27 లేదా 30న ‘పులిచింతల’ ప్రారంభోత్సవం | Pulichintala project opening to be held on November 27 or November 30 | Sakshi
Sakshi News home page

27 లేదా 30న ‘పులిచింతల’ ప్రారంభోత్సవం

Published Fri, Nov 22 2013 2:32 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Pulichintala project opening to be held on November 27 or November 30

హుజూర్‌నగర్, న్యూస్‌లైన్ : నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం వజినేపల్లి సమీపంలో కృష్ణానదిపై నిర్మిస్తున్న పులిచింతల ప్రాజెక్ట్‌ను ఈనెల 27  లేదా 30వ తేదీన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభిస్తారని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ సాంబయ్య వెల్లడించారు. ప్రాజెక్ట్‌ను నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ గురువారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సీఈ సాంబయ్య విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో 97 శాతం పూర్తి అయ్యాయన్నారు. ప్రాజెక్ట్‌లో దాదాపు 8 నుంచి 10 టీఎంసీల నీటిని నిల్వచేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement