
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ పార్టీ మండిపడింది. ఉత్తమ్ వాస్తవాలను తెలుసుకోలేక మాట్లాడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి అధికారిక నివాసమన్నారు. అంతేతప్ప అది ఎవరి సొత్త కాదని తెలిపారు.
ప్రగతిభవన్‌లో 150 గదులుంటాయని కాంగ్రెస్ నేతలే అంటున్నారన్నారు. కేసీఆర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించమని హెచ్చరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంటే.. అవినీతి అంటారా అని ఆయన ప్రశ్నించారు.