
చిట్యాల: ఎలికట్టెలో ఇంటి మెట్లపై వాలిన ఈగలు ,అన్నంపై వాలిన ఈగలు
‘ఈగ’ సినిమా ఇతివృత్తం ఏమిటి ? ప్రతీకారేచ్ఛతో రగిలిపోయి విలన్‌పై కక్ష తీర్చుకోవడం. ఒక మనిషిని నానా తిప్పలు పెట్టి ‘ఈగ’ను చూస్తేనే జడుసుకుని చచ్చేలా ప్రవర్తిస్తుంది. ఒక ఈగ చుట్టూ అల్లిన ఈ కథ ఔరా అనిపించక మానదు. అదే లక్షలాది ఈగలు ఒక గ్రామం మీద దాడి చేస్తే..? గ్రామంలోని చిన్నా పెద్దా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఈగల బారిన పడితే వారి ఆందోళన అంతా ఇంతా కాదు. అసలు ఒక గ్రామం మీద ఇన్ని ఈగలు ఎలా దాడి చేస్తున్నాయి? పంట పొలాలు మొదలు, తినే భోజనం, తాగునీరు.. అన్నీ ఈగలమయం అయితే .. సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ కథనం చదివితే తెలుస్తుంది..!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : చిట్యాల మండలం ఎలికట్టె గ్రామం. ఒక్కసారిగా ఎగిరొచ్చి వాలిపోతున్న ఈగలు ఆ గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఊరికి కిలోమీటరు దూరంలో సుమారు డెబ్బై ఎకరాల్లో నెలకొల్పిన పౌల్ట్రీ ఫామ్స్‌తో ఈ సమస్య తలెత్తిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. 18 షెడ్లలో ఏర్పాటు చేసిన బాయిలర్ పౌల్ట్రీ ఫామ్స్‌లో గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో సుమారు పది లక్షల కోళ్లను పెంచుతున్నారు. ఈ కోళ్లకు వేసే దాణాతోపాటు ఫామ్స్‌లో వ్యర్థాలతో ఈగలు వృద్ధి చెందాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఈగలు పుట్టుకురావడంతో అదే స్థాయిలో గ్రామ ప్రజలను అనారోగ్యం కూడా వెదుక్కుంటూ వచ్చింది. ఎలికట్టెలో అత్యధిక గౌడ కులస్తులు కులవృత్తి కల్లుగీతపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరు తీసే కల్లు ఈగలతో నిండిపోయి ఎవరూ తాగలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి జీవనభృతికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ కోళ్ల ఫామ్స్ ఏర్పాటుతో మొదలైన ఈగల సమస్య ఎలికట్టెతో పాటు మునుగోడు మండలంలోని రత్తిపల్లి, ఊకొండి గ్రామాలనూ సతాయిస్తోంది. వీటి నివారణ చేపట్టాలని ఎలికట్టె గ్రామ ప్రజలు గడిచిన మూడు నెలలుగా విడత విడతలుగా ఆందోళన చేపట్టారు. కలెక్టర్, డీహెచ్‌ఎంఓ, ఎంపీడీఓలకు ఫిర్యాదు చేశారు. ఈనెల 19వ తేదీన ఎలికట్టె గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఎలికట్టె, రత్తిపల్లి, ఊకొండి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సరైన అనుమతులు పొందకుండానే కోళ్ల ఫామ్‌ను నిర్మించారని, నిబంధనలకూ నీళ్లొదిలారన్నది గ్రామ ప్రజల ప్రధాన అభియోగం.
నిద్రనటిస్తున్న యాజమాన్యం !
గ్రామం మొత్తం వ్యాపించిన ఈగలతో స్థానికులు సతమతమవుతున్నా కోళ్ల ఫామ్ యాజమాన్యం ఈగల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్థుల ఆరోపణ. ఈ నెల19న గ్రామస్తులు ఆందోళనతో చర్చలకు వచ్చిన కోళ్ల ఫామ్ యజమాని ఈగల నివారణకు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారుల సమక్షంలో మాటిచ్చారని గ్రామస్తులు చెప్పారు. రెండేళ్లుగా ఏమీ పట్టనట్లు వ్యవహరించడం వల్లే సమస్య జఠిలం అయ్యిందని వాపోతున్నారు. వాస్తవానికైతే, కోడిగుడ్ల ఫామ్‌ను నిత్యం శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఏసీలు వాడాలి. ఫామ్ చుట్టూరా నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలి. కోళ్లనుంచి వచ్చే వ్యర్ధాలను కంపోస్టు యార్డులకు తరలించాలి. ఫామ్స్‌లోనే కాకుండా స మీప గ్రామాల్లో దుర్వాసన రాకుం డా, ఈగలు పెరిగిపోకుండా మందుసులు స్ఫ్రే చేయాలి. కానీ.. ఇవేవీ వా స్తవంలో జరగకపోవడంతో ఒక్కో గ్రా మానికి సమస్య వ్యాప్తిచెందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment