
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శుక్రవారం ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి ముఠా సభ్యుడు ప్రిన్స్ తేవాతియా మృతిచెందాడు. సాయంత్రం 5 గంటలకు జైలులో ఇరు వర్గాల మధ్య గ్యాంగ్‌వార్ జరిగినట్లు తెలిసింది.
తేవాతియా కత్తిపోట్లకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని దీన్‌దయాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఘర్షణలో గాయపడిన మరో ఐదుగురు ఖైదీలను అధికారులు ఆసుపత్రికి తరలించారు.