ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పులిచింతలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
పులిచింతల: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పులిచింతలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ వద్ద ఇన్‌ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 2.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 29 టీఎంసీలు.
పులిచింతల నుంచి దిగువకు 2.50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు నీటి విడుదలను పరిశీలించాలని, ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలని అధికారులకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు.