మండల కేంద్రంలోని పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం)లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించి రికార్డులను చిందరవందరగా పడేశారు. పీఏసీఎస్ సిబ్బంది కథనం ప్రకారం.. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో కార్యదర్శి మోహన్‌రావు, అటెండర్ ప్రకాష్‌లు బుధవారం సాయంత్రం వరకు ఏర్పాట్లు చేశారు. మోహన్‌రావు 5 గంటలకు వెళ్లిపోగా అటెండర్ కార్యాలయాన్ని శుభ్రం చేసి సాయంత్రం ఏడు గంటల తర్వాత కార్యాలయానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న పీఏసీఎస్ కార్యాలయంలోకి బుధవారం రాత్రి దుండగులు ప్రహరీ దూకి ప్రవేశించారు. గది తాళాలు పగులగొట్టి లోపలకి చొరబడ్డారు. కార్యదర్శి, చైర్మన్ గదుల తాళాలు పగులగొట్టి రికార్డులను చిందరవందర చేశారు. ఫైళ్లను భద్రపరిచే బీరువాలను ధ్వసం చేశారు. చైర్మన్ అంతిరెడ్డి చాంబర్‌లోని టేబుల్ డ్రాతో పాటు కార్యదర్శి టేబుళ్లను పడేశారు. ఫైళ్లను ఛిన్నాభిన్నం చేశారు. పాత రికార్డులను ఉంచే మూటలను విప్పి అందులో రికార్డులను గదుల్లో పడేశారు. కంప్యూటర్ను ధ్వంసంచేసే యత్నం చేశారు. గురువారం కార్యాలయ సిబ్బంది సమాచారంతో సీఐ రాంరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని 2 లీటర్ల పెట్రోల్ సీసా, అగ్గిపెట్టె, ఓ తాపీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించింది. కార్యాలయం నుంచి ఎలాంటి ఫైళ్లు, సామగ్రి చోరీ కాలేదని పీఏసీఎస్ కార్యదర్శి మోహన్‌రావు తెలిపారు. అంతా అనుమానాస్పదం.. డబ్బులు, విలువైన వస్తువులు ఉండని పీఏసీఎస్‌లో చోరీయత్నం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. మేడ్చల్ పీఏసీఎస్ దాదాపు కోటి రూపాయల టర్నోవర్‌తో నడుస్తోంది. కాగా సంఘానికి అనుబంధంగా బ్యాంకు ఉంది. రుణాల రికార్డులను మాయం చేసేందుకు దుండగులు ఘటనకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి. చోరీ యత్నంలో ‘ఇంటి దొంగల’ హస్తం ఏమైనా ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంరెడ్డి తెలిపారు.