మంత్రి ఫ్లెక్సీలకు పోలీసుల కాపలా! | Flex feud in tadepalligudem | Sakshi
Sakshi News home page

మంత్రి ఫ్లెక్సీలకు పోలీసుల కాపలా!

Published Sun, Oct 23 2016 1:53 PM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM

తాడేపల్లిగూడెం బస్టాండ్‌ ఎదురుగా ఉన్న మంత్రి ఫ్లెక్సీ వద్ద గస్తీ కాస్తున్న పోలీసులు - Sakshi

తాడేపల్లిగూడెం బస్టాండ్‌ ఎదురుగా ఉన్న మంత్రి ఫ్లెక్సీ వద్ద గస్తీ కాస్తున్న పోలీసులు

తాడేపల్లిగూడెం: మంత్రులకు పోలీసులు భద్రత కల్పించడం సాధారణ విషయం. ఇందుకు భిన్నంగా దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తన పేరిట అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు పోలీసు కాపలా పెట్టించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బస్టాండ్‌ ఎదుట వీధిలో నివాసం ఉంటున్న మంత్రి.. తన ఇంటికి వెళ్లే మార్గంలో గల ఫ్లెక్సీలకు నలుగురు పోలీసులను కాపలా ఉంచారు. రెండు షిఫ్టుల్లో మొత్తం 8 మంది పోలీసులు ఆ ఫ్లెక్సీల వద్ద డ్యూటీ చేస్తున్నారు.

అదే వీధిలో నివాసం ఉంటున్న వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయబోగా.. మంత్రి, ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ప్రతిష్ట కోసమో లేక మరేదైనా కారణమో తెలియదు గానీ.. తన పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ఇలా పోలీసు కాపలా ఏర్పాటు చేసుకున్నారు. ఇది చూసిన వారంతా ‘మంత్రా.. మజాకా’ అనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement