Onion Prices Might Touch Rs70 Per Kg By August Month End, Revealed By Crisil Research - Sakshi
Sakshi News home page

ఇక ఉల్లి కూడా..ఈ నెలాఖరుకు: క్రిసిల్‌ షాకింగ్‌ రిపోర్ట్‌ 

Published Sat, Aug 5 2023 11:24 AM | Last Updated on Sat, Aug 5 2023 1:08 PM

Onion prices might touch Rs70 per kg by month endsays Crisil - Sakshi

Onion prices ఇప్పటికే కొండెక్కి కూచున్న టమాట ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో పాటు చింతపండు, వెల్లుల్లి, అల్లంతో పాటు ఇతర కూరగాయలు ధలు కూడా మండిస్తున్నాయి. తాజాగా ఉల్లిపాయ ధరలపై క్రిసిల్ షాకింగ్‌ రిపోర్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఉల్లి ధరలు కూడా టమాటా బాట పట్టనుందని క్రిసిల్‌ పరిశోధన వెల్లడించింది. ఆగస్టు నెలాఖరు నాటికి ఉల్లి ధరలు  150 శాతం ఎగిసి కిలో రూ.60/70కి చేరవచ్చని క్రిసిల్ పేర్కొంది. సప్లయ్‌  కూడా కష్టంగా మారితే  ధరలు మరింత అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. (మహిళల రికార్డ్‌: వారి టార్గెట్‌ పక్షి కన్నే, గర్వంగా ఉంది: ఆనంద్‌ మహీంద్ర ప్రశంసలు)

శుక్రవారం విడుదల చేసిన అధ్యయనం, ఫిబ్రవరి ,మార్చి 2023లో నమోదైన అమ్మకాల కారణంగా  రబీ ఉల్లిపాయల షెల్ఫ్  లైఫ్‌ ఒకటి నుండి రెండు నెలల వరకు తగ్గిందని ఫలితంగా, గత రబీ సీజన్‌లోని ఉల్లి నిల్వలు సెప్టెంబర్ కంటేముందే ఆగస్టు నాటికే గణనీయంగా క్షీణించవచ్చని  తెలిపింది.  ప్రస్తుతం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డేటా ప్రకారం, ఢిల్లీ మార్కెట్‌లలో ఉల్లిపాయల రిటైల్ ధర కిలోకు సుమారు రూ.30. క్రిసిల్ నివేదిక నిజమైతే, నెలాఖరు నాటికి ధరలు రెట్టింపు కావచ్చు. (పండగ సందడి షురూ: టాటా సీఎన్‌జీ కార్లు వచ్చేశాయ్‌!)

అయితే దీంతోపాటు ఈ నివేదిక కొన్ని సానుకూల  అంశాలను కూడా వెల్లడించింది.ఈ పెరుగుదల 2020లో కనిపించిన గరిష్ట స్థాయిల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. మరీ ముఖ్యంగా, ఖరీఫ్ పంట అక్టోబర్ నుండి మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఖరీఫ్ ఉల్లి పంట మార్పిడి ,  పంటను  నిర్ణయించడంలో ఆగస్టు , సెప్టెంబర్‌లలో వర్షపాతం కీలక పాత్ర పోషిస్తుందని నివేదిక హెచ్చరించింది.సెప్టెంబర్‌లో ఉన్న అధిక ధరలతో పోలిస్తే, పండుగ నెలల్లో (అక్టోబర్-డిసెంబర్) ధరల హెచ్చుతగ్గులు స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తోంది" అని నివేదిక  స్పష్టం చేసింది. దేశంలో ఉల్లి ప్రస్తుత  రిటైల్ ధరలు కిలోకు రూ. 25 వద్ద ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement