ఆ సీఐ సంగతి చూస్తా.. | Minister Pydikondala Manikyala Rao Fire on police officer | Sakshi
Sakshi News home page

ఆ సీఐ సంగతి చూస్తా..

Published Fri, Oct 21 2016 12:47 AM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM

ఆ సీఐ సంగతి చూస్తా.. - Sakshi

ఆ సీఐ సంగతి చూస్తా..

► తాడేపల్లిగూడెంలో మంత్రి మాణిక్యాలరావు బూతు పురాణం
► ఫ్లెక్సీ వివాదంలో ఇదీ తీరు

 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఓ సీఐ సంగతి తేలుస్తానంటూ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు  తాడేపల్లి గూడెంలో బూతు పురాణానికి పాల్పడి విమర్శలపాలయ్యారు. అసభ్య పదజాలం తో విరుచుకుపడ్డారు. తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం తెల్లవారు జామున వైఎ స్సార్‌సీపీ, బీజేపీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విషయమై వివాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పుట్టిన రోజు కావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బస్టాండ్ సమీపంలో  ఫ్లెక్సీ పెట్టారు. దీనిపై బీజేపీ నేతలు వారితో ఘర్షణకు దిగారు.
 
 కాసేపటికి అక్కడకు చేరుకున్న మంత్రి మాణిక్యాలరావు కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావుపై విరుచుకుపడ్డా రు. వివాదం ముదరడానికి స్థానిక సీఐ చేతకాని తనమే కారణమంటూ బూతు పురా ణం అందుకున్నారు. ‘నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడా. వాడి సంగతి చూస్తా’ అంటూ రెచ్చిపోయారు. ఆ సీఐపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని, తక్షణమే ఆయన్ని సస్పెండ్ చేయాలన్నారు.కాగా మంత్రి ఆదేశాల నేపథ్యంలో పోలీసులు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement