టీడీపీకి కేశినేని మరో షాక్‌.. బాబు ఫ్లెక్సీల తొలగింపు | MP Kesineni Nani Removed TDP Party Flags And Chandrababu Banners On Kesineni Bhavan - Sakshi
Sakshi News home page

టీడీపీకి కేశినేని మరో షాక్‌.. బాబు ఫ్లెక్సీల తొలగింపు

Published Tue, Jan 9 2024 4:44 PM | Last Updated on Fri, Feb 2 2024 4:12 PM

MP Kesineni Nani Removed TDP, Chandrababu Flex On Kesineni Bhavan - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని.. టీడీపీ పార్టీకి మరో షాకిచ్చారు. రాజీనామా ప్రకటన అనంతరం కేశినేని భవన్‌పై టీడీపీ పార్టీ జెండాలు, బ్యానర్లను కేశినేని నాని తొలగించారు. చంద్రబాబు, ఎన్టీఆర్‌, కేశినేని నాని ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను మంగళవారం తొలగించారు. వాటీ స్థానంలో కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

కాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నాని బాటలో ఆయన కూతురు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కేశినేని శ్వేత తన విజయవాడ 11 డివిజన్‌ కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.
చదవండి: flash back: పిల్లి లేవని పొయ్యిపై చంద్రబాబు ఎసరు !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement