నల్గొండ : నల్గొండ జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం బుధవారం 47.59 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులోకి 29,373 క్యూసెక్కుల నీరు వస్తుండగా..9,929 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి అధికారులు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21.30 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.