
సాక్షి, చెన్నై: తమిళనాడు ఈరోడ్ జిల్లా గోపిషెట్టి పాళయమ్ సమీపంలో ఉన్న పారియూర్ కొండత్తు కాళియమ్మన్ ఆలయంలో ఆదివారం ఉత్సవాలు జరిగాయి. ఉత్సవ వేడుకల సందర్భంగా నంజకౌంటన్ పాళయమ్‌లో రజనీ అభిమానుల తరపున ఫ్లెక్సీ పెట్టారు. అదే ప్రాంతానికి చెందిన విజయ్ అభిమానులు రత్నవేల్ (27), ఇతని తమ్ముడు త్యాగు (25), సతీష్ (27). వీరు ముగ్గురు కలిసి రజినీ అభిమానులు జగదీషన్ (44), పళనిస్వామి (45)తో బ్యానర్ విషయంలో వాగ్వాదం ఏర్పడింది.
దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అప్పుడు సతీష్, రత్నవేల్, త్యాగు వీరు రజనీ అభిమానులు పెట్టిన ఫ్లెక్సీ కాల్చివేసి, జగదీషన్, పళణిస్వామిపై కత్తితో దాడి చేశారు. ఫిర్యాదు మేరకు, గోపిషెట్టి పాళయం పోలీసులు విజయ్ అభిమానులు రత్నవేల్, సతీష్, త్యాగును అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచి జైల్లో ఉంచారు.