ఉత్తమ్‌వి చౌకబారు ఆరోపణలు: కర్నె
ఉత్తమ్‌వి చౌకబారు ఆరోపణలు: కర్నె
Published Thu, Jul 13 2017 7:31 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
హైదరాబాద్: పులిచింతల హైడల్ ప్రాజెక్టుపై టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. హుజూర్‌నగర్ ప్రాంతానికి చెందిన కొందరు కాంగ్రెస్ రైతులను గాంధీ భవన్‌కు తీసుకువచ్చి అన్నీ అసత్యాలే చెప్పించారని ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ నేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
పులిచింతల ప్రాజెక్టు కింద 13 ముంపు గ్రామాల ప్రజలకు సరైన నష్ట పరిహారం ఇప్పించని ఉత్తమ్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముంపు పరిహారం విషయంలో నల్లగొండ జిల్లా రైతులకు ఉత్తమ్ అన్యాయం చేశారని ఆరోపించారు. మాయ మాటలు చెప్పి తమ భూములు లాక్కున్నారని, పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల పరిహారానికి సంబంధించిన జీవో 68ని పరిశీలిస్తే జరిగిన అన్యాయం తెలిసిపోతుందని హుజూర్‌నగర్ రైతులు వెల్లడించారని పేర్కొన్నారు.
Advertisement