మీరు బిగుసుకుపోయి ఉంటారా...? | Are you stupid ...? | Sakshi
Sakshi News home page

మీరు బిగుసుకుపోయి ఉంటారా...?

Published Thu, Jun 29 2017 12:00 AM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM

మీరు బిగుసుకుపోయి ఉంటారా...? - Sakshi

మీరు బిగుసుకుపోయి ఉంటారా...?

సెల్ఫ్‌ చెక్‌

ప్రతికూల ఫలితాన్ని కొందరు తేలికగా తీసుకుంటే, మరికొందరు సీరియస్‌గా తీసుకుంటారు. ప్రత్యేకంగా ఉండాలనుకోవటం, బాగా పేరు తెచ్చుకోవాలనుకోవటం, ప్రయత్నించిన మొదటిసారే విజయాన్ని చేరుకోవాలనుకోవటం. ఇలా తమను తామే స్ట్రిక్ట్‌గా మలచుకుంటారు కొందరు. ఇక్కడ బాధ్యతలను విస్మరించమని చెప్పే ఉద్దేశం కాదు కాని అనవసరంగా టెన్షన్‌ పడకుండా ఉండటం అవసరం. మీరెలా ఉంటారు? ఫ్లెక్సిబుల్‌గా కాకుండా బిగుసుకుపోయి స్టిఫ్‌గా ఉంటారా?

1.    నిర్ణయాలు మార్చుకోవలసి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీలవుతారు (ఉద్యోగవ్యవహారాలు మొదలైనవి).
ఎ. కాదు     బి. అవును

2.    అతి శుభ్రత పాటించాలనుకుంటారు.
 ఎ. కాదు     బి. అవును

3.    అంతగా ప్రాధాన్యం లేని  పనులకు కూడ చాలా ప్రాధాన్యత ఇస్తారు.
ఎ. కాదు     బి. అవును

4.    మీరనుకున్న పనులు  పూర్తిచేయలేకపోతే (సమయం ఉన్నా  కూడ) హడావిడి పడతారు.
ఎ. కాదు     బి. అవును

5.    ఏదైనా కార్యక్రమం  మీరు ఊహించిన విధంగా జరగకపోతే అప్‌సెట్‌ అవుతారు.
 ఎ. కాదు     బి. అవును

6.    మిమ్మల్ని ఎవరైనా అవసరానికి ఉపయోగించుకంటే (అడ్వాన్‌టేజ్‌) మనశ్శాంతి కోల్పోతారు.
ఎ. కాదు     బి. అవును

7.    మీదగ్గర నుంచి ఇతరులు తీసుకున్న వస్తువులు సకాలంలో ఇవ్వకపోతే చాలా పెద్ద సీన్‌ చేస్తారు.
 ఎ. కాదు     బి. అవును

8.    ప్రతికూల పరిస్థితుల్లో కూడ మీ విధిని కాసేపు పక్కన పెట్టటం మీకు నచ్చదు.
ఎ. కాదు     బి. అవును

9.    ఏదైనా తీసుకోవటమేకాని, ఇచ్చే మనస్తత్వం మీది కాదు.
ఎ. కాదు     బి. అవును

10.    జరిగిపోయిన విషయాల గురించి పదేపదే ఆలోచిస్తారు.
ఎ. కాదు     బి. అవును

‘బి’ లు ఏడు దాటితే అవసరంలేనిదానికన్నా ఎక్కువగా స్పందించే తత్వం మీలో ఉంటుంది. దీనివల్ల ఎప్పుడూ టెన్షన్‌తో ఉంటారు. మీ చర్యలే మీకు విశ్రాంతిలేకుండా చేస్తుంటాయి. ‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కువగా వస్తే మీలో ఫ్లెక్సిబులిటీ ఉంటుంది. పరిస్థితులకు తగినట్లు స్పందించటం వల్ల ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement