clashes between groups
-
Manipur Violence: మళ్లీ మణిపూర్‌లో హింస
ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో రావణకాష్టంగా మారుతున్న మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. శుక్రవారం అర్ధరాత్రిదాటాకా బిష్ణుపూర్ జిల్లాలో ఓ వర్గం వారిపై జరిగిన దాడిలో తండ్రీకుమారుడు, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. క్వాక్టా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాత్రి గాఢ నిద్రలో ఉండగా ఆందోళనకారులు వీరిపై కాల్పులు జరిపి తర్వాత కత్తులతో నరికారు. చురాచాంద్‌పూర్ ప్రాంతం నుంచి వచ్చిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. తమ వారి మరణంతో ఆగ్రహించిన స్థానికులు ప్రతీకారం తీర్చుకునేందుకు చురాచాంద్పూర్కు బయల్దేరబో యారు. వీరిని భద్రతాబలగాలు అడ్డుకున్నాయి. అయితే దాడికి ప్రతీకారంగా ఉఖా తంపాక్ పట్టణంలో పలువురి ఇళ్లను నిరసనకారులు తగలబెట్టారు. శనివారం ఉదయం మిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పోలీసుసహా ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. మళ్లీ హింసాత్మక ఘటనలు పెరగడంతో కర్ఫ్యూ సడలింపు సమయాన్ని పాలనా యంత్రాంగం కుదించింది. బంద్ ప్రశాంతం మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక ఘటనలను నిరసిస్తూ శాంతి నెలకొనాలంటూ 27 శాసనసభ స్థానాల సమన్వయ కమిటీ ఇచ్చిన 24 గంటల సాధారణ బంద్ ఇంఫాల్ లోయలో జనజీవనాన్ని స్తంభింపజేసింది. శనివారం దాదాపు అన్ని ప్రాంతాల్లో వ్యాపారాలు, స్కూళలు మూతబడ్డాయి. అల్లర్లతో అవస్థలు పడుతున్న జనాన్ని మరింత ఇబ్బందిపెట్టడం మా ఉద్దేశం కాదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ బంద్’ అని సమన్వయ కమిటీ ఎల్.వినోద్ స్పష్టంచేశారు. కుకీ మిలిటెంట్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చాన్నాళ్ల తర్వాత చర్చలు పునరుద్ధరించబడిన తరుణంలో అల్లర్లు మొదలవడం గమనార్హం. మరోవైపు శాంతిస్థాపనకు చర్యలు చేపట్టాలని స్థానిక తెగల నేతల ఫోరం(ఐటీఎల్ఎఫ్) విజ్ఞప్తిచేసింది. -
తీహార్ జైలులో గ్యాంగ్‌వార్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శుక్రవారం ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి ముఠా సభ్యుడు ప్రిన్స్ తేవాతియా మృతిచెందాడు. సాయంత్రం 5 గంటలకు జైలులో ఇరు వర్గాల మధ్య గ్యాంగ్‌వార్ జరిగినట్లు తెలిసింది. తేవాతియా కత్తిపోట్లకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని దీన్‌దయాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఘర్షణలో గాయపడిన మరో ఐదుగురు ఖైదీలను అధికారులు ఆసుపత్రికి తరలించారు. -
ఢిల్లీలో బీజేపీ vs ఆమ్ ఆద్మీ పార్టీ
-
సత్యసాయి జిల్లా కదిరి టీడీపీలో గ్యాంగ్‌వార్
-
Sri Sathyasai District: కదిరి టీడీపీలో గ్యాంగ్‌వార్.. ప్రాణాపాయస్థితిలో..
కదిరి టౌన్: నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా, నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి చాంద్ వర్గీయుడు శ్రీనివాసులు నాయుడిపై కందికుంట వర్గీయులు దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచారు. శ్రీనివాసులు నాయుడు ఈసారి తమ నేత చాంద్‌బాషాకే టికెట్ వస్తుందని సోషల్ మీడియాలో శుక్రవారం సాయంత్రం పోస్టు చేశాడు. దీన్ని కందికుంట వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. అతనిపై దాడి చేయాలని నిర్ణయించుకుని ఇంటి వద్దకు వెళ్లారు. దాడిలో గాయపడిన శ్రీనివాసులు నాయుడు అక్కడ లేకపోవడంతో పట్టణంలో గాలిస్తుండగా.. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని చాంద్ లాడ్జీ వద్ద ఆటోలో తారసపడ్డాడు. దీంతో అతనిపై కందికుంట వర్గీయులైన టీడీపీ పట్టణాధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, సయ్యద్, ఇమ్రాన్, సోను ఫయాజ్, బాబు, మారుతి, రామాంజనేయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చాంద్ వర్గీయులు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు కదిరి రూరల్ సీఐ రియాజ్ అహమ్మద్ తెలిపారు. చదవండి: (అక్రమాలు.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ ఇండస్ట్రీపై కేసు..) -
సినిమాను తలపించే రీతిలో హిజ్రాల గ్యాంగ్‌వార్
సాక్షి, నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో హిజ్రాలు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దాచేపల్లి ప్రాంతానికి చెందిన ఓ వర్గం గ్రూపువారు మిర్యాలగూడ పట్టణంలో ఉన్న షాపుల్లో డబ్బులు మరో వర్గం వారు సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇదే సమయంలో శృతి అనే హిజ్రాపై వ్యతిరేక వర్గం వారు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో శృతికి గాయాలు కావడంతో అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలో ఉన్న ఓ వస్త్ర దుకాణంలోకి వెళ్లి తలదాచుకుంది. షాపు యజమాని శృతిని కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని గాయపడిన శృతిని అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చదవండి: (ఆశ చంపమంది.. అపరాధ భావం చంపేసింది!) -
రెండు కుటుంబాల మధ్య భూ వివాదం
-
గ్రామాల్లో రగులుతున్న ఫ్లెక్సీల రగడ
సాక్షి, బాపట్ల(గూంటూరు) : గతంలో ఎన్నడూ లేని విధంగా బాపట్ల నియోజకవర్గంలో ఫ్లెక్సీలు చించే సంస్కృతికి తెరతీశారు. డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిర్వహిస్తున్న గ్రామసభల్లో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్లేటప్పుడు స్వాగతం పలుకుతు ఆయా గ్రామాల్లోని పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు స్వార్ధపరులు కావాలనే చింపుతూ గ్రామాల్లో రాజకీయ రగడకు చిచ్చుపెడుతున్నారు. గ్రామసభలకు ముందు రోజు కానీ, గ్రామసభల తర్వాత రోజైనా తప్పనిసరిగా ఆయా గ్రామాల్లోని ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. బాపట్ల మండలంలోని హైదరపేట, గోపాపురం, కర్లపాలెం మండలంలోని చింతాయపాలెం, బుద్దాం గ్రామాల్లో ఇటీవల ఇదే రీతిలో ఫ్లెక్సీలు తొలగించారు. ఇదిలా ఉండగా తాజాగా ఆదివారం మండలంలోని పూండ్ల గ్రామంలో ఫ్లెక్సీలను చింపారని, గ్రామాల్లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే అవకాశాలుండాయంటూ పూండ్ల గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సీఐ శ్రీనివాసరెడ్డిను వివరణ కోరగా గ్రామాల్లో ఫ్లెక్సీలు తొలగిస్తున్న మాట వాస్తవమే. అయితే అవి ఆకతాయిల చేష్టలా లేక కావాలనే కొందరు వ్యక్తులు ఇలా చేస్తున్నారే అనే కోణంలో విచారిస్తున్నాం. వీటికి కారకులైన వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాం అన్నారు. -
బెంగాల్లో చెలరేగిన హింస.. ఇద్దరి మృతి
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని భట్పారా ప్రాంతంలో చెలరేగిన హింస కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం గుర్తుతెలియని వ్యక్తుల మధ్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతరు ఉన్నతాధికారులు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచనల మేరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అల్లర్లలో రాంబాబు షా(17) అనే పానీ పూరీ బండి నడుపుకునే యువకుడు, మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనాస్థలంలో చిన్న సైజు బాంబు విసిరినట్లుగా, కాల్పులు జరిగినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. అల్లరి మూకల్ని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గాస్ ఉపయోగించారు. పోలీసులు గాలిలోకి కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం అందింది. ఇదంతా కూడా బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో డీజీపీ, స్థానిక పోలీస్ స్టేషన్‌కు సంబంధించి ఒక కొత్త బిల్డింగ్‌ను ప్రారంభించే ఒక గంట ముందు చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసి డీజీపీ కొత్త బిల్డింగ్‌ను ఓపెనింగ్ చేయకుండా తిరిగి కోల్‌కత్తాకు బయలుదేరి వెళ్లారు. అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో పాటు లోకల్ పోలీసులను ప్రభుత్వం మోహరించింది. అల్లర్ల నేపథ్యంలో దుకాణాలు, మార్కెట్లు మూతపడ్డాయి. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. -
కలహాల ‘కాంగ్రెస్’
సాక్షిప్రతినిధి, ఖమ్మం : వర్గ పోరుతో కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న పార్టీ ఉమ్మడి జిల్లాలో ఐక్యతారాగం ఆలపించలేకపోతోంది. మూడు గ్రూపులు.. ఆరు విభేదాలు అన్న చందంగా ఉంది పార్టీ పరిస్థితి. కార్యకర్తలకు ఉన్న నిబద్ధత.. కలిసికట్టుగా పనిచేసే విషయంలో నేతల మధ్య లేకపోవడం తమకు తలనొప్పిగా మారిందనే భావన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో పార్టీ బలోపేతమయ్యే సూచనలున్నా.. నేతలు మాత్రం ఎవరికి వారే యమునాతీరే అనే రీతిన వ్యవహరిస్తూ.. కొన్ని నియోజకవర్గాలపై మాత్రమే ప్రత్యేక దృష్టి సారించి.. మరికొన్నింటిని నిర్లక్ష్యం చేస్తున్నారని.. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వివిధ నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు అధికార టీఆర్ఎస్లో చేరారు. అయితే ఆది నుంచి కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న వర్గాలు మాత్రం ఎన్ని కష్టాలొచ్చినా అధిగమించి మంచి రోజులు వస్తాయన్న భావనతో కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాల్సిన ముఖ్య నేతలు కార్యకర్తలను సైతం గ్రూపుల వారీగానే గుర్తిస్తుండటం.. ఒకరి వద్దకు వెళ్తే మరొకరికి కంటగింపుగా మారడం.. వారికి జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సభలు, సమావేశాలకు కార్యకర్తలు వర్గ రహితంగా హాజరవుతున్నా.. కొందరు ముఖ్య నేతలు మాత్రం వర్గాలవారీగానే జన సమీకరణ చేసి జిల్లాలో తమ పట్టు నిరూపించుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఏ సభకు వెళ్తే ఏం తంటానో..? వెళ్లకపోతే ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియని అయోమయ పరిస్థితి తమదని పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదింటికి.. నాలుగు.. ఉమ్మడి జిల్లాలో 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 10 స్థానాలకు.. నాలుగు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పాలేరు నుంచి గెలుపొందిన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించగా.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన మధిర ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఒక్కరే ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సత్తుపల్లి, వైరా, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పార్టీ మళ్లీ జవసత్వాలు పుంజుకునే అవకాశం ఉన్నా.. నాయకత్వం పూర్తిస్థాయి దృష్టి సారించకపోవడంతో స్థానిక నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఇక మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, శాసన మండలి ఉప నాయకుడిగా జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యురాలిగా రేణుకా చౌదరి కాంగ్రెస్ నుంచి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి జిల్లాలో అనేక పర్యటనలు చేస్తున్న సందర్భంలో.. భట్టి విక్రమార్క జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలోనూ కార్యకర్తలు హాజరవుతున్నా.. ఒక వర్గం సమావేశానికి మరో వర్గం దూరంగా ఉంటోందని, తమకు సమాచారం లేదని ఒక వర్గం చెబుతుండగా.. తమను ఆహ్వానించడం లేదని మరో వర్గం ఆయా సమావేశాలకు దూరంగా ఉంటుండటంతో కాంగ్రెస్‌లో వర్గ పోరుకు అద్దం పడుతోంది. రేణుకా చౌదరి ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు హాజరైనా.. భట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడైన డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యంతోపాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కాలేదు. ఇదే తరహాలో మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలోనూ.. ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో రేణుక వర్గం దూరంగా ఉంటోందని కాంగ్రెస్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. జిల్లాలో కాంగ్రెస్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందన్న ఆలోచనతో పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నా.. ఏ వర్గంలో మనగలుగుతామో..? ఎవరితో ఇమడ గలుగుతామో..? తేల్చుకోలేక వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నాయకుడు పోట్ల నాగేశ్వరరావు మాజీ మంత్రి రేణుకా చౌదరి నేతత్వంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ.. ఆ పార్టీ నుంచి ఖమ్మం, పాలేరు, వైరా, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేట వంటి నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ‘కొత్త’లో కుతకుత! ఇక కాంగ్రెస్‌కు గట్టి పట్టుకున్న కొత్తగూడెం నియోజకవర్గంలోనూ పార్టీ వర్గ పోరుతో కుతకుతలాడుతోంది. అక్కడ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మరో కాంగ్రెస్ నేత ఎడవల్లి కృష్ణ వేర్వేరు శిబిరాలు ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తుండటం.. ప్రతి కార్యక్రమాన్ని పోటాపోటీగా నిర్వహిస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు, వైరా వంటి గిరిజన నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలను కన్నెత్తి చూసే నాయకుడే లేరని, ఇప్పటివరకు పార్టీ బలంగా ఉన్నా.. తమ నాయకుడు ఎవరో తెలియని పరిస్థితి అక్కడి కార్యకర్తల్లో ఉంది. ఇల్లెందు నుంచి గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన హరిప్రియ కాంగ్రెస్‌లో చేరగా.. ఆమె ఇల్లెందు టికెట్ ఆశిస్తున్నారు. అలాగే భూక్యా దళ్‌సింగ్ సైతం ఈసారి ఇల్లెందు టికెట్‌పై ఆశలు పెట్టుకుని.. తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక ఖమ్మం నియోజకవర్గంపై అనేక మంది ప్రముఖులు కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోని నేతలతోపాటు చిరకాలంగా పార్టీలో కొనసాగుతున్న నేతలు, ఇందుకోసమే పార్టీలో చేరిన నేతలు అనేక మంది ఈ స్థానాన్ని ఆశిస్తుండటంతో ఖమ్మం రాజకీయం రసకందాయంలో పడింది. పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పోటీ చేస్తారని ఆయన అనుచరులు ఆశిస్తుండగా.. అదే నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ కందాల ఉపేందర్‌రెడ్డి ఈసారి టికెట్ కోసం భారీస్థాయిలో ప్రయత్నం చేస్తూ.. క్షేత్రస్థాయిలో ఇప్పటికే కార్యకర్తలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభలు ఎక్కడ పెట్టినా విజయవంతం అవుతున్నాయని, నేతల వైఖరి వల్ల ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక తారుమారైతే ఎన్నికల ఫలితాల్లో తేడా వచ్చే అవకాశం ఉందని, పార్టీ కోసం పనిచేసే నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం జిల్లా కాంగ్రెస్ పరిస్థితిపై దృష్టి సారించి నేతలను ఏకతాటిపై నడిపించేందుకు ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఖమ్మం జిల్లాకు ముగ్గురు నేతలతో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో ఈ కమిటీని నియమించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
ఖమ్మం జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ..
చించుపల్లి : ఖమ్మం జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చించుపల్లి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామవరంలో ఆదివారం ఉదయం ఒక వర్గం వారు ఇనుపరాడ్లతో మరో వర్గంపై దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కిరణ్ పాసీ అనే వ్యక్తి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.