ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందాం: ఉత్తమ్
పులిచింతలపై హరీశ్‌కు సవాల్
సాక్షి, హైదరాబాద్: పులిచింతల ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సవాల్ విసిరారు. పులిచింతల ముంపు ప్రాంతాలు మేళ్లచెరువు, మఠంపల్లి, నేరెడుచర్ల మండలా లకు చెందిన రైతులతో కలసి మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘హరీశ్‌రావులా నాకు దోచుకోవడం రాదు. టీఆర్‌ఎస్‌లా ఆంధ్రా కాంట్రాక్టర్లకు దాసోహం కాలేను. దేశం కోసం సైన్యంలో పనిచేశా. ప్రా ణాలకు తెగించి యుద్ధం చేశా. అదే స్ఫూర్తితో ప్రజల్లోకి వచ్చి పనిచేస్తున్నా.
పులిచింతల సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టు పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయో, ఎప్పుడు పూర్తయ్యాయో ప్రాజెక్టు పరిసరాలు, ముంపు గ్రామాల్లోకి వెళ్లి తేల్చుకుందాం’ అని సవాల్ చేశారు. వాస్తవాలను దాచిపెట్టి హరీశ్‌రావు, టీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు మాట్లాడ టం తగదన్నారు. పులిచింతల ప్రాజె క్టుతో తమ పొలాలకు నీరొచ్చిందని, పునరావాస ప్యాకే జీతో తమ జీవితాలు బాగుపడ్డాయని మఠంపల్లి, నేరెడు చర్ల, మేళ్లచెరువు మండలాల స్థానిక సంస్థల ప్రజా ప్రతి నిధులు, రైతులు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో టీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు.
కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతీ రైతుకు రూ.2 లక్షల చొప్పున పంట రుణాలను మాఫీ చేస్తామని టీపీసీసీ కిసాన్ సెల్ సమావేశంలో ఉత్తమ్ చెప్పారు.