జనసేన కార్యకర్తల అరాచకం | Janasena Activist Destroyed YSRCP Ganesh Chaturthi Flexi In West Godavari | Sakshi
Sakshi News home page

జనసేన కార్యకర్తల అరాచకం

Published Wed, Sep 4 2019 9:29 AM | Last Updated on Wed, Sep 4 2019 9:30 AM

Janasena Activist Destroyed YSRCP Ganesh Chaturthi Flexi In West Godavari - Sakshi

వీరవాసరంలో ఫ్లెక్సీలను చించిన దృశ్యం

సాక్షి, పశ్చిమగోదావరి : వీరవాసరంలో జనసేన కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారు. వీరవాసరంలో వినాయకచవితి సందర్భంగా గ్రామానికి చెందిన నూకల కనకారావు, మద్దాల సత్యనారాయణమూర్తి, నూకల కిరణ్, కందుల సురేష్‌ తదితరులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తదితరులతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీరవాసరం ఎస్‌బీహెచ్‌ సమీపంలో ఉన్న ఫ్లెక్సీని జనసేన కార్యకర్తలు బ్లేడ్లతో కోసి ధ్వంసం చేశారు. ఎన్నికల సమయంలోనూ జనసేన కార్యకర్తలు ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు.

పవన్‌  కల్యాణ్‌ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని మోటార్‌ సైకిళ్ల సైలెన్సర్లు తీసి గట్టిగా కేకలు వేస్తూ, మనుషులపైకి దూసుకెళ్తూ ర్యాలీలు నిర్వహించారు. జన సైనికులు,  కార్యకర్తలు చేస్తున్న ధ్వనికాలుష్యం, ఫ్లెక్సీ ధ్వంసం వంటి కార్యక్రమాలపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీని బ్లేడ్లతో కోసి ధ్వంసం చేయడంపై మండల వైఎస్సార్‌సీపీ శ్రేణులు వీరవాసరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. బాధ్యులను గుర్తించి విచారణ చేపడతామని వీరవాసరం ఎస్సై బి.మహేశ్వరరావు తెలిపారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement