
సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. విమానాశ్రయ భూముల నిర్వాసితులకు పట్టాలు ఇవ్వడంలో టీడీపీ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. వారికి మద్దతుగా తాడేపల్లి గూడెంలో శుక్రవారం ఆయన నిరసన దీక్ష చేపట్టారు. భూ నిర్వాసితులకు పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చంద్రబాబు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను రెచ్చగొడితే తిరగబడతామని హెచ్చరించారు.
అవసరమైతే కర్రలు చేతబట్టి ప్రభుత‍్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు. ‘మర్రి చెన్నారెడ్డినే తరిమిన ఘనత మాది. ఆఫ్ట్రాల్ చంద్రబాబును తరిమికొట్టడం పెద్ద కష్టం కాదు. దమ్ముంటే మా నిరసన దీక్షని అడ్డుకోండి’ అని సవాల్ చేశారు. నిట్ ప్రారంభోత్సవంలో బాబు ఇచ్చిన 56 హామీలకు కూడా అతీగతీ లేదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment