
విజయవాడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
విజయవాడ: తెలుగు దేశం పార్టీ(టీడీపీ)ని తీవ్రంగా విమర్శిస్తూ విజయవాడ నగరంలో ఓ జనసేన ఫ్లెక్సీ బుధవారం వెలిసింది. టీడీపీపై ఉన్న వ్యతిరేకతను ఫ్లెక్సీల ద్వారా జనసేన కార్యకర్తలు ప్రదర్శించారు. ‘ పిచ్చి ముదిరిన పచ్చ పురాణం.. ఏం తమ్ముళ్లు వేధిస్తుందా..ఓటమి భయం, గుర్తుస్తోందా.. దశాబ్ధ ప్రతిపక్ష కాలం..!’ అంటూ ఫ్లెక్సీలో టీడీపీకి పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. 2009లో బెజవాడ గడ్డ మీద మీరు(చంద్రబాబు) జీరో..2014లో ఎలా అయ్యారు హీరో అని ప్రశ్నించారు.
మీ నాయకుడి తంత్ర ఫలమా..? మా నాయకుడి కాళ్లు మొక్కిన ఫలమా..? అని తీవ్రంగా దుయ్యబట్టారు. 2019 ఓటమి భయంతోనే కాంగ్రెస్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఎల్లోమీడియాను కూడా ఫ్లెక్సీలో తీవ్రంగా విమర్శించారు. 2019లో టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పకపోతే తాము జనసైనికులమే కాదని సవాల్ విసిరారు. తెలుగు తమ్ముళ్లూ గోదావరిలో మొదలైంది మీకు కౌంట్‌డౌన్ అంటూ అమరావతి జనసేన పార్టీ అధికార ప్రతినిధి మండలి రాజేష్ పేరిట ఫ్లెక్సీ వెలిసింది.
రెండు మూడు రోజుల కిందట జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా విమర్శిస్తూ టీడీపీ నాయకులు కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానికి కౌంటర్ గానే జనసైనికులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ తెలుగు దేశం నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
Comments
Please login to add a commentAdd a comment