సినిమాను తలపించే రీతిలో హిజ్రాల గ్యాంగ్‌వార్‌ | Clash Between Two Groups of Transgenders In Nalgonda District | Sakshi
Sakshi News home page

సినిమాను తలపించే రీతిలో హిజ్రాల గ్యాంగ్‌వార్‌

Published Mon, Oct 4 2021 1:06 PM | Last Updated on Mon, Oct 4 2021 1:27 PM

Clash Between Two Groups of Transgenders In Nalgonda District - Sakshi

సాక్షి, న‌ల్ల‌గొండ: జిల్లాలోని మిర్యాల‌గూడ ప‌ట్టణంలో హిజ్రాలు న‌డిరోడ్డుపై వీరంగం సృష్టించారు. రెండు రోజుల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాచేపల్లి ప్రాంతానికి చెందిన‌ ఓ వ‌ర్గం గ్రూపువారు మిర్యాల‌గూడ ప‌ట్టణంలో ఉన్న షాపుల్లో డ‌బ్బులు  మ‌రో వ‌ర్గం వారు స‌మాచారం అందుకుని అక్క‌డ‌కు చేరుకున్నారు. ఈ స‌మ‌యంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది.

ఇదే స‌మ‌యంలో శృతి అనే హిజ్రాపై వ్య‌తిరేక వ‌ర్గం వారు దాడి చేసి విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టారు. ఈ ఘ‌ట‌నలో శృతికి గాయాలు కావ‌డంతో అక్క‌డి నుంచి త‌ప్పించుకుని స‌మీపంలో ఉన్న ఓ వ‌స్త్ర దుకాణంలోకి వెళ్లి త‌ల‌దాచుకుంది. షాపు య‌జ‌మాని శృతిని కాపాడి పోలీసులకు స‌మాచారం అందించారు. పోలీసులు ఘ‌ట‌న‌స్థ‌లానికి చేరుకుని గాయ‌ప‌డిన శృతిని అక్క‌డి నుంచి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అనంత‌రం చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

చదవండి: (ఆశ చంపమంది.. అపరాధ భావం చంపేసింది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement