ఉల్లి..ఆ పేరు వింటేనే రైతన్నలు ఉలిక్కిపడుతున్నారు. కష్టనష్టాలకోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. సీజన్ ప్రారంభంలో క్వింటాలుకు రూ.4వేలు పలికిన ఉల్లి రెండువారాలుగా రూ.250కు పడిపోయింది. దీంతో మార్కెట్‌లో అన్నదాతలకు దిక్కుతోచనిస్థితి ఎదురవుతోంది.
దేవరకద్ర, న్యూస్‌లైన్ : ఉల్లి ధరలు ఒక్కసారిగా మళ్లీ పడి పోయాయి. దాంతో రైతన్న దిక్కు తోచని పరిస్థితిలో పడిపోయాడు. గ డిచిన రెండు వారాలుగా ఓ మోస్తరుగా పె రిగిన ఉల్లి ధరలను చూసిన రైతాంగం బుధవారం దేవరకద్ర మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున ఉల్లిపాయలు తీసుకువచ్చారు. పా త యార్డు, కొత్త యార్డు ఆవరణ అంతా ఉ ల్లి కుప్పలతో నిండిపోయింది. తగిన స్థలం లేక షెడ్ల పక్కన, గోదాముల పక్కన రో డ్లపై కుప్పలుగా పోశారు. దాదాపు 10 వేల బస్తాల ఉల్లి పాయలు రావడంతో మార్కెట్ యార్డు అవరణ అంతా ఉల్లిపాయల కుప్పలతో ముంచెత్తాయి.
ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్‌కు ఉల్లి పాయలు రావడం ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు. ధరలు పెరుగుతున్నాయని భావించిన రైతాంగానికి వేలం పాటలు ప్రారంభమైన తరువాత ఒక్కసారిగా నిరాశలో కురుకు పోయారు. గత రెండు వారాలుగా పెరుగుతూ వచ్చిన ధరలు సగానికి సగం పడి పోవడంతో చాల మంది రైతలు ట్రాక్టర్ల నుంచి కింద పోయకుండానే వాపసు తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున వచ్చిన ఉల్లిపాయలను కొనడానికి వ్యాపారులు ఆసక్తిని చూపక పోవడంతో కొందరు రైతులు తెచ్చిన ఉల్లిపాయలకు వేలం వేసే వారు కూడా కరువయ్యారు.
సగం తగ్గిన ధరలు..
గత వారం కనిష్టంగా రూ. 600 ఉండగా, ప్రస్తుతం రూ. 250కు పడిపోయింది. గత వారం వచ్చిన ధరల కన్నా దాదాపు రూ. 350 వరకు ధరలు తగ్గిపోయాయి. గరిష్టంగా గత వారం రూ. 780 ఉండగా ఈ వారం రూ. 570లకు పడిపోయింది. ఇలా ఒక్కసారిగా ధరలు పడి పోవడానికి కారణం ఉల్లి ఎక్కువగా అమ్మకానికి రావడం వల్లనే అని తెలుస్తుంది. నాలుగు నెలల క్రితం సీజన్ ప్రారంభంలో రూ. 4 వేలకు క్వింటాల్ పలికిన ఉల్లి ధరలు ప్రతి వారం తగ్గు ముఖం పడుతూ వచ్చి చివరకు రూ. 250 పడిపోయింది.
ధరలు రాక వాపసు
తీసుకెళ్లిన రైతులు..
ఉల్లికి తగిన ధరలు రాక పోవడంతో కొందరు రైతులు వాపసు తీసుకెళ్లారు. మరి కొందరు తెచ్చిన ట్రాకర్ల నుంచి ఉల్లిని కింద పోయకుండానే తీసుకెళ్లి పోయారు. మరి కొందరు రైతులు వ్యాపారులను ప్రాధేయ పడుతూ ఏదో ధరకు తీసకోవాలని వేడుకున్నారు. మార్కెట్‌లో రైతుల పరిస్థితి చూస్తే దయనీయంగా తయారయింది.
ఉల్లిని అడిగేవారు లేరు
మార్కెట్‌కు ఉల్లిని తీసుకు వస్తే అడిగేవారు కరువయ్యారు. ధరలు చూస్తే కన్నీరు పెట్టిస్తున్నది. కనీసం ఉల్లిని తెంచడనికి మార్కెట్‌కు తీసుకురావడానికి అయిన ఖర్చులు కూడ రాని పరిస్థితి ఉంది.
- బుచ్చారెడ్డి, ఉల్లి రైతు, డోకూర్
దిక్కు తోచడంలేదు..
తెచ్చిన ఉల్లి కొనేవారు కరువయ్యారు. ధరలు పెరుగుతున్నాయని మార్కెట్‌కు తెస్తే ఇలా కావడంతో దిక్కు తోచడంలేదు. తెచ్చిన ఉల్లిని మళ్లీ తీసుకెళ్లడానికి కూడా ఖర్చులు రావు. ఏదో ధరకు అమ్ముకోక తప్పదు.
-రాములు, ఉల్లిరైతు, గోపన్‌పల్లి
ధరలు చూస్తే కన్నీరొస్తుంది..
తె చ్చిన ఉల్లికి తక్కువ ధర వచ్చింది. గత వారం రూ. 600 వరకు వచ్చిన ఉల్లికి ఈ వారం రూ. 360 వచ్చింది. ఇలా ధరలు తగ్గడం రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. అధికారులు ఉల్లి రైతులను ఆదుకోవాలి.
-రాము, ఉల్లిరైతు, మోదీపూర్
ఎవరిని అడుక్కోవాలి..
ధరలు రాలే దు. కనీసం తెచ్చిన ఉల్లిని కొనేవారు క రువయ్యారు. రైతు ల గురించి ఎవరికీ పట్టడంలేదు. ఉల్లిని కొనమని ఎవరిని అ డుక్కోవాలో తెలియడంలేదు. కనీసం పెట్టిన ఖర్చులు వస్తే చాలు.
-రాకంకొండ,
ఉల్లిరైతు, గూరకొండ
రైతన్న ‘ఉల్లి’కిపాటు
Published Thu, Mar 20 2014 4:16 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement