
విశాఖపట్నం : విశాఖపట్నం పాయకరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ రాక సందర్భంగా 30 అడుగుల ఫ్లెక్సీని అభిమానులు తయారు చేపించారు. పవన్ అభిమానులు శివ, నాగ రాజులు ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ వైర్లు తగిలి షాక్‌కు గురవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందారు. వీరిద్దరు తుని, పాయకరావుపేట వాసులుగా గుర్తించారు. సూర్యమహల్ సెంటర్‌లో ఫ్లెక్సీ అమర్చుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.