కేజీ ఉల్లి రూ.20 కే అందిస్తాం: టీ సర్కార్ | telangana government desides to sell onion at Rs.20 per one kg | Sakshi
Sakshi News home page

కేజీ ఉల్లి రూ.20 కే అందిస్తాం: టీ సర్కార్

Published Fri, Jul 31 2015 4:55 PM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

కేజీ ఉల్లి రూ.20 కే అందిస్తాం: టీ సర్కార్

కేజీ ఉల్లి రూ.20 కే అందిస్తాం: టీ సర్కార్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతున్నవేళ తెలంగాణ ప్రభుత్వం చల్లని కబురు చెప్పింది. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఒక కేజీ ఉల్లిగడ్డలను రూ. 20 కే అందించనున్నట్లు ప్రకటిచంది. ఉల్లి ధరల పెరుగుదలపై శుక్రవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బహిరంగ మార్గెట్ లో ఉల్లిగడ్డ ధర ఒక కిలోకు రూ. 40 గా ఉంది. కొన్ని చోట్ల ఇంతకు మించి కూడా ఉన్నట్లు తెలిసింది.


ఇందుకోసం మొత్తం 80 ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు వెలువడ్డాయి. హైదరాబాద్ లో 40 కేద్రాలు,  మిగతా జిల్లాల్లో మరో 40 ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఏపీలోని కర్నూలు, మహారాష్ట్రలోని నాసిక్ ల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement