మాజీ మంత్రి హరీశ్‌రావు
బూతులు మాట్లాడటంలోరేవంత్‌తో ఉత్తమ్ పోటీ
ప్రాజెక్టుల పేరిట అడ్వాన్సులుదండుకుంది కాంగ్రెస్సే
పేదల నుంచి విద్యుత్ బిల్లుల వసూలు దుర్మార్గం
సాక్షి, హైదరాబాద్: బూ తులు మాట్లాడటంలో ముఖ్యమంత్రి రేవంత్‌తో పోటీ పడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోటి ని ప్రక్షాళన చేయాలని బీ ఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తమ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి.. ‘డెకాయిట్’అని మంత్రి ఉత్తమ్ చేసి న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బూతు లు మాట్లాడటం, అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగించడంలో రేవంత్ కంటే తాను వెనుకబడిలేనని ఉత్తమ్ నిరూపించాలనుకుంటున్నారు. పేరు ఉత్తమ్ కానీ మాటతీరు మూసీ ప్రవాహం. గత కాంగ్రెస్ పాలనలో జలయజ్ఞం పేరిట ఈపీసీ కాంట్రాక్టు విధానం, మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు.
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.17 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచారు. గతంలో ఉత్తమ్ మంత్రిగా ఉన్న ప్రభుత్వం 2010లో రూ.40,300 కోట్లకు డీపీఆర్‌ను సవరించి పంపించింది. జూన్ 2014 వరకు రూ.1,420 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజాధనాన్ని ‘డెకాయిటీ’చేస్తే అందులో ఉత్తమ్ భాగస్వామిగా ఉన్నారు’అని హరీశ్‌రావు మండిపడ్డారు.
మానవాభివృద్ధి సూచికల్లో అగ్రగామి
‘తెలంగాణ అవతరించిన తొమ్మిదేళ్లలో వ్యవసాయరంగం అభివృద్ధి, ఇతర మానవాభివృద్ధి సూచికల్లో దేశంలోనే తెలంగాణను కేసీఆర్ అగ్రగామిగా నిలబెట్టారు. ఆహార పంటల ఉత్పత్తిలో 16.42 శాతం వృద్ధిరేటు సాధించి పంజాబ్, హరియాణా, పశి్చమ బెంగాల్, మహారాష్ట్రలాంటి పెద్ద వ్యవసాయ రాష్ట్రాలను తెలంగాణ వెనక్కి నెట్టింది. తెలంగాణలో 2014–15లో పంటల సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా.. 2022–23 నాటికి 2.21 కోట్ల ఎకరాలకు పెరిగింది.
కాళేశ్వరాన్నిపూర్తి చేయడంతో పాటు కాంగ్రెస్ అర్ధాంతరంగా వదిలేసిన అనేక ప్రాజెక్టులను పూర్తి చేశాం. వ్యవసాయ రంగంలో తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టిన కేసీఆర్‌ను విమర్శించడం దారుణం’అని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను తమవిగా చెప్పుకోవడం కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదన్నారు.
విద్యుత్ బిల్లుల వసూలు దుర్మార్గం
‘గృహజ్యోతి’పథకాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని హరీశ్‌రావు ‘ఎక్స్’లో విమర్శించారు. పేదలకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నామంటూ డబ్బా కొట్టుకుని, మ రో వైపు ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్నా రని, జీరో బిల్లులు రావడం లేదనే సాకుతో పేదల నుంచి బిల్లులు వసూలు చేయడం దుర్మార్గమని వి మర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి న ఆరు గ్యారంటీలు, 13 హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment