‘పులిచింతల’లో పెరుగుతున్న నీరు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ క్రమ క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటి తాజా సమాచారం మేరకు ప్రాజెక్టులో 23.23 టీఎంసీలకు నీటి నిల్వ పెరిగింది. ప్రాజెక్టులోకి 9,953 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి స్లూయజ్‌లద్వారా 19,636 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటినిల్వలు పెరగడంతో భూగర్భజలాలు పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.