సాక్షి, బాపట్ల(గూంటూరు) : గతంలో ఎన్నడూ లేని విధంగా బాపట్ల నియోజకవర్గంలో ఫ్లెక్సీలు చించే సంస్కృతికి తెరతీశారు. డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిర్వహిస్తున్న గ్రామసభల్లో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్లేటప్పుడు స్వాగతం పలుకుతు ఆయా గ్రామాల్లోని పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు స్వార్ధపరులు కావాలనే చింపుతూ గ్రామాల్లో రాజకీయ రగడకు చిచ్చుపెడుతున్నారు. గ్రామసభలకు ముందు రోజు కానీ, గ్రామసభల తర్వాత రోజైనా తప్పనిసరిగా ఆయా గ్రామాల్లోని ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
బాపట్ల మండలంలోని హైదరపేట, గోపాపురం, కర్లపాలెం మండలంలోని చింతాయపాలెం, బుద్దాం గ్రామాల్లో ఇటీవల ఇదే రీతిలో ఫ్లెక్సీలు తొలగించారు. ఇదిలా ఉండగా తాజాగా ఆదివారం మండలంలోని పూండ్ల గ్రామంలో ఫ్లెక్సీలను చింపారని, గ్రామాల్లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే అవకాశాలుండాయంటూ పూండ్ల గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సీఐ శ్రీనివాసరెడ్డిను వివరణ కోరగా గ్రామాల్లో ఫ్లెక్సీలు తొలగిస్తున్న మాట వాస్తవమే. అయితే అవి ఆకతాయిల చేష్టలా లేక కావాలనే కొందరు వ్యక్తులు ఇలా చేస్తున్నారే అనే కోణంలో విచారిస్తున్నాం. వీటికి కారకులైన వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment