Crisil Research
-
ఇక ఉల్లి కూడా..ఈ నెలాఖరుకు: క్రిసిల్ షాకింగ్ రిపోర్ట్
Onion prices ఇప్పటికే కొండెక్కి కూచున్న టమాట ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో పాటు చింతపండు, వెల్లుల్లి, అల్లంతో పాటు ఇతర కూరగాయలు ధలు కూడా మండిస్తున్నాయి. తాజాగా ఉల్లిపాయ ధరలపై క్రిసిల్ షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఉల్లి ధరలు కూడా టమాటా బాట పట్టనుందని క్రిసిల్ పరిశోధన వెల్లడించింది. ఆగస్టు నెలాఖరు నాటికి ఉల్లి ధరలు 150 శాతం ఎగిసి కిలో రూ.60/70కి చేరవచ్చని క్రిసిల్ పేర్కొంది. సప్లయ్ కూడా కష్టంగా మారితే ధరలు మరింత అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. (మహిళల రికార్డ్: వారి టార్గెట్ పక్షి కన్నే, గర్వంగా ఉంది: ఆనంద్ మహీంద్ర ప్రశంసలు) శుక్రవారం విడుదల చేసిన అధ్యయనం, ఫిబ్రవరి ,మార్చి 2023లో నమోదైన అమ్మకాల కారణంగా రబీ ఉల్లిపాయల షెల్ఫ్ లైఫ్ ఒకటి నుండి రెండు నెలల వరకు తగ్గిందని ఫలితంగా, గత రబీ సీజన్‌లోని ఉల్లి నిల్వలు సెప్టెంబర్ కంటేముందే ఆగస్టు నాటికే గణనీయంగా క్షీణించవచ్చని తెలిపింది. ప్రస్తుతం, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డేటా ప్రకారం, ఢిల్లీ మార్కెట్లలో ఉల్లిపాయల రిటైల్ ధర కిలోకు సుమారు రూ.30. క్రిసిల్ నివేదిక నిజమైతే, నెలాఖరు నాటికి ధరలు రెట్టింపు కావచ్చు. (పండగ సందడి షురూ: టాటా సీఎన్జీ కార్లు వచ్చేశాయ్!) అయితే దీంతోపాటు ఈ నివేదిక కొన్ని సానుకూల అంశాలను కూడా వెల్లడించింది.ఈ పెరుగుదల 2020లో కనిపించిన గరిష్ట స్థాయిల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. మరీ ముఖ్యంగా, ఖరీఫ్ పంట అక్టోబర్ నుండి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఖరీఫ్ ఉల్లి పంట మార్పిడి , పంటను నిర్ణయించడంలో ఆగస్టు , సెప్టెంబర్లలో వర్షపాతం కీలక పాత్ర పోషిస్తుందని నివేదిక హెచ్చరించింది.సెప్టెంబర్‌లో ఉన్న అధిక ధరలతో పోలిస్తే, పండుగ నెలల్లో (అక్టోబర్-డిసెంబర్) ధరల హెచ్చుతగ్గులు స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తోంది" అని నివేదిక స్పష్టం చేసింది. దేశంలో ఉల్లి ప్రస్తుత రిటైల్ ధరలు కిలోకు రూ. 25 వద్ద ఉన్నాయి. -
మీడియా, వినోదం ఆదాయం 1.6 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: భారత్ మీడియా, వినోద రంగం ఆదాయాలు మార్చితో ప్రారంభమయ్యే 2023–24 ఆర్థిక సంవత్సరంలో 12 నుంచి 14 శాతం వృద్ధితో రూ. 1.6 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. ఆదాయాల వృద్ధి స్పీడ్ విషయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్ తొలి వరుసలో నిలిస్తే, టీవీ, ప్రింట్లు వరుసలో తరువాత ఉండనున్నట్లు నివేదిక వివరించింది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ►మీడియా, వినోద రంగం ఆదాయంలో 55 శాతం వాటా ప్రకటన విభాగం నుంచి రాబడికి సంబంధించినదే. ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉండడంతో ఈ విభాగంలో ఆదాయాలు 14 శాతం వృద్ధి చెందుతాయని అంచనా. అలాగే, 2024 మధ్యలో జరిగే సాధారణ ఎన్నికలు వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రకటన వ్యయంలో పెరుగుదలను పెంచుతాయి. ► మిగిలిన 45 శాతం చందాల రూపంలో ఉంటుంది. ఈ విభాగంలో వృద్ధి 12 శాతం వరకూ నమోదుకావచ్చు. ►వేర్వేరుగా చూస్తే, ప్రింట్ మీడియాలో ఆదాయాలు 15 శాతం పెరిగే వీలుంది. అయితే ఈ విభాగంలో ఆదాయాలు ఇంకా కరోనా ముందస్తు స్థాయికి చేరలేదు. ఇంకా ఈ విషయంలో ఆదాయాలు ఇంకా 8 నుంచి 10 శాతం వరకూ వెనుకబడి ఉన్నాయి. ఆంగ్ల ఎడిషన్ల విషయంలో ఆదాయాల రికవరీ నెమ్మదిగా ఉండడం దీనికి కారణం. అయితే రేడియో, అవుట్డోర్ వంటి ఇతర హైపర్‌లోకల్ మీడియా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరోనా ముందస్తు స్థాయిలను చేరుకోవచ్చు. ఈ విభాగాలకు కీలకమైన వనరుగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల కోసం అధిక యాడ్ బడ్జెట్ కేటాయింపులు దీనికి కారణం. ►ఫిల్మ్ ఎగ్జిబిషన్ విషయానికి వస్తే, థియేటర్ వసూళ్లు కోవిడ్–19 వల్ల తీవ్రంగా నష్టపోయాయి. అయితే 2023–24లో పటిష్టంగా ఆయా ఆదాయాఉల రికవరీ సాధించవచ్చు.30 శాతం వరకూ గణనీయమైన వృద్ధి రేటు నమోదవుతుందని భావిస్తున్నాం. స్క్రీన్లు, ఆక్యుపెన్సీ రేటు పెరిగే అవకాశాలు ఉండడం మా అంచనాలకు కారణం. ►టీవీ, ప్రింట్ మీడియాల్లో రాబడుల్లో వృద్ధి స్పీడ్ మామూలుగా నమోదుకావచ్చు. దీర్ఘకాలికంగా డిజిటల్ మాధ్యమానికి ప్రాధాన్యత పెరుగుతుండడమే దీనికి కారణం. -
బ్యాంకుల మొండి బాకీలు తగ్గుతాయ్
ముంబై: బ్యాంకింగ్ రంగంలో స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు/వసూలు కానీ మొండి బాకీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 0.90 శాతం మేర తగ్గి 5 శాతానికి పరిమితమవుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతేకాదు 2024 మార్చి నాటికి 4 శాతానికి క్షీణిస్తాయని పేర్కొంది. అయినా కానీ, బ్యాంకింగ్ రంగం ముందు ఇతర విభాగాల నుంచి సవాళ్లు ఉన్నట్టు ప్రస్తావించింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)ల రుణ విభాగంపై ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సమయంలో బ్యాంకులు ఎంఎస్ఎంఈ రంగానికి ఎక్కువగా రుణ వితరణ చేయడంతో, ఈ విభాగంలో స్థూల ఎన్పీఏలు 2024 మార్చి నాటికి 10-11 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసింది. ఈ విభాగంలో స్థూల ఎన్పీఏలు 2022 మార్చి నాటికి 9.3 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో రుణాల పునరుద్ధరణ 6 శాతంగా ఉంటే, మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాల పునరుద్ధరణ 2 శాతమే ఉన్నట్టు గుర్తు చేసింది. 6 శాతం పునరుద్ధరణ రుణాల్లో పావు వంతు ఎన్పీఏలుగా మారొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. రుణ విభాగాల పరంగా ఎంఎస్ఎంఈల కంటే పెద్ద కంపెనీల పనితీరు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. (ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు..ఇక విదేశాల్లో రయ్..రయ్!) కార్పొరేట్ విభాగం మెరుగు పెద్ద కార్పొరేట్ విభాగంలో రుణాల పరంగా స్థూల ఎన్పీఏలు వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికి 2 శాతానికి తగ్గుతాయని క్రిసిల్ పేర్కొంది. 2018 నాటికి ఈ విభాగంలో స్థూల ఎన్పీఏలు 16 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకులు తమ పుస్తకాల్లో కార్పొరేట్ రుణాలకు సంబంధించి భారీ ప్రక్షాళన చేపట్టడమే మెరుగుదలకు కారణంగా పేర్కొంది. -
ఎన్బీఎఫ్సీ కంపెనీలకు మంచి రోజులు
ముంబై: ఎన్బీఎఫ్సీ రంగానికి సంబంధించి క్రిసిల్ రేటింగ్స్ సానుకూల అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) వాటి ఆస్తులు నాలుగేళ్ల గరిష్ట స్థాయి అయిన 11–12 శాతం మేర వృద్ధి చెందుతాయని అంచనా వేసింది. కరోనా కారణంగా వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల పాటు ఎన్బీఎఫ్సీ ఆస్తుల వృద్ధి కుంటుపడిందని, 2021–22లో కేవలం 5 శాతం వృద్ధికి పరిమితమైనట్టు వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ఆస్తులు రెండంకెల స్థాయిలో పెరగొచ్చని అంచనా వేస్తూ.. అయినప్పటికీ కరోనా ముందున్న 20 శాతం వృద్ధి కంటే తక్కువేనని పేర్కొంది. బ్యాంకుల నుంచి తీవ్ర పోటీ ఉండడం, వడ్డీ రేట్ల పెరుగుదల కొన్ని విభాగాల్లో ఎన్‌బీఎఫ్‌సీల పోటీతత్వాన్ని ప్రభావితం చేస్తాయని అంచనా వేసింది. దీనివల్ల ఎన్బీఎఫ్సీలు అధిక రాబడులు వచ్చే విభాగాలపై దృష్టి సారించొచ్చని పేర్కొంది. వాహన రుణాల్లో మెరుగైన వృద్ధి.. ఎన్బీఎఫ్సీ ఆస్తుల్లో (అవి ఇచ్చిన రుణాలు) సగం మేర వాహన రుణాలే ఉంటాయి. ఇవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11-13 శాతం వరకు పెరుగుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. క్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ వాహన రుణాల్లో వృద్ధి 3–4 శాతంగానే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. పునర్వినియోగ వాహన రుణాల్లో అధిక వృద్ధిని ఎన్బీఎఫ్సీలు చూస్తాయని, వీటిల్లో అధిక మార్జిన్లు ఉంటాయనే విషయాలను ప్రస్తావించింది. వాహన రుణాలు ఆశాజనకంగా ఉండడం, ఇన్ఫ్రా రంగం నుంచి వాహనాలను మార్చేందుకు బలమైన డిమాండ్ ఉంటుందని క్రిసిల్ తెలిపింది. తీవ్ర పోటీ, పెరిగే వడ్డీ రేట్ల వల్ల కొత్త వాహన రుణాల్లో బ్యాంకులు పైచేయి చూపించొచ్చని పేర్కొంది. -
మెరుగ్గానే రిటైల్ రుణ వసూళ్లు
ముంబై:ఇటీవలి కాలంలో పెరిగిపోయిన వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావం సెక్యూరిటైజ్డ్ రిటైల్ రుణాల చెల్లింపులపై లేదని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. తాను రేటింగ్ ఇచ్చే సెక్యూరిటైజ్డ్ రుణాలకు సంబంధించి నెలవారీ వసూళ్ల రేషియో ఏ మాత్రం ప్రభావితం కాలేదని పేర్కొంది. రిటైల్ రుణ గ్రహీతలకు సంబంధించి చెల్లింపుల ట్రాక్ రికార్డు బలంగా ఉందని, ఆర్థిక కార్యకలాపాల్లో పురోగతి ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. ఆర్బీఐ ఈ ఏడాది మే నుంచి మూడు విడతలుగా 1.4 శాతం మేర రెపో రేటను పెంచడం తెలిసిందే. దీంతో డిపాజిట్లు, రుణాలపై రేట్లు పెరిగేందుకు దారితీసింది. మార్ట్గేజ్ ఆధారిత సెక్యూరిటైజేషన్ రుణాల వసూళ్లు పుంజుకున్నట్టు వివరించింది. ఇక వాణిజ్య వాహన రుణాల వసూళ్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో 105 శాతంగా ఉంటే, అవి జూన్ చివరికి 98 శాతానికి తగ్గినట్టు క్రిసిల్ తెలిపింది. చమురుపై పన్ను, సుంకాలు మోస్తరు స్థాయికి రావడంతో అది అంతమంగా వినియోగదారుడికి ఊరటనిచ్చినట్టు పేర్కొంది. ‘‘ద్విచక్ర వాహన రుణాల వసూళ్లు స్థిరంగా ఉన్నాయి. నెలవారీ కలెక్షన్ల రేషియో గత కొన్ని నెలలుగా 98–99 శాతంగా కొనసాగుతోంది. ఎంఎస్ఎంఈ రుణాల వసూళ్లు 97 శాతం నుంచి 95 శాతానికి తగ్గాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. -
ఎకానమీ వృద్ధి అంచనాలకు క్రిసిల్ కోత
సాక్షి, ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలను దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ శుక్రవారం 7.3 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 7.8 శాతం. అధిక చమురు ధరలు, ద్రవ్యోల్బణం ఎగుమతుల డిమాండ్ మందగమనం తన తాజా నిర్ణయానికి కారణమని తెలిపింది. ఈ మేరకు క్రిసిల్ విడుదల చేసిన నివేదికలో కొన్నిముఖ్యాంశాలు.. ♦ అధిక కమోడిటీ, సరకు ధరలు, ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గుముఖం పట్టడంతో ఎగుమతులకు డిమాండ్ తగ్గే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ వినియోగంకు దోహదపడే అంశాలు కూడా బలహీనంగా ఉండటం తీవ్ర ప్రతికూలాంశం. ♦ కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవల్లో పెరుగుదల, సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ప్రస్తుతం ఎకానమీకి ఉన్న బలాలు. ♦ ద్రవ్యోల్బణం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 5.5 శాతం ఉంటే, 2022–23లో సగటున 6.8 శాతంగా ఉంటుందని అంచనా. ఇది కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. వినియోగం పునరుద్ధరణపై ప్రభావం చూపుతుంది. స్థూల దేశీయోత్పత్తిలో కొనుగోలు, వినియోగ రంగాలపాత్ర కీలకం. ♦ అధిక కమోడిటీ ధరలు, గ్లోబల్ వృద్ధి మందగించడం, సరఫరా చైన్‌లో సవాళ్లు భారత్ కరెంట్ ఖాతాపై (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ప్రభావం చూపుతుంది. కరెంట్ ఖాతా లోటు 2021-22లో (జీడీపీ) 1.2 శాతం ఉంటే, 2022-23లో 3 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ♦ఆర్థిక బలహీనతల నేపథ్యంలో 2023 మార్చి నాటికి అమెరికా డాలర్లో రూపాయి విలువ మరింత బలహీనపడే అవకాశం ఉంది. పెరుగుతున్న వాణిజ్య లోటు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) ప్రవాహాలు భారీగా వెనక్కు మళ్లడం, అమెరికా డాలర్ ఇండెక్స్ బలోపేతం (రిజర్వ్ రేట్ల పెంపుదల కారణంగా) రూపాయి-డాలర్ మారకపు విలువ సమీప కాలంలో తీవ్ర ఒడిదుడుకులకు, దిగువముఖ పయనానికి దారితీసే వీలుంది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో డాలర్‌ను ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఎంచుకోవచ్చు. ♦2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ క్రూడ్ సగటు బ్యారెల్‌కు 105-110 డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 35 శాతం ఎక్కువ. 2013 తర్వాత క్రూడ్ ఈ స్థాయిలో ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. ♦ అధిక కమోడిటీ ధరలు భారత్ ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పెరుగుతున్న దిగుమతి బిల్లుతో వాణిజ్య లోటు తీవ్రం అయ్యే వీలుంది. దిగుమతుల బిల్లు పెరగడం ద్ర వ్యోల్బణం పెరుగుదలకూ కారణం అవుతుంది. ♦ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను మరో 75 బేసిస్ పాయింట్లకు పెంచే వీలుంది. మే, జూన్ నెలల్లో రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.9 శాతానికి ఎగసింది. వడ్డీరేట్ల పెరుగుదల వృద్ధి అవకాశాలను దెబ్బతీసే అంశం. రియల్టీ మహమ్మారి స్థాయికన్నా కిందకు పడిపోయే వీలుంది. ద్రవ్యోల్బణం కట్టడికి ద్రవ్య పరపతి విధానాలు మరికొంతకాలం కఠినంగా కొనసాగే అవకాశం ఉంది. 2022-23పై అంచనాల కోతలు (శాతాల్లో) ఇలా... సంస్థ తాజా తొలి ఆర్బీఐ 7.2 7.8 ఎస్అండ్పీ 7.3 7.8 ఫిచ్ 8.5 10.3 ప్రపంచ బ్యాంక్ 7.5 8.0 ఐఎంఎఫ్ 8.2 9 ఏడీబీ 7.5 –– ♦ మూడీస్ గత ఏడాది నవంబర్‌లో 2022–23లో భారత్ వృద్ధి 9.3 శాతం ఉంటుందని అంచనావేసింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ అంచనా తగ్గించే అవకాశం ఉంది. అయితే 2022 క్యాలెండర్ ఇయర్లో వృద్ధి రేటు అంచనాలను మూడీస్ 9.1 శాతం నుంచి 8.8 శాతానికి కోత పెట్టింది. -
మరో రౌండ్ టెలికాం చార్జీల బాదుడు తప్పదు!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో మూడు ప్రైవేట్ టెలికం దిగ్గజాలు (జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా) మరో విడత టారిఫ్‌లు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో 2022–23లో టెల్కోల ఆదాయాలు 20–25 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. టెలికం సంస్థలు తమ నెట్వర్క్, స్పెక్ట్రంపై ఇన్వెస్ట్ చేయాలంటే సగటున ప్రతి యూజర్‌పై వచ్చే ఆదాయాన్ని (ఏఆర్పీయూ) మరింత పెంచుకోవాల్సి ఉంటుందని, అలా చేయకపోతే సర్వీసుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏఆర్పీయూ కేవలం 5 శాతం పెరిగిందని, అయితే ఇప్పటివరకూ పెంచినది.. ద్వితీయార్ధంలో పెంచబోయేది కూడా కలిపితే యూజరుపై ఆదాయం 15-20 శాతం మేర పెరగవచ్చని క్రిసిల్ తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో టెలికం సంస్థలు నెట్వర్క్, స్పెక్ట్రంపై భారీగా వెచ్చించనున్నాయని.. ఏఆర్పీయూ వృద్ధి, టారిఫ్‌ల పెంపుతో వాటిపై ఆర్థిక భారం కొంత తగ్గగలదని పేర్కొంది. ‘టాప్ 3 సంస్థల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో 20-25% పెరిగే అవకాశం ఉంది. అలాగే నిర్వహణ లాభాల మార్జిన్ 1.80-2.20% పెరగవచ్చు‘ అని క్రిసిల్ వివరించింది. తగ్గిన యూజర్లు..: గత ఆర్థిక సంవత్సరంలో 3.70 కోట్ల ఇనాక్టివ్ యూజర్ల (పెద్దగా వినియోగంలో లేని కనెక్షన్లు) సంఖ్య తగ్గింది. యాక్టివ్ యూజర్లు (వినియోగంలో ఉన్న కనెక్షన్లు) 3 శాతం పెరిగారు. రిలయన్స్ జియో మొత్తం యూజర్ల సంఖ్య 2021 ఆగస్టు-2022 ఫిబ్రవరి మధ్య భారీగా పడిపోయినప్పటికీ యాక్టివ్ యూజర్ల వాటా 94%కి పెరిగింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్టెల్ కనెక్షన్లు 1.10 కోట్ల మేర పెరగ్గా యాక్టివ్ యూజర్ల వాటా 99%కి చేరింది. -
ఎంట్రి లెవల్ కార్ల అమ్మకాలు ఢమాల్..కొనేవారు కరువయ్యారు..! కానీ..!
ముంబై: ఆటోమొబైల్ పరిశ్రమపై కోవిడ్–19 ప్రభావాలు ఇంకా కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ పరిణామాలతో సామాన్యుల ఆదాయాల సెంటిమెంటు గణనీయంగా దెబ్బతింది. దీంతో ఎంట్రీ స్థాయి కార్లు కొనుక్కోవాలనుకునే వారు లేదా అప్‌గ్రేడ్ అవ్వాలనుకునేవారు తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సంపన్న వర్గాల ఆదాయాలకేమీ ఢోకా లేకపోవడంతో ప్రీమియం కార్ల (రూ. 10 లక్షలు పైబడినవి) అమ్మకాలు మాత్రం గణనీయంగా వృద్ధి చెందనున్నట్లు నివేదిక పేర్కొంది. ద్విచక్ర వాహనాల విభాగంలో అధిక రేటు ఉండే (రూ. 70,000 పైగా) టూ–వీలర్ల వాటా 40 శాతం స్థాయిలో ఉండనున్నట్లు వివరించింది. దేశీయంగా సాధారణంగా తొలిసారి కొనుగోలు చేసేవారు, లేదా సెకండ్ హ్యాండ్ వాహనాల నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటున్న వారు ఎంట్రీ స్థాయి కార్లపై దృష్టి పెడుతుంటారు. సరఫరాపరమైన సమస్యలు వాహనాల తయారీ సంస్థలన్నింటిపైనా ప్రభావం చూపుతున్నప్పటికీ, ఎంట్రీ లెవెల్ కన్నా ఎక్కువ రేటు ఉండే మోడల్స్‌పై కొనుగోలుదారుల ఆసక్తి కొనసాగుతోందని క్రిసిల్ నివేదిక వివరించింది. ప్రీమియం.. అయిదు రెట్లు అధికం.. గత ఆర్థిక సంవత్సరం చౌక ధరల కార్లతో పోలిస్తే ప్రీమియం సెగ్మెంట్ వాహనాలు అయిదు రెట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఎంట్రీ కార్ల విభాగం 7 శాతం పెరగ్గా ప్రీమియం విభాగం విక్రయాలు 38 శాతం వృద్ధి నమోదు చేశాయి. దీంతో ప్రీమియం కార్ల మార్కెట్ వాటా 500 బేసిస్ పాయింట్లు పెరిగి సుమారు 30 శాతానికి చేరింది. సంపన్నుల ఆదాయాలపై పెద్దగా ప్రతికూల ప్రభావాలు లేకపోవడం, ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తుండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ వివరించింది. అలాగే అధిక రేటు ఉండే టూ–వీలర్లవైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండటం, మరిన్ని మోడల్స్ అందుబాటులో ఉండటం తదితర అంశాల కారణంగా మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో వీటి వాటా 40 శాతం స్థాయిలో కొన్నాళ్లు కొనసాగవచ్చని పేర్కొంది. రేటు ఎక్కువ .. చాయిస్ తక్కువ.. కఠిన భద్రతా ప్రమాణాలు (యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సర్లు మొదలైనవి) అమలు చేయాల్సి రావడం వల్ల గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో చౌక కార్ల రేట్లు 15–20 శాతం మేర పెరిగాయి. ఎంట్రీ లెవెల్ కార్ల ధరలు గణనీయంగా పెరగడం, మోడల్స్ లభ్యత తక్కువగా ఉండటం (కొన్ని సంస్థలు ఈ విభాగం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి) వంటి అంశాలు ఒక మోస్తరు ఆదాయాలుండే కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. క్రిసిల్ నివేదిక ప్రకారం .. పెద్ద, మధ్య స్థాయి కంపెనీల్లో ఉద్యోగులపై వెచ్చించే వ్యయాలు, చిన్న స్థాయి సంస్థల్లో కన్నా ఎక్కువగా పెరిగాయి. తదనుగుణంగానే అధికాదాయం ఆర్జించే పెద్ద సంస్థల ఉద్యోగులు ఎక్కువ వెచ్చించి ప్రీమియం కార్లను కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరల్లో కార్లను కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య ఎక్కువగా చిన్న స్థాయి సంస్థల్లోనే ఉంటుంది. ఇలాంటి సంస్థల్లో ఉద్యోగులపై వ్యయాలు పెద్దగా పెరగని నేపథ్యంలో ఆదాయాల సెంటిమెంటు ఆశావహంగా లేకపోవడం వల్ల వారు కొనుగోలు నిర్ణయాలు వాయిదా వేసుకుంటున్నట్లు క్రిసిల్ తెలిపింది. ఆదాయాల సెంటిమెంట్‌ను మదింపు చేసేందుకు ఈ విధానాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు వివరించింది. ప్రీమియంలో సెకండ్ హ్యాండ్ అయినా ఓకే.. రేట్లు పెరిగిపోయిన కొత్త ఎంట్రీ లెవెల్ కారుకు బదులు అదే ధరకు వస్తున్న ఖరీదైన సెకండ్ హ్యాండ్ కారునయినా కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని క్రిసిల్ తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో మారుతీ ఆల్టో, స్విఫ్ట్, డిజైర్ వంటివి, హ్యుందాయ్ ఐ10, ఐ20 మొదలైన ప్రాథమిక స్థాయి వాహనాల అమ్మకాల వాటా మొత్తం కార్ల విక్రయాల్లో 56 శాతం పైగా నమోదైంది. కానీ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఇది క్రమంగా తగ్గుతోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా కార్ల విభాగంలో 54 పైచిలుకు మోడల్స్ ఉండగా ప్రస్తుతం 39 స్థాయికి పడిపోయింది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి తక్కువ ధర కార్ల సెగ్మెంట్లో కొత్త మోడల్స్ ఆవిష్కరణ కూడా పెద్దగా లేదు. ఖరీదైన కార్ల విభాగంలో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అయిన హ్యుందాయ్ క్రెటా, మారుతీ ఎర్టిగా, హోండా సిటీ మొదలైన వాటి వాటా 2019లో దాదాపు 68 శాతం ఉండేది. వాటి విక్రయాలు తర్వాత కాస్త తగ్గినా కొత్త అప్‌గ్రేడ్స్ ఆ ఖాళీని భర్తీ చేస్తున్నాయి. కియా సెల్టోస్, మారుతి ఎక్స్ఎల్6, ఎంజీ హెక్టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, హ్యుందాయ్ అల్కజర్ మొదలైన మోడల్స్ అమ్మకాలు గణనీయ స్థాయిలో ఉన్నాయి. ఇక గడిచిన 5–6 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 70,000 పైగా ధర ఉన్న టూ–వీలర్ల విక్రయాలు నిలకడగా అధిక స్థాయిలో నమోదవుతున్నట్లు క్రిసిల్ తెలిపింది. కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారుతుండటంతో దానికి అనుగుణంగా తయారీ సంస్థలు కూడా అధిక రేట్ల వాహనాలపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించింది. 2015 ఆర్థిక సంవత్సరంలో తక్కువ రేట్ల విభాగంలో 29 మోడల్స్ ఉండగా ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నాయని తెలిపింది. దానికి విరుద్ధంగా అధిక ధర సెగ్మెంట్లో మోడల్స్ సంఖ్య 71 నుంచి 93కి పెరిగినట్లు వివరించింది. చదవండి👉 పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు భారీ షాక్! -
బ్యాంకుల రుణాల్లో 8.9శాతం నుంచి 10.2% వృద్ధి!
ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతం నుంచి 10.2 శాతం వరకూ నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. 2022 మార్చి నాటికి బ్యాంకుల స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 6.2 శాతం నుంచి 6.3 శాతం శ్రేణిలో ఉంటాయన్నది అంచనాకాగా, 2023 మార్చి నాటికి 5.6 – 5.7 శ్రేణికి తగ్గుతాయని భావిస్తున్నట్లు తెలిపింది. ఇక నికర మొండిబాకాయిలు ఇదే కాలంలో 2 శాతం నుంచి 1.7.–1.8 శాతం శ్రేణికి దిగివచ్చే వీలుంది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ►ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల అవుట్‌లుక్ స్థిరంగా ఉంటుందని అంచనా. బ్యాంకింగ్ రుణ వృద్ధి 2021–22లో 8.3 శాతంగా అంచనావేస్తే, 2022–23లో ఇది 8.9–10.2 శాతం శ్రేణికి మెరుగుపడే వీలుంది. 2020–21లో ఇది మరింత తక్కువగా 5.5 శాతంగా ఉంది. ► రిటైల్ రంగం అలాగే సూక్ష్మ, లఘు చిన్న తరహా (ఎంఎస్ఎంఈ) పారిశ్రామిక రంగం చోదకంగా ఉండే ఆహారేతర విభాగాల నుంచి రుణ వృద్ధి బాగుంటుంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో (ఎన్బీఎఫ్సీ) కో–లెండింగ్ సమన్వయ సౌలభ్యత పెరిగే వీలుంది. ► 2019లో చోటుచేసుకున్న పరిణామాల తరహాలో హోల్‌సేల్ క్రెడిట్ విభాగంలో రుణ డిమాండ్ డెట్ క్యాపిటల్ మార్కెట్ నుంచి బ్యాంక్ క్రెడిట్‌కు మారే వీలుంది. డెట్ మార్కెట్లో బాండ్ ఈల్డ్ (వడ్డీ) భారీగా పెరిగే అవకాశం ఉండడం దీనికి కారణం. బాండ్ ఈల్డ్ పెరుగుదల నేపథ్యంలో 2022–23లో ట్రెజరీ ఇన్కమ్ కూడా గణనీయంగా తగ్గే వీలుంది. ►ఇక బ్యాంకింగ్ క్రెడిట్, ఇతర ప్రొవిజన్స్ (కేటాయింపులు) 2021–22లో 1.7 నుంచి 1.8 శాతం శ్రేణిలో ఉంటే 2022–23 నాటికి ఈ శాతాలు 1.3–1.4 శాతం శ్రేణికి తగ్గే వీలుంది. ►2021–22లో డిపాజిట్ల వృద్ధి రేటు అంచనా 8.3 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.3 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గవచ్చు. ► నియంత్రణ, ఎకానమీ వృద్ధి అవసరాల పరంగా ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకులకు 2022–23 ఆర్థిక సంవత్సరంలో తగిన మూలదనం ఉంటుందని భావిస్తున్నాం. ఇక ప్రైవేట్ బ్యాంకింగ్‌కు మూలధనం అవసరం రూ. 10,000 కోట్ల కంటే తక్కువగా ఉంటుంది. ► రుణ వృద్ధి వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మిగులు రూ. 1.5–2.5 లక్షల కోట్లకు తగ్గుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా వ్యవస్థలో మిగులు లిక్విడిటీని క్రమంగా వెనక్కు తీసుకునే అవకాశం ఉంది. ► బలమైన కార్పొరేట్ క్రెడిట్ నిష్పత్తి, రిటైల్, ఎంఎస్ఎంఈ విభాగాల్లో రుణ వృద్ధి, ఎన్పీఏలు తగ్గడం, ఆదాయల పెరుగుదల వంటి అంశాలు ప్రధాన వృద్ధి చోదకాలుగా ఉంటాయి. -
పసిడి పరుగులు, బంగారు ఆభరణాల రిటైలర్ల ఆదాయం పైపైకి!
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల రిటైలర్ల ఆదాయం ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022–23) 12–15 శాతం మేర పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ బుధవారం తెలిపింది. ఇందుకు స్థిరమైన గిరాకీ, పసిడి అధిక ధర ఇందుకు కారణమవుతాయని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) 20–22 శాతం ఆదాయ అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. వార్షికంగా ఆదాయాలు తగ్గుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, 2021–22లో భారీ ఆదాయాల నమోదుకు మహమ్మారి ప్రారంభ దశ (2020–21) లో బేస్ ఎఫెక్ట్ కారణమని తెలిపింది. క్రిసిల్ రేటింగ్స్ ఇస్తున్న 82 సంస్థల పనితీరు ఆధారంగా నివేదిక రూపొందింది. ఈ రంగ మొత్తం ఆదాయంలో వీటి వాటా 40 శాతం. క్రిసిల్ నివేదికలోని మరికొన్ని అంశాలను పరిశీలిస్తే... ►ఆపరేటింగ్ మార్జిన్లు 2022–2023 ఆర్థిక సంవత్సరంలో వార్షికంగా 50–70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శౠం) 7.3–7.5 శాతం శ్రేణిలో మెరుగుపడతాయి. పెరిగిన బంగారం ధరలు, మెరుగైన నిర్వహణ వంటి అంశాలు దీనికి కారణం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాలు 12–15 శాతం పెరుగుతాయి. ఫలితంగా పరిశ్రమపై రుణ భారాలు తగ్గే వీలుంది. ►అధిక మూలధన వ్యయం, ఇన్వెంటరీలు ఉన్నప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవస్థీకృత ఆభరణాల సంస్థల క్రెడిట్ ఔట్‌లుక్‌ను ‘స్థిరంగా’ ఉంటుంది. ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల డిమాండ్ స్థిరంగా ఉంటుంది. డిమాండ్ పరిమాణం 8–10 శాతం వృద్ధి చెంది 600–650 టన్నుల మహమ్మారి ముందస్తు స్థాయిలకు చేరుకుంటుంది. కోవిడ్–19 అనంతరం వ్యాపార కార్యకలాపాలను మామూలు స్థితికి చేరుకుంటుండడం దీనికి ప్రధాన కారణం. ► డిమాండ్ స్థిరీకరణతో, వ్యాపార విస్తరణ విలువ వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 200–250 కోట్లు ఉంటుంది. తద్వారా ఈ పరిమాణం మహమ్మారి ముందస్తు స్థాయికి చేరుకుంటుంది. ► భారత్‌పై నాల్గవ వేవ్ సవాళ్లు తలెత్తడం, అలాగే సుంకాల పెంపు వంటి చర్యలు ఆభరణాల కొనుగోళ్లకు సంబంధించి వినియోగదారు ఆలోచనలో మార్పు తీసుకువస్తాయి. ► బంగారం అధిక దిగుమతులు భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) పెరగడానికి దారితీసే అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతం పైగా నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. -
దేశంలో వైట్ రివల్యూషన్.. రూ. 1.60 లక్షల కోట్లు
ముంబై: భారత్‌లో వ్యవస్థీకృత డెయిరీ పరిశ్రమ మార్చితో ముగిసే 2021–22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 12 శాతం పురోగమించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తాజా నివేదిక పేర్కొంది. విలువలో ఇది రూ.1.6 లక్షల కోట్లని విశ్లేషించింది. వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) డిమాండ్ రికవరీ కావడం, లిక్విడ్ పాల అమ్మకాలు స్థిరంగా ఉండడం, రిటైల్ ధరలో పెరుగుదల వంటి అంశాలు శ్వేత విప్లవ పురోగతికి కారణమని పేర్కొంది. నివేదిక ముఖ్యాంశాలను పరిశీలిస్తే... - కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పదేళ్ల కనిష్టం.. ఒక శాతం పడిపోయిన భారత వ్యవస్థీకృత డెయిరీ పరిశ్రమ ఆదాయాలు 2021–22లో మహమ్మారి ముందస్తు స్థాయికి క్రమంగా పరిశ్రమ కోలుకుంటున్నాయి. - వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) విభాగం వ్యవస్థీకృత రంగ విక్రయాలలో మూడింట ఒక వంతు వాటా కలిగి ఉంది. దీనితోపాటు ఈ రంగంలో దాదాపు మూడింట రెండు వంతుల వాటా ఉన్న లిక్విడ్ పాల విభాగానికి స్థిరమైన డిమాండ్ కొనసాగుతోంది. ఈ విభాగాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం (మహమ్మారి ముందు ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా) 5–6 శాతం వృద్ధి నమోదయ్యే వీలుంది. - నిర్వహణ లాభదాయకత 2020– 2021 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం ఉంది. వచ్చే రెండు రెండు ఆర్థిక సంవత్సరాలలో 5–5.5 శాతం శ్రేణిలో ఉండే వీలుంది. డెయిరీలు ఈ ఏడాది కేటగిరీల వారీగా రిటైల్ ఉత్పత్తుల ధరలను 3–4 శాతం పెంచడం, అధిక ముడి పాల ధరలు దీనికి కారణం. రవాణా, ప్యాకేజింగ్ వ్యయాలు పెరిగినప్పటికీ నిర్వాహణా లాభాలకు విఘాతం ఏర్పడదు. - మెరుగైన రాబడులు, వృద్ధి, స్థిరమైన నిర్వహణ లాభాలు, పటిష్ట బ్యాలెన్స్ షీట్ల వంటి అంశాలు డెయిరీ పరిశ్రమలకు ’స్థిరమైన’ క్రెడిట్ ఔట్లుక్ హోదా కల్పించే అవకాశం ఉంది. - నెయ్యి, వెన్న, జున్ను, పెరుగు వంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) కోసం డిమాండ్ భారీగా పెరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) పండుగలు, వివాహాల సీజన్, దేశ వ్యాప్తంగా వాణిజ్య సంస్థలు తిరిగి ప్రారంభమవడం వంటి అంశాలు ఈ విభాగాల్లో బలమైన పునరుద్ధరణకు కారణం. - వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) అమ్మకాల్లో 17 నుంచి 18 శాతం వృద్ధి నమోదయ్యే వీలుంది. కరోనా ఆంక్షల అనంతరం హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు (వ్యవస్థీకృత రంగాల విక్రయాలలో 20 శాతం వాటా) తిరిగి తెరుచుకోవడం, పండుగలు, వివాహ వేడుకలు, ఉపాధి కల్పన మెరుగుపడ్డం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. - కోవిడ్–19 రెండవ, మూడవ వేవ్‌ల ప్రభావం డెయిరీ పరిశ్రమపై ఎటువంటి భౌతిక ప్రభావం చూపలేదు. ఆంక్షలు స్థానిక స్థాయికి పరిమితం కావడం, ప్రత్యక్ష ఫుడ్–డెలివరీ సేవలు, తినుబండారాలు పని చేస్తూనే ఉండడం వంటి అంశాలు దీనికి కారణం. - 57 రేటెడ్ డెయిరీల క్రిసిల్ రేటింగ్స్ విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. వ్యవస్థీకృత సెగ్మెంట్ ద్వారా వస్తున్న రూ. లక్ష కోట్ల ఆదాయంలో ఈ 57 రేటెడ్ డెయిరీల వాటా దాదాపు 60 శాతం. చదవండి:భారీగా పామాయిల్ సాగు -
సామాన్యులకు షాక్.. మరింత పెరగనున్న టమాటా ధరలు
వంటగదిలోకి వెళ్లకమునుపే కూరగాయల ధరలు మంట పుట్టిస్తున్నాయి. టమాటా ధరలు అమాంతం పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు కూరగాయలు కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, టమాటా ధరలు ఇంకా రెండు నెలల పాటు పెరిగే అవకాశం ఉన్నట్లు క్రిసిల్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. వర్షాలు, దిగుమతి తగ్గడంతో టమాట ధరలకు రెక్కలు వచ్చాయి అని వివరించింది. టమాటా పండించే ప్రధాన ప్రాంతాలలో ఒకటైన కర్ణాటకలో పరిస్థితి చాలా "భయంకరంగా" ఉంది. ఆ రాష్ట్రం కూరగాయలను మహారాష్ట్ర నాసిక్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్-డిసెంబర్ కాలంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో టమాటా పంట చేతికి వస్తుంది. ఇప్పుడు సరిగ్గా సమయంలో అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నట్లు క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. నవంబర్ 25 నాటికి ధరలు 145 శాతం పెరిగాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో టమాటా పంట జనవరి వరకు మార్కెట్లకు చేరుకుంటుంది. అప్పటి వరకు టమోటా ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు క్రిసిల్ రీసెర్చ్ పేర్కొంది. ప్రస్తుతం టమాటా ధర హైదరాబాద్‌లో రూ.100కు చెరకుంది. ఇంకా మరో రెండు నెలల పాటు ధర 30 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉల్లిపాయ ధర కూడా మహారాష్ట్రలో కురిసిన అకాల వర్షాల కారణంగా 65 శాతం పెరగడానికి దారి తీసినట్లు నివేదిక తెలిపింది. అయితే, ఉల్లిపాయల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. (చదవండి: ‘టమాటా కొనాలంటే.. పాన్ కార్డు కావాలి’) -
బంగారం ఆభరణాల వర్తకులకు మరింత ఆదాయం
ముంబై: బంగారం ఆభరణాల విక్రయదారులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12–14 శాతం అధికంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. బంగారం ధరలు స్థిరంగా ఉండడానికితోడు వివాహాలు, పండుగల కోసం ఆభరణాలపై ఖర్చు చేయడం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. వరుసగా రెండు సంవత్సరాల క్షీణత తర్వాత ఆదాయంలో వృద్ధి ఉంటుందన్న అంచనాకు వచ్చింది. 2019–20, 2020–21 సంవత్సరాల్లో మూడు శాతం, ఎనిమిది శాతం చొప్పున ఆభరణాల విక్రేతల ఆదాయం క్షీణించినందున.. తక్కువ స్థాయిల నుంచి (లోబేస్) చూస్తే వృద్ధి మెరుగ్గా ఉండొచ్చని తన నివేదికలో పేర్కొంది. ‘‘2019 జూలైలో బడ్జెట్ సందర్భంగా బంగారం దిగుమతిపై సుంకాన్ని 12.5 శాతానికి పెంచడం డిమాండ్‌పై ప్రభావం చూపంచగా.. 2020–21లో కరోనా వల్ల విధించిన లాక్డౌన్లతో దుకాణాలు మూతపడి ఆదాయంపై ప్రభావం పడేలా చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంఘటిత ఆభరణాల వర్తకులకు తక్కువ దిగుమతి సుంకం వల్ల.. హాల్‌మార్క్ తప్పనిసరి చేయడం వల్ల ఆదాయం పెరగనుంది. అసంఘటిత రంగంలోని వారితో పోలిస్తే ఈ మార్పులు సంఘటిత రంగంలోని వారి పోటీతత్వాన్ని పెంచుతాయి’’ అని క్రిసిల్ పేర్కొంది. 2020–21లో క్రిసిల్ రేటింగ్ ఇచ్చిన 86 ఆభరణాల సంస్థల ఉమ్మడి ఆదాయం రూ.62,000 కోట్లుగా ఉండడం గమనార్హం. చదవండి: అంత బంగారాన్ని నోట్లో ఎలా దాచర్రా సామి..! -
మొండిబకాయిలు.. 10 లక్షల కోట్లు దాటిపోతాయ్!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండిబకాయిలు స్థూలంగా (జీఎన్‌పీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ముగిసే నాటికి రూ. 10 లక్షల కోట్లు దాటిపోతాయని ఇండస్ట్రీ బాడీ అసోచామ్, రేటింగ్స్ సంస్థ– క్రిసిల్ తన అధ్యయనంలో పేర్కొన్నాయి. రిటైల్‌తో పాటు, సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నుంచి మొండిబకాయిలు పెరిగే అవకాశం ఉందని అధ్యయన నివేదిక పేర్కొనడం కొంత ఆందోళన కలిగించే అంశం. ‘రీఎన్ఫోర్సింగ్ ది కోడ్’ శీర్షికన ఆవిష్కరించిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ►మార్చి 2022 నాటికి ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 8.5 శాతం నుంచి 9 శాతానికి పెరిగే అవకాశం ఉంది. దీనికితోడు పునర్వ్యవస్థీకరించిన కొన్ని అకౌంట్ల నుంచి సైతం ‘డిఫాల్ట్’లు చోటుచేసుకునే అవకాశం ఉంది. ►గత కొన్నేళ్ల క్రితం చోటుచేసుకున్న మొండిబకాయిల అకౌంట్లతో పోల్చితే ప్రస్తుత ధోరణి భిన్నంగా ఉంది. గతంలో ఎన్పీఏలు బడా కార్పొరేట్లకు చెందినవి అవి ఉండేవి. ఇప్పుడు ఎంఎస్ఎంఈ, రిటైల్ రంగాల్లో ఎన్పీఏలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడా కార్పొరేట్లకన్నా ఈ విభాగాల్లో ఎన్పీఏ సమస్యలు తీవ్రంగా ఉండవచ్చు. బడా కంపెనీల బ్యాలెన్స్‌షీట్స్ పటిష్ట మయ్యాయి. ►పెరగనున్న ఎన్పీఏ సమస్యలు దివాలా కోడ్ (ఐబీసీ) పటిష్టత, సామర్థ్యాలను పరీక్షకు నిలపనున్నాయి. మహమ్మారి సవాళ్ల నుంచి గట్టెక్కించడానికి ప్రకటించిన పలు విధానపరమైన చర్యలు వెనక్కు తీసుకునే అవకాశాలు ఉండడంతో కంపెనీలు దివాలా సమస్యలు కూడా తీవ్రం కానున్నాయి. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్‌తో పాటు, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల స్థూల ఎన్పీఏలు కూడా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ►బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2021–22లో పెరిగినప్పటికీ, 2018 మార్చి నాటి తీవ్రత ఉండకపోవచ్చు. ప్రభుత్వ నుంచి అందుతున్న పలు సహాయక చర్యలు దీనికి కారణం. ఆరు నెలల రుణ మారటోరియం, అత్యవసర రుణ హామీ పథకం, రుణ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ►భారత్ బ్యాంకుల్లో ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రిస్క్‌ను తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం ఇప్పుడు ఎంతో మెరుగుపడింది. ►గతంలో నిబంధనలు రుణదాతలకు అనుకూలంగా ఉండేవికావు. ఇది ప్రమోటర్లు ఉద్దేశపూర్వక మోసాలకు పాల్పడ్డానికి ఇవి దోహదం చేసేవి. దీనివల్లే అధిక సంఖ్యలో ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు తయారయ్యారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను కఠినతరం చేసింది. రిజల్యూషన్ ప్రణాళికలతో పాటు, ఐబీసీ ఫ్రేమ్‌వర్క్ ఎన్పీఏలను సమర్థవంతంగా రికవరీ చేసుకోడానికి దోహదపడుతోంది. -
Onion : ఉల్లిఘాటు.. ‘ముందే కొని పెట్టుకోండి’!
దేశవ్యాప్తంగా కురిసిన వర్షాల ఎఫెక్ట్ మరి కొద్ది రోజుల్లో వంటిల్లుని ఘాటెక్కించనుంది. రాబోయే రోజుల్లో ఉల్లి రేటు రెట్టింపు కావడం ఖాయమంటూ ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ క్రిసిల్ హెచ్చరించింది. నెలకు 13 లక్షల టన్నులు ఇండియాలో ప్రతి నెల సుమారు 13 లక్షల టన్నుల ఉల్లిపాయల వినియోగం జరగుతోంది. ఇందులో సగానికి పైగా పంట మహారాష్ట్ర నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోంది. మహారాష్ట్ర తర్వాత కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ఉల్లి ఎక్కువగానే పండిస్తున్నారను. అయితే తౌటౌ తుఫాను ఎఫెక్ట్‌తో మహారాష్ట్ర, కర్నాటకలలో ఉల్లి సాగు చేయడంలో ఆలస్యమైంది. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఉల్లి పంట చేతికందడం ఆలస్యం అవుతోందని క్రిసిల్ అభిప్రాయపడింది. ఖరీఫ్‌పై ప్రభావం దేశ ఉల్లి అవసరాల్లో 75 శాతం పంట ఖరీఫ్ సీజన్ నుంచే వస్తుంది. అయితే ఈ సీజన్‌కి సంబంధించిన ఉల్లి పంట చేతికి రావడానికి మరింత సమయం పట్టవచ్చని క్రిసిల్ చెబుతోంది. పంట చేతికి రావడం.. ప్రాసెసింగ్.. సరఫరా తదితర కారణాల వల్ల ఉల్లి మార్కెట్‌కి రావడానికి పట్టే సమయం పెరగవచ్చని చెబుతోంది. గత మూడేళ్లుగా ఉల్లి ఉత్పత్తి, సరఫరా, మార్కెట్ తదితర విషయాలను పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు రెట్టింపు కావడం ఖాయమని చెబుతోంది. రబీ పైనా ప్రభావం ఖరీఫ్ సీజన్ పంట చేతికి రావడంలో ఆలస్యమైనా రబీలో వచ్చిన ఉత్పత్తి బఫర్ స్టాక్‌గా అందుబాటులో ఉంటుంది. అయితే ఆగస్టు, సెప్టెంబరులో వర్షాల కారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉల్లి త్వరగా పాడవుతుంది. వెరసి బఫర్ స్టాక్ సైతం తగ్గిపోయే ప్రమాదంముందని క్రిసిల్ అంటోంది. నాసిక్‌లో కరువు మహారాష్ట్రలో విస్తారంగా వానలు పడినా ఉల్లిపంట ఎక్కువగా పండే నాసిక్‌లో గత మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉల్లి రైతులు క్రమంగా నర్సరీలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉల్లి దిగుబడి సైతం తగ్గనుందని క్రిసిల్ అంచనా వేసింది. మొత్తంగా దసరా, దీపావళి సీజన్ నాటికి ఉల్లి ధరలు పెరుగుతాయని చెబుతోంది. ఉల్లి ఉత్పత్తిలో తేడాలను ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృస్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. చదవండి : ఎమర్జెన్సీ ఫండ్స్.. ఈ అలవాటు మీకుందా? ఎలా మెయింటెన్ చేయాలో తెలుసుకోండి -
సెకెండ్ వేవ్‌లో వ్యాపార నష్టం అంతగా జరగలేదంట
ముంబై: కోవిడ్–19 ప్రతికూలతలతో తీవ్ర కష్టాల్లోకి వెళ్లిపోయి, రుణ పునర్ వ్యవస్థీకరణ తప్పదని భావించిన పలు కంపెనీలు ప్రస్తుతం తమ ధోరణిని మార్చుకుంటున్నాయని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంటున్నాయి.అదే సమయంలో మొదటి వేవ్‌తో పోల్చితే రెండవ వేవ్‌లో వ్యాపార నష్టం అంతగా జరగలేదని పలు కంపెనీల ప్రతినిధులు చెప్పినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం ఎకానమీలో రికవరీ జాడలు కనిపించడమే దీనికి కారణం. దీనితో ఆయా కంపెనీలపై వృద్ధి ధోరణిపై భరోసా ఏర్పడింది. దీనితో రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0కు కేవలం కొన్ని కంపెనీలే ముందుకు వస్తున్నాయి. తాను రేటింగ్ ఇచ్చిన 4,700 కంపెనీల్లో కేవలం ఒక శాతం అర్హత కలిగిన (రుణ పునర్వ్యవస్థీకరణకు) కంపెనీలు మాత్రమే రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0ను ఎంచుకున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ సుభోద్ రాయ్ నివేదికలో వివరించారు. మొదటి వేవ్‌తో పోల్చితే రెండవ వేవ్‌లో వ్యాపార నష్టం అంతగా జరగలేదని పలు కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. 2021 మే 5వ తేదీన ఆర్బీఐ రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వ్యక్తులు, చిన్న వ్యాపారులు, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల రుణ గ్రహీతలకు రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0ను ప్రకటించింది. పునర్వ్యవస్థీకరణ పరిమితిని రూ.25 కోట్లుగా నిర్ణయించింది. 2021 మార్చి 31న ప్రకటించిన తొలి ఫ్రేమ్‌వర్క్‌ను వినియోగించుకోని వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే జూన్ 4న రుణ పరిమితిని రూ.50 కోట్లకు పెంచింది. క్రిసిల్ రేటింగ్ ఇస్తున్న సంస్థల్లో 66 శాతం కంపెనీలు ఈ పరిధిలో ఉన్నాయి. అయితే అయితే కేవలం ఒకశాతం మాత్రమే పునర్వ్యవస్థీకరణను ఎంచుకుంటున్నల్లు క్రిసిల్ వివరించింది. వ్యాపార అవుట్‌లుక్ బాగుండడమే దీనికి కారణం. అయితే మూడవ వేవ్ వస్తే మాత్రం రుణ పునర్వ్యవస్థీకరణ 2.0ను ఎంచుకునే కంపెనీల సంఖ్య పెరుగుగుతుందని భావిస్తున్నట్లు క్రిసిల్ నివేదిక అభిప్రాయపడింది. చదవండి : జూలైలో జాబ్స్ పెరిగాయ్..రానున్న రోజుల్లో..! -
గోల్డ్ లోన్ కంపెనీలు జిగేల్!
సాక్షి,ముంబై: బంగారంపై రుణాలిస్తున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణలో ఉన్న ఆస్తులు 15-18 శాతం వృద్ధి సాధిస్తాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక వెల్లడించింది. వ్యక్తులు, చిరు వర్తకుల నుంచి గోల్డ్ లోన్ల డిమాండ్ ఇందుకు కారణమని తెలిపింది. నివేదిక ప్రకారం.. లాక్డౌన్ కారణంగా తక్కువ పంపిణీతో ఏప్రిల్-జూన్ కాలంలో బంగారంపై రుణాల వృద్ధి స్థిరంగా ఉంది. లాక్డౌన్ సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నాయి. దీంతో బంగారంపై రుణాలు అధికమవుతున్నాయి. వ్యక్తిగత అవసరాలతోపాటు వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు కావాల్సిన మూలధనం కోసం ఈ రుణాలను తీసుకుంటున్నారు. చిరుద్యోగులు, సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలు, వ్యాపారులకు ఇచ్చే రుణాల విషయంలో ఎన్బీఎఫ్సీలు, బ్యాంకులు పూచీకత్తు నిబంధనలు కఠినం చేశాయి. దీంతో వినియోగదార్లు గోల్డ్ లోన్లను ఎంచుకుంటున్నారు. పుత్తడిపై రుణాలిచ్చే కంపెనీలకే.. ఇతర లోన్లతో పోలిస్తే వసూళ్లు, పంపిణీ, తిరిగి తనఖా విషయంలో గోల్డ్ లోన్లు పెద్దగా సమస్యలను ఎదుర్కోలేదని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ క్రిష్ణన్ సీతారామన్ వెల్లడించారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు చాలామటుకు వసూళ్లు చేయలేకపోతున్నాయని, వీటికి రాని బాకీలు అధికమవుతాయని అన్నారు. దీంతో ఎంఎస్ఎంఈలకు కొత్త రుణాలు, తనఖా రహిత రుణాలు తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. తద్వారా పుత్తడిపై రుణాలిచ్చే కంపెనీలు ప్రయోజనం పొందుతాయని చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీల వద్ద తిరిగి తనఖా పెట్టి తీసుకున్న గోల్డ్ లోన్లతోసహా బంగారంపై రుణాల పంపిణీ వరుసగా సెప్టెంబరు త్రైమాసికంలో రెండింతలకు పైగా అధికమైంది. 12 నెలల కాలానికి తీసుకున్న రుణంలో 60-65 శాతం మొత్తాన్ని కస్టమర్లు ఆరు నెలల్లోనే తిరిగి చెల్లిస్తున్నారని క్రిసిల్ తెలిపింది. చాలా లోన్లు తక్కువ నిడివి ఉండడం, ముందస్తుగా చెల్లించే వెసులుబాటు, రిబేట్ల మూలంగా ఎన్బీఎఫ్సీలు అనుకూలమైన ఎంపిక అని వివరించింది. -
రూ. 22 వేల కోట్లకు డీటీహెచ్ ఆదాయాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాల కారణంగా ప్రజలు ఇంటిపట్టునే ఉంటుండటం డీటీహెచ్ సంస్థలకు లాభించనుంది. టీవీ ప్రసారాల వీక్షణ గణనీయంగా పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్–టు–హోమ్ బ్రాడ్కాస్టర్ల ఆదాయం 6 శాతం మేర వృద్ధి చెంది రూ. 22,000 కోట్లకు చేరనుంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. అయితే, ఆదాయం పెరిగినప్పటికీ వృద్ధి రేటు మాత్రం గత ఆర్థిక సంవత్సరం స్థాయిలో ఉండకపోవచ్చని పేర్కొంది. దేశీయంగా మొత్తం టీవీ సబ్‌స్క్రయిబర్స్‌లో డీటీహెచ్ వాటా 37 శాతం దాకా ఉంటుంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం వృద్ధి నమోదైంది. (ఐటీ ఆదాయ వృద్ధిపై కరోనా పడగ) ఇందులో 9 శాతం వాటా.. యూజర్ల సంఖ్య పెరగడం ద్వారా రాగా, ప్రతి యూజరుపై సగటు ఆదాయాలు (ఏఆర్పీయూ) పెరగడం వల్ల మరో 5 శాతం వచ్చిందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ సచిన్ గుప్తా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో యూజర్ల సంఖ్య మరో 6–7 శాతం పెరిగి 6.8 కోట్లకు చేరవచ్చని, తద్వారా ఆదాయ 4–6 శాతం మేర వృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. కానీ, బహుళ టీవీలున్న యూజర్లకు చార్జీలు తగ్గించడం తదితర అంశాల కారణంగా ఏఆర్పీయూ మాత్రం 1–2 శాతం మేర క్షీణించి రూ. 310–315 స్థాయికి రావచ్చని తెలిపారు. (రైలు ప్రయాణికులూ...ఇవి పాటించాలి..) దీపక్ ఫెర్టిలైజర్స్ రైట్స్ ఇష్యూ: రూ.133 న్యూఢిల్లీ: దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ రైట్స్ ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.133గా ఖరారు చేసింది. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.180 కోట్ల సమీకరణకు కంపెనీ ఈ ఏడాది మే నెలలో నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. ఇందుకు సంబంధించి నిబంధనలకు బోర్డు ఆమోదం తెలిపిందని, రూ.10 ముఖ విలువ కలిగిన షేరు రైట్స్ ఇష్యూ ధరగా రూ.133ను నిర్ణయించినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. రికార్డు తేదీగా సెప్టెంబర్17ను ఖరారు చేసింది. ఆ తేదీ నాటికి కంపెనీ వాటాలను కలిగిన వారు రైట్స్ ఇష్యూకు అర్హులవుతారు. ప్రతీ 20 షేర్లకు మూడు షేర్ల చొప్పున దరఖాస్తు చేసుకోవచ్చు. -
కొన్నేళ్ల కనిష్టానికి ఆటోమొబైల్ విక్రయాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆటోమొబైల్ పరిశ్రమలలో విక్రయాలు రెండంకెల స్థాయిలో క్షీణించనున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. ఇటీవల కోవిడ్-19 కారణంగా లాక్డౌన్ అమలు, పొడగింపుతో విక్రయాలు పడిపోయాయని వెల్లడించింది. మొత్తం అమ్మకాల పరిమాణం కొన్నేళ్ల కనిష్టానికి పడిపోనుంది. ప్రయాణికుల వాహనాలు(పీవీ), వాణిజ్య వాహనాల(సీవీ)విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా క్షీణించి 2010 ఆర్థిక సంవత్సరం కనిష్టానికి చేరవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. వాహనాల సగటు వినియోగం 58 శాతంనుంచి 50 శాతానికి క్షీణిస్తుందని తెలిపింది. పీవీ విభాగంలో సగటు వినియోగం 58 శాతం నుంచి 44 శాతానికి, ద్విచక్రవాహానాల వినియోగం 65శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇక ట్రాక్టర్ల వాడకం అయితే 59 శాతం నుంచి 51 శాతానికి క్షీణిస్తుందని, వాణిజ్య వాహనాల వినియోగం 51 శాతం నుంచి 39 క్షీణించవచ్చని క్రిసిల్ వివరించింది. లాక్‌డౌన్‌తో వేతనాల్లో కోత, ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉండడంతో వినియోగదారులు కొనుగోళ్లపై మొగ్గుచూపకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హిటల్ గాంధీ అన్నారు. వివిధ కంపెనీలు వ్యయ భారాలనుతగ్గించుకునేందుకు వేతనాలు, ఉద్యోగాల్లో కోతలు విధించడానికే మొగ్గు చూపుతున్నాయని, దీంతో వినియోగదారుల వద్ద సరిపడా నగదు ఉండదు. ఫలితంగా 60-70 శాతం ప్రజారవాణ వాహనాల కొనుగోళ్లు నిర్ణయాలు వాయిదా పడతాయన్నారు. మరోపక్క కొత్త యాక్సిల్ లోడ్ నిబంధనల ప్రభావంతో వాణిజ్య వాహనాల విక్రయాలు క్షీణిస్తున్నాయి. డిమాండ్ తక్కువగా ఉన్నంతకాలం రికవరీ కూడా అధికంగా ఉండే అవకాశం లేదని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహాన విక్రయాలు వేగంగా పుంజుకోవచ్చని క్రిసిల్ తెలిపింది. రుతుపవనాలు సకాలంలో వచ్చి, పంటలు బాగా పండడం వల్ల గ్రామీణ ఆర్థికం మెరుగపడి కొనుగోలు శక్తి పెరగడంతో ఈ వాహన విక్రయాలు జరుగుతాయని క్రిసిల్ పేర్కొంది. మార్కెట్లో 50 శాతం, ఆర్థికంగా 35-45 శాతం వాటా కలిగిన ద్విచక్ర వాహానాలు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి విక్రయాలు ఊపందుకుంటాయని తెలిపింది. -
అటో మొబైల్ అమ్మకాలో రెండంకెల క్షీణత: క్రిసిల్ రీసెర్చ్
దేశవ్యాప్త లాక్డౌన్ పొడగింపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటోమొబైల్ పరిశ్రమ రెండంకెల అమ్మకాల క్షీణతకు దారితీస్తుందని క్రిసిల్ రీసెర్చ్ శుక్రవారం తన నివేదికలో పేర్కోంది. పాసింజర్, కమర్షియల్ వాహన అమ్మకాలు 2010 ఆర్థిక సంవత్సర స్థాయికి దిగిరావడంతో మొత్తం అమ్మకాల పరిమాణం కొన్నేళ్ల కనిష్టాన్ని పడిపోయే అకాశం ఉందని రీసెర్చ్ సంస్థ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహన అమ్మకాలు 26-28శాతం, పాసింజన్ వాహనాల విక్రయాలు 24-26శాతం క్షీణించే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేసింది. అయితే ట్రాక్టర్ అమ్మకాలు క్షీణత మాత్రం స్వల్పంగా 7-9శాతంగా మాత్రమే ఉండొచ్చని క్రిసిల్ సంస్థ చెప్పుకొచ్చింది. లాక్డౌన్ విధింపు, పొడగింపులతో పట్టణ ఆదాయలు భారీ క్షీణించాయని క్రిసెల్ రీసెర్చ్ పర్సన్ హతల్ గాంధీ అభిప్రాయపడ్డారు. మొత్తం 26వేల కంపెనీలకు రూ.7లక్షల కోట్ల ఉద్యోగ వ్యయాలున్నట్లు మేము నిర్థారించామని, దీంతో అటో పరిశ్రమలో ఉద్యోగ నష్టాలు లేదా వేతన కోతలకు మరింత ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. సప్లై నుంచి మొదలైన కష్టాలు అతి తొందర్లో డిమాండ్‌కు వైపు విస్తరిస్తుందని క్రిసిల్ అంచనా వేసింది. ఉద్యోగ భయాలు, వేతనాల కోతతో వినియోగదారుల కొనుగోళ్ల సెంటిమెంట్ తగ్గిందని రీసెర్చ్ సంస్థ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసికంలో పండుగ సీజన్ సందర్భంగా డిమాండ్ కొంత రివకరీ అయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ద్వి-చక్ర వాహనాలకు అమ్మకాలు పెరగచ్చని పెరగవచ్చని క్రిసిల్ తెలిపింది. రబీ ఉత్పత్తులు పెరగచ్చనే అవుట్‌లుక్‌తో పాటు సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదు కావచ్చనే అంచనాలతో ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ట్రాక్టర్లకు డిమాండ్ పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. అయితే పాసింజర్, కమర్షియల్ వాహన విక్రయాలు నాలుగో త్రైమాసికంలో పెరగవచ్చని క్రిసిల్ తెలిపింది. -
క్యూ3లో కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి 2 శాతమే..
క్రిసిల్ రీసెర్చ్ అంచనాలు న్యూఢిల్లీ: పెట్టుబడుల డిమాండ్ బలహీనంగా ఉండటం, కమోడిటీల ధరలు పతనం కావడం తదితర పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ త్రైమాసికంలో బీఎఫ్ఎస్ఐ, ఆయిల్..గ్యాస్ కంపెనీలు మినహా ఇతర కార్పొరేట్ల ఆదాయాలు కేవలం 2 శాతం మాత్రమే వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ రీసెర్చ్ వెల్లడించింది. తక్కువ బేస్-ఎఫెక్ట్, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గుతుండటం తదితర అంశాలు కూడా దీనికి కారణం కాగలవని పేర్కొంది. క్రిత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కార్పొరేట్ల ఆదాయాలు 5 శాతం మేర పెరిగాయి. స్టాక్ ఎక్స్చేంజీ ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు 70 శాతం వాటా ఉన్న 600 కంపెనీల (ఫైనాన్షియల్, చమురు, గ్యాస్ సంస్థలను మినహాయించి) అధ్యయనం ఆధారంగా క్రిసిల్ రీసెర్చ్ ఈ నివేదిక రూపొందించింది. పట్టణ ప్రాంత వినియోగదారులపై ఆధారపడిన ఆటోమొబైల్స్, మీడియా, రిటైల్, టెలికం కంపెనీలు మెరుగ్గా రెండంకెల స్థాయి వృద్ధిని నమోదు చేయొచ్చని అందులో పేర్కొంది. అమెరికాకు ఎగుమతుల వృద్ధితో మధ్య స్థాయి ఫార్మా కంపెనీల పనితీరు కూడా మెరుగుపడొచ్చని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. అయితే, స్థూలంగా చూస్తే కార్పొరేట్ సంస్థలు బలహీన డిమాండ్ సెంటిమెంటుతో సమస్యలు ఎదుర్కొంటున్నాయని క్రిసిల్ రీసెర్చ్ సీనియర్ డెరైక్టర్ ప్రసాద్ కొపార్కర్ తెలిపారు. చెన్నైలో వరదలు సైతం ఐటీ, ఆటోమొబైల్ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వంటి రంగాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చన్నారు. -
కార్పొరే ట్ల ఆదాయ వృద్ధి అంతంతే
క్యూ2పై క్రిసిల్ అంచనా న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కార్పొరేట్ల ఆదాయాలు స్వల్పంగా 1.6 శాతమే పెరిగే అవకాశముందని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. అదే జరిగితే వరుసగా అయిదో క్వార్టర్లోనూ ఒక్క అంకె స్థాయి వృద్ధి మాత్రమే సాధించినట్లవుతుందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల నుంచి డిమాండ్ తక్కువగా ఉండటం, పెట్టుబడుల ఆధారిత రంగాలు బలహీనంగా ఉండటంతో పాటు అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు క్షీణించడం తదితర అంశాలు.. ఎగుమతి ఆధారిత రంగ సంస్థల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ క్వార్టర్లో కార్పొరేట్ల ఆదాయం గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 1.6 శాతం స్థాయిలోనే వృద్ధి చెందవచ్చని పేర్కొంది. నిర్వహణ లాభం వృద్ధి కేవలం 2 శాతం మేర ఉండొచ్చని తెలిపింది. 600 కంపెనీల (ఫైనాన్షియల్, చమురు..గ్యాస్ సంస్థలను మినహాయించి) పనితీరు అధ్యయనం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు క్రిసిల్ వివరించింది. ఎన్ఎస్ఈ మార్కెట్ విలువలో ఈ కంపెనీల వాటా దాదాపు 70 శాతం పైగా ఉంటుంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరిమితమే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మాత్రం కంపెనీల ఆదాయాలు మెరుగుపడొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. వినియోగం.. ప్రభుత్వ వ్యయాలు స్వల్పంగా పెరగడం, లో-బేస్ ఎఫెక్ట్ తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. అయినప్పటికీ.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం వృద్ధి ఒక అంకె స్థాయికే పరిమితం కావొచ్చని పేర్కొంది. ఎగుమతి ఆధారిత సంస్థల ఆదాయాలు మాత్రమే కాస్త మెరుగ్గా ఉండగలవని క్రిసిల్ వివరించింది. -
డీజిల్ ధరలపై త్వరలో నియంత్రణ ఎత్తివేత?
న్యూఢిల్లీ: డీజిల్ అమ్మకంపై నష్టం రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. డీజిల్ ఉత్పత్తి వ్యయం, విక్రయ ధరల మధ్య వ్యత్యాసం ఈ నెల తొలి పక్షంలో లీటరుకు రూ.2.80 ఉండగా, ఇప్పుడది రూ.1.62కు తగ్గిపోయింది. రూపాయి మారకం విలువ బలపడుతూ, లీటరు రేటును నెలకు 50 పైసల చొప్పున పెంచుతుంటే వచ్చే సెప్టెంబరుకల్లా డీజిల్ ధరలపై ఆంక్షలను ప్రభుత్వం తొలగించనుంది. ధరలను ప్రతినెలా స్వల్పంగా పెంచడం ద్వారా సబ్సిడీలను ఎత్తివేయాలన్న మునుపటి యుపీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ సర్కారు కొనసాగిస్తోంది. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 16 విడతల్లో లీటరు డీజిల్ ధరను రూ.10.12 పెంచారు. మే ద్వితీయార్థంతో పోలిస్తే ఈ నెల ప్రథమార్థంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గాయని అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెలలో మోడీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినపుడు లీటరుపై రూ.4.41 చొప్పున నష్టం వచ్చింది. పెట్రోలు ధరలపై కంట్రోలును 2010 నుంచి ఎత్తివేశారు. దీంతో ఉత్పత్తి వ్యయానికి తగ్గట్లుగా పెట్రోలు ధరలు ఉంటున్నాయి. డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై విక్రయిస్తున్నందువల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రస్తుతం రోజుకు రూ.249 కోట్లు నష్టం వస్తోంది. గత పక్షంలో ఇది రూ.262 కోట్లుగా ఉంది.