ఫ్లెక్సీ వివాదంపై వైఎస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదు | ysrcp leaders complaint to sp on flexi issue in west godavari | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీ వివాదంపై వైఎస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదు

Published Thu, Nov 3 2016 1:20 PM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM

ఫ్లెక్సీ వివాదంపై వైఎస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదు - Sakshi

ఫ్లెక్సీ వివాదంపై వైఎస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదు

తాడేపల్లిగూడెం: దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేరిట ఇటీవల ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. వాటికి పోలీసులను రెండు షిఫ్టుల్లో కాపలా పెట్టారు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయబోగా.. మంత్రి, ఆయన అనుచరులు అడ్డుకుని దాడులకు పాల్పడ్డ విషయం తెలిసిందే.

ఈ ఫ్లెక్సీల వివాదంపై పశ్చిమగోదావరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్యే మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, కారుమురి నాగేశ్వరరావు, ఉంగుటూరు కన్వినర్ పుప్పాల వాసుబాబు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదుచేశారు. ఫ్లెక్సీల వివాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీని ఎస్పీకి అందజేశారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణపై అక్రమంగా హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారని.. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ నేతలు ఎస్పీని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement