కాంగ్రెస్ ఆరోపణలపై మంత్రి హరీశ్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రాంతంలో మూడో పంటకు నీరిచ్చేందుకని పులిచింతల ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే నోరు మెదపని టీకాంగ్రెస్ నేతలు, తెలంగాణలో మొదటి పంటకు నీరందించేందుకు చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌కు అడ్డుపడుతుండటం విడ్డూరంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. జీవో 123 రద్దుపై హైకోర్టు డివిజన్ స్టే ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, భూసేకరణను త్వరగా చేయడంతో పాటు రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకే ప్రభుత్వం జీవో 123ను తీసుకువచ్చిందన్నారు.
ఏదైనా గ్రామంలో 2013 చట్టం ప్రకారం ఎవరైనా పరిహారం కోరితే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ మేరకు రైతులకు ఏదైనా నష్టం జరిగితే కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాల్సి వస్తుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులు ఏవిధమైన పరిహారం కావాలంటే ఆ విధంగా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, ముంపు గ్రామాల బాధితుల బాధలు సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. రైతులతో పాటు రైతు కూలీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కూడా మెరుగైన నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌తో సంతృప్తి చెందినందునే హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా తీర్పునిచ్చిందన్నారు.
‘పులిచింతల’పై నోరెందుకు పెగల్లేదు?
Published Wed, Aug 10 2016 1:22 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement