మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: చంద్రబాబు కమీషన్ల కక్కుర్తే పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోవడానికి కారణమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుతోపాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కాంట్రాక్టర్ బొల్లినేని రామారావు నిర్వాకాలు పులిచింతల ప్రాజెక్టు, కృష్ణా డెల్టా రైతులను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయని మండిపడ్డారు. పులిచింతల పాపం ముమ్మాటికీ బాబుదేనని విమర్శించారు. ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని 2015లోనే భద్రతా కమిటీ నివేదిక ఇచ్చినా బాబు సర్కారు బేఖాతరు చేసిందన్నారు. ఆనాడే చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు.
సగర ఉప్పర కులస్తుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగింది. దీనికి సగర ఉప్పర కార్పొరేషన్ చైర్‌పర్సన్ గానుపెంట రమణమ్మ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేత బంగారు శీనయ్యలు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి సజ్జల మాట్లాడుతూ బీసీల్లో చిన్న కులాల నేతలను ప్రజాప్రతినిధులుగా ఎదిగేలా చేసేందుకు సీఎం జగన్ ధృడసంకల్పంతో ఉన్నారన్నారు. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ చిన్నగోవిందరెడ్డి, నవరత్నాల అమలు కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
ఏపీ కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment