Vijay fans
-
విజయ్ దేవరకొండ క్రిస్మస్ గిఫ్ట్.. వందమందికి పూర్తి ఉచితంగా..!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా 100 మందికి ఉచితంగా హాలిడే ట్రిప్‌ను స్పాన్సర్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి డెస్టినేషన్ ఎంపిక చేసేందుకు సాయం చేయాలంటూ ట్విటర్ వేదికగా అభిమానులను కోరాడు. స్టార్ హీరో తన అభిమానులు గమ్యాన్ని ఎంచుకోవడంలో సహాయ పడటానికి సోషల్ మీడియాలో దీనిపై పోల్ నిర్వహించారు. ట్విటర్లో విజయ్ రాస్తూ..- 'దేవరశాంత అనే సంప్రదాయాన్ని నేను 5 సంవత్సరాల క్రితం ప్రారంభించా. ఈ సంవత్సరం నాకు మంచి ఆలోచన ఉంది. నేను మీలో 100 మందిని అన్ని ఖర్చులు భరించి హాలిడే ట్రిప్‌కు పంపుతున్నా. డెస్టినేషన్ ఎంపికలో నాకు సహాయం చేయండి.' అంటూ ప్రకటించారు. విజయ్ తన ఫ్యాన్స్ డెస్టినేషన్ ఎంపిక చేసేందుకు భారతదేశంలోని పర్వతాలు, బీచ్‌లు, ఇండియా సాంస్కృతిక పర్యటన, ఇండియాలోని ఎడారి అంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. అయితే విజయ్ ఈ సంప్రదాయాన్ని ఐదేళ్ల క్రితమే ప్రారంభించినట్లు తెలిపారు. మొదటి ఏడాదిలో మాసబ్ ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీని సందర్శించాడు. ఆ తర్వాత సోషల్ మీడియా 50 మంది ఫాలోవర్స్‌ను ఎంపిక చేసి వారికి ప్రత్యేక బహుమతులు అందించారు. గతేడాది 100 మంది విజేతలకు క్రిస్మస్ కానుకగా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున బహుమతులు అందజేసినట్లు ఆయన ప్రకటించారు. కాగా.. విజయ్ చివరిసారిగా పాన్-ఇండియా చిత్రం 'లైగర్'లో కనిపించాడు. ఇది అతని బాలీవుడ్ అరంగేట్రం చేసినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ప్రస్తుతం సమంత రూత్ ప్రభుతో కలిసి 'ఖుషి' చిత్రంలో నటిస్తున్నారు. #Deverasanta, a tradition I started 5 years ago. This year I have the nicest idea so far :) I am going to send 100 of you on an all-expense paid holiday. Help me in choosing the destination. #Deverasanta2022https://t.co/iFl7mj6J6v — Vijay Deverakonda (@TheDeverakonda) December 25, 2022 -
కోతుల కోసం విజయ్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండరు..
చెన్నై : కరోనా సెకండ్ వేవ్ కారణంగా సామాన్య ప్రజలే కాదు..జంతువులు కూడా అల్లాడిపోతున్నాయి. సరైన ఆహారం అందక విలవిల్లాడిపోతున్నాయి. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు జంతువులు, పక్షుల సంరక్షణకు జాగ్రత్తలు వహించాలని సోషల్ మీడియా వేదికగా విఙ్ఞప్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు చేసిన ఓ మంచి పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..దళపతి విజయ్ విజయ్ అభిమాన సంఘం మక్కల్ ఇయక్కం అనే పేరుతో తమిళనాడులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పుదుకోట్టై ప్రాంతంలో కోతుల కోసం ఓ వాటర్ ట్యాంక్ సహా అరటిపళ్లను ఏర్పాటు చేశారు. పుదుకోట్టై హనుమాన్ టెంపుల్‌కి సమీపంలో దాదాపు 300 కోతులు ఉన్నాయని, అయితే లాక్డౌన్ కారణంగా భక్తులు లేక కోతులకు ఆహారం అందడం లేదని సమాచారం. అంతేకాకుండా ఇదే ప్రాంతానికి దగ్గర్లో ఓ అటవీ ప్రాంతం ఉందని, అయితే వేసవి కావడంతో కోతులకు నీటి సదుపాయం లేక అల్లాడిపోతున్నాయని, అందుకే కోతుల కోసం ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. చదవండి : కరోనా విలయ తాండవం.. తళపతి విజయ్ ఔదార్యం కొంతమందిని కోల్పోయా: సోనూసూద్ భావోద్వేగం -
‘మా హీరోకి రాజకీయాలపై ఆసక్తి ఉంది’
తమిళసినిమా: తమిళనాడులో దాదాపు సినీ నటులే ప్రభుత్వాన్ని పాలించారు. తాజాగా నట దిగ్గజాలు కమలహాసన్, రజనీకాంత్ సొంతంగా రాజకీ య పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ 234 నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తుందని రజనీ ఇప్పటికే వెల్లడించారు. కమలహాసన్ ఈ నెల 21న పార్టీ పేరు, జెండా, అజెండానూ వెల్లడించి భారీ బహిరంగ సమావేశంతో ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. మరో పక్క నేను సైతం అన్నట్లు విశాల్ తన చేతలతో రాజకీయ ప్రవేవం చేయనున్నట్టు చెప్పకనే చెబుతున్నారు. వీరందరి కంటే ముందే నటుడు విజయ్ రాజకీయాలపై ఆసక్తి కనబరచారన్నది నిజం. అందుకు తన అభిమాన సంఘాన్ని ప్రజాసంఘంగా మార్చా రు కూడా. తద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఆయన తండ్రి దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ తన కొడుకు రాజకీయాల్లో వస్తారని చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. విజయ్ నటించిన పలు చిత్రాలు విడుదల సమయంలో రాజకీయ సమస్యలను ఎదుర్కొన్నాయి. అందుకు కారణం విజయ్ను రాజకీయాల్లోకి రానీయకుండా అణగదొక్కలన్నదే అనే ప్రచారం సాగింది. అయితే ఇటీవల విజయ్ రాజకీయాల మాట ఎత్తడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీ, కమల్ అభిమానులు ఎవరి పరిధిలో వారు ప్రజలను తమ పార్టీ సభ్యులుగా చేర్చుకునే పనిలో మునిగిపోయారు. ఈ సెగ విజయ్ అభిమానుల్లోనూ తగిలింది. విజయ్ ప్రజా సంఘం పేరుతో నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించి తద్వారా ప్రజలను సభ్యులుగా చేర్చే పనికి అభిమానులు శ్రీకారం చుట్టారట. దీని గురించి విజయ్ అభిమాన సంఘం నిర్వాహకుడు ఒకరు మాట్లాడుతూ తమ హీరోకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, ఎప్పుడైనా రాజకీయరంగ ప్రవేశం గురించి వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు. అందుకే తాము సభ్యత్య నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టామని అన్నారు. -
రజనీ ఫ్యాన్స్‌పై కత్తిదూసిన విజయ్ ఫ్యాన్స్
సాక్షి, చెన్నై: తమిళనాడు ఈరోడ్ జిల్లా గోపిషెట్టి పాళయమ్ సమీపంలో ఉన్న పారియూర్ కొండత్తు కాళియమ్మన్ ఆలయంలో ఆదివారం ఉత్సవాలు జరిగాయి. ఉత్సవ వేడుకల సందర్భంగా నంజకౌంటన్ పాళయమ్లో రజనీ అభిమానుల తరపున ఫ్లెక్సీ పెట్టారు. అదే ప్రాంతానికి చెందిన విజయ్ అభిమానులు రత్నవేల్ (27), ఇతని తమ్ముడు త్యాగు (25), సతీష్ (27). వీరు ముగ్గురు కలిసి రజినీ అభిమానులు జగదీషన్ (44), పళనిస్వామి (45)తో బ్యానర్ విషయంలో వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అప్పుడు సతీష్, రత్నవేల్, త్యాగు వీరు రజనీ అభిమానులు పెట్టిన ఫ్లెక్సీ కాల్చివేసి, జగదీషన్, పళణిస్వామిపై కత్తితో దాడి చేశారు. ఫిర్యాదు మేరకు, గోపిషెట్టి పాళయం పోలీసులు విజయ్ అభిమానులు రత్నవేల్, సతీష్, త్యాగును అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచి జైల్లో ఉంచారు. -
కటౌట్లకు కూల్‌డ్రింకులతో అభిషేకం!
తమిళనాడులో సినిమా అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. గురువారం విజయ్ హీరోగా విడుదలైన 'తేరి' సినిమా విడుదల సందర్భంగా ఈ అభిమానం కొత్త పుంతలు తొక్కింది. ప్రతిసారీ హీరోల కటౌట్లకు పాలతో అభిషేకాలు చేసే అభిమానులు.. ఈసారి వెరైటీగా ఫాంటా, కోకా కోలా లాంటి కూల్‌డ్రింకులతో అభిషేకం చేశారు. ఇక ఉదయం 8 గంటలకు ప్రదర్శించిన మొదటి ఆటకు టికెట్లను రూ. 700 వరకు బ్లాక్‌లో అమ్మారట. సినిమాకు వచ్చినవాళ్లందరికీ ఉచితంగా స్టీలు గ్లాసు, ఒక లడ్డూ, మంచ్ చాక్లెట్ ఇచ్చారు. ఈసారి తమిళనాడులో పాలాభిషేకాలు చేయొద్దని చెప్పడంతో.. ఫాంటా, కోకా కోలా లాంటి కూల్డ్రింకులతోనే అభిషేకాలు చేసేశారట. ఓ అభిమాని పొరపాటున పాలు అనుకుని పెరుగు ప్యాకెట్ తెచ్చాడు. అతడిని మాత్రం ఆ పెరుగుతో అభిషేకం చేయనివ్వలేదు. మరో వీరాభిమాని ఏకంగా కటౌట్మీద బీరు పోయాలని ప్రయత్నించినా, పోలీసులు అతడిని అడ్డుకున్నారు. ఇక థియేటర్ లోపల అయితే అభిమానులు తమ సీట్లలో కూర్చోవడం మానేసి, తెరముందు డాన్సులు వేస్తుండటంతో వాళ్లను కూర్చోబెట్టడం పోలీసులకు తలకు మించిన భారం అయ్యింది. ఇంటర్వెల్ సమయంలో కూడా సినిమా గురించి ట్వీట్లు, మెసేజిలు పంపుతూ బిజీబిజీగా కనిపించారు. -
పులి రచ్చ
తమిళసినిమా: విజయ్ నటించిన తాజా చిత్రం పులి.ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. అయితే అనుకున్న సమయానికి థియేటర్లలో బొమ్మ పడకపోవడంతో అభిమానుల ఆందోళనతో పులి వ్యవహారం రచ్చరచ్చగా మారింది.పులి చిత్రం అక్టోబర్ ఒకటవ తేదీన విడుదలవుతుందని ప్రకటించడంతో విజయ్ అభిమానులు ఆనందోత్సాహాలకు గురయ్యారు.రాష్ట్రలోని ఇళయదళపతి అభిమానులందరూ గురువారం అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రదర్శనలు చూడటానికి టిక్కెట్లు కొనుక్కుని అంతకు ముందే థియేటర్ల ముందు ఆత్రుతగా చేరిపోయారు.త మ అభిమాన నటుడి చిత్రాన్ని తొలి రోజు తొలి షోను చూడబోతున్నామన్న ఆనందంలో మునిగిపోయారు. అయితే వారి సంతోషంపై పోలీసులు నీళ్ళు చల్లారు.పులి చిత్రానికి ప్రత్యేక షోలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకట్ట వేయడంతో అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది. తమిళనాడులోని పలు థియేటర్ల వద్ద అభిమానులుఆందోళనలకు దిగారు.పోలీసులు అడ్డకోవడంతో పరిస్థితి ఉద్రిక్తకకు దారి తీసింది.కొన్ని చోట్ల థియేటర్ల యాజమాన్యం టికెట్ల ధరను తిరిగి చెల్లించడానికి సిద్ధపడ్డా అదనంగా డబ్బు చెల్లించాలంటూ అభిమానులు గొడవకు దిగారు. పులి చిత్రం గురువారం విడుదల కావలసి వుండగా ఫైనాన్సియర్ సమస్యతో విడుదల ఆలస్యమైంది. ఇద్దరు అభిమానులు బలి : కాగా పులి చిత్ర ప్రచారంలో పాల్గొన్న విజయ్ అభిమానులు ఇద్దరు లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తాంబరం సమీపంలోని మణిమంగళం కు చెందిన సౌందర్‌రాజన్ (22), ఉదయకుమార్ (23)లు విజయ్ వీరాభిమానులు. పులి చిత్రం విడుదల కానుండటంతో బుదవారం అర్ధరాత్రి మోటార్‌బైక్‌లో మణమంగళం,కరసంగాల్ పరిసర ప్రాంతాలలో పులి చిత్ర పోస్టర్లు అంటిస్తూ ప్రచారం చేశారు.అలా వండలూర్,వాలాజా రోడ్డులో బైక్ మీద వెళుతుండగా వెనకగా వచ్చిన లారీ ఢీకొంది. దాంతో ఆ అభిమానులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.లారీ డ్రైవర్ పరారయ్యారు.మణిమంగళం పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని మృతుల శవాలను పోస్టుమార్టం కోసం శ్రీ పెరంబత్తూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.