‘ప్రజల సొమ్ముతో బాబు సోకులు పడుతున్నాడు’ | Pydikondala Manikyala Rao Fires On Chandrababu Naidu Over Modi Visit To AP | Sakshi
Sakshi News home page

‘ప్రజల సొమ్ముతో బాబు సోకులు పడుతున్నాడు’

Published Sat, Feb 9 2019 8:52 PM | Last Updated on Sat, Feb 9 2019 9:01 PM

Pydikondala Manikyala Rao Fires On Chandrababu Naidu Over Modi Visit To AP - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తూ.. మోదీ సభను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ మాజీ ఎంపీ పైడికొండల మాణిక్యాల రావు ధ్వజమెత్తారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా, రాష్ట్రవ్యాప్తంగా ‘నో ఎంట్రీ మోదీ’, ‘గో బ్యాక్‌ మోదీ’ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ సభను అడ్డుకోవడానికి చంద్రబాబు ఆర్టీసీ, ఆటో యూనియన్లను వాడుకుంటున్నారని ఆరోపించారు.

ఈ నెల 11న ఢిల్లీలో చంద్రబాబు చేయబోయే ధర్మపోరాట దీక్షకు జనాలను తరలించడానికి.. ఇప్పటికే రెండు రైళ్లకు రూ.1.12 కోట్లు మంజూరు చేశారని మండిపడ్డారు. ప్రజా ధనంతో ఆర్టీసీ ద్వారా 7 నక్షత్రాల బస్సు కొనిపించుకున్న చంద్రబాబు.. సామన్య బస్సుగా ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టార్జితంతో చంద్రబాబు సోకులు పడుతున్నారంటూ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement