
మలక్‌పేట పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మలక్‌పేటలోని నల్లగొండ చౌరస్తాలోని దివ్యాంగుల సహకార సంస్థ ఆవరణలో దివ్యాంగుల జాతీయ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో శుక్రవారం పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక నేతలు ఫ్లెక్సీలు పెట్టారు.
అయితే ఫ్లెక్సీలు పెట్టడంపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు స్థానిక కార్పొరేటర్ సునీతా రెడ్డికి రూ. 50 వేలు, నేతలు అస్లాం, నివాస్‌లకు ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున జరిమానా విధించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. ఫ్లెక్సీల నిషేదం ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు.